Sperm Donor: అమ్మ బాబోయ్.. 550 మందికి తండ్రయ్యాడు.. ఇతడి గురించి నిజం తెలిసి ఓ మహిళ ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2023-03-29T18:49:41+05:30 IST

ఏకంగా 550 మంది పిల్లలకు తండ్రయ్యాడు. అమ్మ బాబోయ్.. అంత మంది పిల్లలా? ఇంత మంది పిల్లలకు ఎలా తండ్రయ్యాడు. ఏంటా కథ. తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

Sperm Donor: అమ్మ బాబోయ్.. 550 మందికి తండ్రయ్యాడు.. ఇతడి గురించి నిజం తెలిసి ఓ మహిళ ఏం చేసిందంటే..
doctor

ఆయా దేశాల్లో పిల్లల పుట్టక గురించి కొన్ని రూల్స్ ఉంటాయి. ఒకరు లేదా? ఇద్దరు పిల్లలను మాత్రమే కనాలని చట్టాలు ఉన్నాయి. అంతకు మంచి ఎక్కువ పిల్లలను కంటే చట్టం ఊరుకోదు. ఇంకొన్ని దేశాల్లో అయితే ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ మంది ఉంటే రాజకీయాల్లో పోటీ చేయడానికి కూడా వీలుండదు. అందుకనే చాలా మంది ఒకరు లేదా? ఇద్దరితో సరిపెట్టుకుంటారు. కానీ ఒక అతను ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 550 మంది పిల్లలకు తండ్రయ్యాడు. అమ్మ బాబోయ్.. అంత మంది పిల్లలా? ఇంత మంది పిల్లలకు ఎలా తండ్రయ్యాడు. ఏంటా కథ. తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

నెదర్లాండ్స్‌కు (Netherlands) చెందిన ఓ యువ వైద్యుడు (Doctor) వీర్యం దానం చేసి 550 మందికి తండ్రి అయ్యాడు. అదే ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఇకపై అతడు ఇంకెవరికీ వీర్యం దానం (Sperm Donor) చేయకుండా అడ్డుకోవాలని ఓ మహిళ కోర్టులో కేసు వేసింది. ఈ మహిళ కూడా ఆ వైద్యుడి వీర్యం ద్వారానే బిడ్డకు జన్మనిచ్చింది. అతడు మరింత మంది చిన్నారులను కనకుండా ఆయన్ను నిరోధించాలని కోరుతూ డోనర్​కైండ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆమె కేసు వేసింది.

ఇది కూడా చదవండి: Facts About Peanuts: పల్లీ పకోడీలంటే ఇష్టమా..? వేయించుకుని ఉప్పు, కారం చల్లుకుని మరీ పల్లీలను తింటుంటారా..? ఈ నిజాలు తెలుసుకోండి..!

ది హేగ్‌ నగరంలో నివసించే జొనథన్‌ (41) అనే వైద్యుడు.. ఇప్పటివరకు నెదర్లాండ్స్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 13 క్లినిక్‌లలో వీర్యదానం చేశాడు. ఈ వీర్యం ద్వారా 550 మంది చిన్నారులు జన్మించారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి 12 కుటుంబాలకు మాత్రమే వీర్యదానం చేయాలి. వీర్యదానం ద్వారా జొనథన్‌ వంద మందికి పైగా చిన్నారులకు జన్మనిచ్చాడని 2017లోనే తెలిసింది. దీంతో నెదర్లాండ్స్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో అతడిని ది డచ్‌ సొసైటీ ఆఫ్‌ అబ్ట్సెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ అతడిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. భవిష్యత్​లో రక్త సంబంధీకుల మధ్య లైంగిక సంబంధాలు తలెత్తకుండా చూడటం, పుట్టిన సంతానం మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నెదర్లాండ్స్‌ యంత్రాంగం ఈ నిబంధనలు రూపొందించింది. అయినా కూడా అతడు అక్రమంగా వీర్యం దానం చేసినట్లుగా తెలుస్తోంది. జొనథన్‌ ప్రస్తుతం కెన్యాలో నివాసం ఉంటున్నాడు.

ఇది కూడా చదవండి: Doctors Secret: ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లినా ముందుగా నాలుకను చూపించమంటారెందుకు..?

వైద్యుడిపై వేసిన కేసులో ఆ మహిళ ఏం పేర్కొంది అంటే.. "ఆ వైద్యుడు వంద కంటే ఎక్కువ మందికి జన్మనిచ్చారని ముందే తెలిసి ఉంటే దాతగా అతడిని స్వీకరించేదాన్ని కాదు. వీర్యదానం వల్ల ఎక్కువ మందికి జన్మనివ్వడం వల్ల అనేక సమస్యలు ఉన్నాయి. వాటి పరిణామాలు తల్చుకుంటేనే నాకు భయం వేస్తోంది. నా బిడ్డ భవిష్యత్ గురించి ఆందోళన మొదలైంది. ఇంకా ఎంత మంది చిన్నారులు నా బిడ్డకు రక్త సంబంధీకులు అవుతారోననే ప్రశ్న తలెత్తింది. నా బిడ్డను రక్షించుకోవడానికి కోర్టుకు వెళ్లడమే మార్గం." అని తెలిసిందని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Banana: ఆరోగ్యానికి మంచిది కదా అని భోజనం చేసిన వెంటనే అరటిపండ్లు తింటున్నారా..? అసలు నిజం తెలిస్తే..

Updated Date - 2023-03-29T18:49:41+05:30 IST