Open Work Permit: ఫ్యామిలీతో సహా కెనడాలో సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నారా? అయితే, ఇది మీ కోసమే..!

ABN , First Publish Date - 2023-05-31T08:42:37+05:30 IST

కెనడాలో ఫ్యామిలీతో సహా సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నవారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ దేశంలో కొనసాగుతున్న కార్మికుల కొరతను అధిగమించడానికి ఇపుడు అక్కడ వర్క్ పర్మిట్లకు సంబంధించిన నిబంధనలను మరింత సరళతరం చేసే యోచనలో కెనడా సర్కార్ ఉంది.

Open Work Permit: ఫ్యామిలీతో సహా కెనడాలో సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నారా? అయితే, ఇది మీ కోసమే..!

ఎన్నారై డెస్క్: కెనడాలో ఫ్యామిలీతో సహా సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నవారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ దేశంలో కొనసాగుతున్న కార్మికుల కొరతను (Labor Shortage) అధిగమించడానికి ఇపుడు అక్కడ వర్క్ పర్మిట్లకు (Work Permit) సంబంధించిన నిబంధనలను మరింత సరళతరం చేసే యోచనలో కెనడా సర్కార్ ఉంది. వర్క్ పర్మిట్ విషయంలో పలు సడలింపులు చేయాలని చూస్తోంది. దీనిలో భాగంగా విదేశీయులు శాశ్వతంగా తమ దేశంలో ఫ్యామిలీలతో కలిసి పని చేయడానికి కూడా అనుమతించేలా తాజాగా ఓపెన్ వర్క్ పర్మిట్ (Open Work Permit) విధానాన్ని కెనడియన్ ప్రభుత్వం ప్రకటించింది.

అంతేగాక కార్మికుల కొరతను సాధ్యమైనంత త్వరగా తగ్గించాలని భావిస్తున్న అక్కడి ప్రభుత్వం.. వీసాల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే ఎవరైనా తమ జీవిత భాగస్వామి (Life Partner) కోసం పెట్టుకున్న వీసా దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిశీలించి మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత డివిజన్ల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అలాగే కొత్తగా కెనడాకు రావాలనుకునేవారి దరఖాస్తులను కేవలం నెల రోజుల్లోనే పరిష్కరించాలని కూడా సూచించినట్టు సమాచారం. ఇక కెనడా తీసుకున్న ఈ నిర్ణయం ఆ దేశానికి కొత్తగా ఉద్యోగ, ఉపాధిల కోసం వెళ్లే వారికి నిజంగా గోల్డెన్ ఛాన్స్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబంతో సహా కెనడాలో సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నవారు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

Idealz: అదృష్టం అంటే ఇతడిదే.. సౌదీలో రాత్రికి రాత్రే మల్టీ మిలియనీర్‌గా మారిన భారతీయుడు!


Updated Date - 2023-05-31T08:42:37+05:30 IST