Viral News: రోడ్డు పక్కన ఓ దాబాలో తనిఖీలకు వెళ్లిన పోలీసులు.. అందులో పనిచేసే ఓ కుర్రాడిపై డౌట్.. ఆరా తీస్తే 24 ఏళ్ల క్రితం నాటి మిస్టరీ వెలుగులోకి..!

ABN , First Publish Date - 2023-05-31T11:50:35+05:30 IST

అది రాజస్థాన్ రాష్ట్రం ధోల్‌పూర్ జిల్లా పరిధిలోని దౌసా ప్రాంతం. ఇటీవల ఇక్కడి హైవేపై ఉన్న దాబాలలో పోలీసులు వరుస తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Viral News: రోడ్డు పక్కన ఓ దాబాలో తనిఖీలకు వెళ్లిన పోలీసులు.. అందులో పనిచేసే ఓ కుర్రాడిపై డౌట్.. ఆరా తీస్తే 24 ఏళ్ల క్రితం నాటి మిస్టరీ వెలుగులోకి..!

ఇంటర్నెట్ డెస్క్: అది రాజస్థాన్ రాష్ట్రం ధోల్‌పూర్ జిల్లా పరిధిలోని దౌసా ప్రాంతం. ఇటీవల ఇక్కడి హైవేపై ఉన్న దాబాలలో పోలీసులు వరుస తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఓ దాబాలో తనిఖీలకు వెళ్లారు పోలీసులు. అయితే, అందులో పనిచేసే ఓ యువకుడిపై పోలీసులకు అనుమానం కలిగింది. వెంటనే అతడిని విచారించారు. అతడు చెప్పిన తన వ్యక్తిగత సమాచారంపై పోలీసులకు డౌట్ వచ్చింది. దాంతో 24 ఏళ్ల క్రితం ధోల్పూర్ కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో (Dholpur Kotwali police station) నమోదైన ఓ పాత కేసును బయటకు తీశారు. అంతే.. వారి అనుమానమే నిజమైంది. ఆ కుర్రాడి 24 ఏళ్ల మిస్టరీ బయటకు వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ధోల్పూర్ జిల్లాలోని దౌసా సమీపంలోని ఉండే మాన్పూర్ ప్రాంతానికి చెందిన కిర్తిరామ్ బఘేల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయన కుమారు నిత్యకిశోర్ బఘేల్. అతడికి ఎనిమిదో తరగతిలో మార్కులు తక్కువ వచ్చాయి. దాంతో తండ్రి ఏమంటాడో అని భయపడి ఇంట్లోంచి పారిపోయాడు. అప్పుడు నిత్యకిశోర్‌కు 14 ఏళ్లు. దాంతో కొడుకు కోసం తండ్రి చుట్టుపక్కల ప్రాంతాలలో వెతికాడు. కానీ, ఎక్కడ అతడు దొరకలేదు. దాంతో ధోల్పూర్ కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో 1999 జనవరి 25న తన కుమారు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా బాగానే వెతికారు. అయినా నిత్యకిశోర్ జాడ కనిపెట్టలేకపోయారు.

మీ అమ్మాయికి కడుపునొప్పి వస్తోందట.. వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లండంటూ నీట్ కోచింగ్ సెంటర్ నుంచి ఫోన్.. డాక్టర్లు చెప్పింది విని..!


Miss.jpg

పదేళ్లపాటు ఆ తండ్రి తన కుమారుడి కోసం రాజస్థాన్‌తో పాటు యూపీ, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్ తదితర రాష్ట్రాలలో కూడా వెతికాడు. కానీ, అతడు దొరకకపోవడంతో ఎప్పటికైనా తిరిగి వస్తాడులే అని అనుకున్నారు. అలా 24ఏళ్లు గడిచిపోయాయి. నిత్యకిశోర్‌కు 38ఏళ్లు వచ్చేశాయి. ఇక ఇంట్లోంచి వెళ్లిపోయిన తర్వాత అతడు రాజస్థాన్‌లోనే వివిధ ప్రాంతాలలో తిరుగుతూ దాబాలు, హోటళ్లలో పని చేస్తూ జీవనం సాగించాడు. ఆ తర్వాత వంటలు చేయడం నేర్చుకున్న అతడు.. ఇటీవలే ధోల్‌పూర్ జిల్లా పరిధిలోని దౌసా ప్రాంతం హైవేపై ఉన్న ఓ దాబాలో చెఫ్‌గా చేరాడు. ఈ క్రమంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అతడు తన వ్యక్తిగత వివరాల విషయంలో తప్పుడు సమాచారం ఇవ్వడంతో పోలీసులకు అనుమానం కలిగింది. తన పేరును సునీల్‌గా చెప్పడంతో పాటు ప్రస్తుతం అతడు ఉంటున్న అడ్రస్‌ తప్పుగా చెప్పాడు.

Crime: ఈ డౌట్ ముందే వచ్చి ఉంటే రూ.4.50 లక్షలు మిగిలేవి కదమ్మా.. 37 ఏళ్ల బెంగళూరు మహిళకు షాకింగ్ అనుభవం..!

Misss.jpg

ఇక పోలీసులు అతడు చెప్పిన చిరునామాకు వెళ్లి దర్యాప్తు చేయగా అసలు విషయం బటయకు వచ్చింది. అతడి పేరు సునీల్ కాదని, నిత్యకిశోర్ బఘేల్ అని తెలిసింది. దాంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ సమయంలో అతడు 24ఏళ్ల క్రితం ఇంట్లోంచి పారిపోయి వచ్చిన విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. దాంతో పోలీసులు ధోల్పూర్ కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా స్థానికంగా పోలీసులు దర్యాప్తు చేసి, అతని తండ్రి కిర్తిరామ్ బఘేల్‌కు ఫోన్ చేశారు. మీ అబ్బాయి నిత్యకిశోర్ దొరికాడని, వచ్చి తీసుకెళ్లాల్సిందిగా చెప్పారు. వెంటనే కిర్తిరామ్ బఘేల్ పోలీసులు చెప్పిన దౌసా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ 24 ఏళ్ల తర్వాత కొడుకును చూసి ఏడ్చేశాడు. అనంతరం పోలీసులు నిత్యకిశోర్‌ను అతని తండ్రితో పంపించేశారు. ఇలా 24 ఏళ్ల క్రితం నాటి మిస్టరీ వీడింది.

Open Work Permit: ఫ్యామిలీతో సహా కెనడాలో సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నారా? అయితే, ఇది మీ కోసమే..!


Updated Date - 2023-05-31T11:50:35+05:30 IST