Viral Video: పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న పెద్దాయనా.. నీకు హ్యాట్సాఫ్.. ఈయన గురించి నిజం తెలిసినా ఉద్యోగమిచ్చిన వ్యక్తి ఎవరో కానీ..!

ABN , First Publish Date - 2023-06-04T13:23:21+05:30 IST

మన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలకే చాలాసార్లు మనం నానా హైరానా పడిపోతుంటాం.

Viral Video: పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న పెద్దాయనా.. నీకు హ్యాట్సాఫ్.. ఈయన గురించి నిజం తెలిసినా ఉద్యోగమిచ్చిన వ్యక్తి ఎవరో కానీ..!

Viral Video: మన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలకే చాలాసార్లు మనం నానా హైరానా పడిపోతుంటాం. ఇక అయిపోయింది.. చేయడానికి ఏం లేదంటూ బెంబేలెత్తి పోతుంటాం. అలాంటిది ఏదైనా ప్రమాదం జరిగి ఓ చేయ్యో, కాలో లేక కన్నో పోతే. అలాంటివారి పరిస్థితి తలచుకుంటేనే భయమేస్తుంది కదూ. ఇక అలాంటి వారిని నా అనేవాళ్లు కూడా దూరం పెట్టడం మనం మన చుట్టుపక్కలనే చూసి ఉంటాం. దాంతో వారు పూర్తిగా కృంగిపోయి.. తమ జీవితంపట్ల తీవ్ర విరక్తితో ఉండిపోతారు. ఇంకొందరైతే అన్ని సరిగ్గా ఉన్న పని చేయడం చేతకాక.. ఏవో షాకులు చెబుతూ కాలం వేళ్లదీస్తుంటారు. కానీ, మనం ఇప్పుడు ఇక్కడ చెప్పుకుబోయే వ్యక్తి మాత్రం వీటన్నింటికి మినహాయింపు అనే చెప్పాలి. అంగవైకల్యం (Handicapped) శరీరానికే గానీ, మనసుకు కాదు అని నిరూపిస్తున్నాడు. తనదైన శైలిలో జీవితాన్ని ముందుకు నడిపిస్తూ.. తన కుటుంబానికి ఆసరా అవుతున్నాడు. ఆ వ్యక్తి తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది (Video goes Viral). వీడియో చూసిన నెటిజన్లు అతనికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

లూటేరా (@__Lootera) అనే ట్విటర్ యూజర్ ఈ నెల 2న వీడియోను పోస్ట్ చేశారు. వీడియోలో ఓ వ్యక్తి ఒంటి కాలితో పెట్రోల్ బంక్‌లో (Petrol pump) పని చేయడం మనం చూడొచ్చు. మొదట ఓ కారు వచ్చి ఆగగానే దాని ట్యాంక్ ఫుల్ చేసిన అతడు.. కొద్దిసేపటి తర్వాత మరో కారు రావడంతో దాని వద్దకు ఒంటికాలితో కుంటుతూ వెళ్లి అందులో కూడా పెట్రోల్ పోయడం మనం గమనించవచ్చు. అలా అతడు ఒంటికాలితో కష్టపడడం చూసిన ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఈ సందర్భంగా అతడిని పలకరించగా.. నీకు నీ జీవితంపట్ల ఏమైనా కంప్లయింట్స్ ఉన్నాయా? అని అడిగితే.. అతడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? "అబ్బే.. అలాంటివేవి లేవండి. నేను కేవలం నా పనిపైనే దృష్టి పెడతాను. మిగతవాటితో నాకు పనేంటి?" అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ వ్యక్తి తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు వీడియోను 1.17లక్షల మంది వీక్షించారు. దాదాపు 5వేల వరకు లైక్స్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. 'నీకు హ్యాట్సాఫ్ బ్రదర్. నీ గుండె ధైర్యానికి సెల్యూట్' అని కామెంట్ చేస్తున్నారు.

Viral Video: ఇది దైవ లీలేనా..? డాక్టర్లకే అంతుచిక్కని విచిత్రం.. మూడు రోజుల పాప ఎన్ని సిత్రాలు చేస్తోందో మీరే చూడండి..!


Updated Date - 2023-06-04T13:23:21+05:30 IST