Idealz: అదృష్టం అంటే ఇతడిదే.. సౌదీలో రాత్రికి రాత్రే మల్టీ మిలియనీర్‌గా మారిన భారతీయుడు!

ABN , First Publish Date - 2023-05-31T07:48:50+05:30 IST

సౌదీ అరేబియాలో నివాసం ఉండే భారత ప్రవాసుడు (India expat) రాత్రికి రాత్రే మల్టీ మిలియనీర్‌గా మారాడు. ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ ఐడియాలజ్(Idealz) రూపంలో మనోడికి అదృష్టం కలిసొచ్చింది.

Idealz: అదృష్టం అంటే ఇతడిదే.. సౌదీలో రాత్రికి రాత్రే మల్టీ మిలియనీర్‌గా మారిన భారతీయుడు!

రియాద్: సౌదీ అరేబియాలో నివాసం ఉండే భారత ప్రవాసుడు (India expat) రాత్రికి రాత్రే మల్టీ మిలియనీర్‌గా మారాడు. ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ ఐడియాలజ్(Idealz) రూపంలో మనోడికి అదృష్టం కలిసొచ్చింది. దాంతో ఐడియాలజ్ డ్రాలో ఏకంగా 2మిలియన్ దిర్హమ్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. భారత కరెన్సీలో అక్షరాల రూ.4.50కోట్లు. ఇండియాలోని కేరళ రాష్ట్రానికి చెందిన రిను రాజ్‌కు (Rinu Raj) తాజాగా ఈ జాక్‌పాట్ తగిలింది. సౌదీ అరేబియాలోని (Saudi Arabia) అల్ జుబైల్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసే అతడు.. తన కుటుంబంతో కలిసి గత కొన్నేళ్లుగా అక్కడే ఉంటున్నాడు. రిను రాజ్ భార్య ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. ఇక ఇటీవల 50 దిర్హమ్స్ పెట్టి ఐడియాలజ్ డ్రాలో పాల్గొన్నాడు. అదే అతడికి అదృష్టాన్ని తెచ్చి పెట్టింది. రూ. 4.50కోట్లు నగదు బహుమతి గెలుచుకున్నాడు. అంతే.. రాత్రికి రాత్రే మల్టీ మిలియనీర్‌గా అవతరించాడు.

ఈ సందర్భంగా రిను రాజ్ సౌదీ అరేబియాలోని తన ఇంటి నుండి వీడియో కాల్‌ ద్వారా మాట్లాడుతూ.. "నాకు Idealz నుండి కాల్ వచ్చింది. నేను విజేతగా నిలిచినట్లు చెప్పడంతో కొద్దిసేపు నమ్మలేకపోయాను. జీవితాన్ని మార్చే ఈ భారీ మొత్తాన్ని నేను గెలుచుకున్నానని తెలుసుకోవడం థ్రిల్లింగ్ అనుభవం. Idealzకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్, యాప్‌ని ఉపయోగించడం చాలా సులభం. ఇక్కడ ప్రతి ఒక్కరూ కొనుగోళ్లు చేయడం ద్వారా పెద్ద బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.

Oman: వారం రోజుల్లో 245 మంది ప్రవాసులను దేశం నుంచి వెళ్లగొట్టిన ఒమాన్.. కారణమిదే..!

Updated Date - 2023-05-31T07:48:50+05:30 IST