Banana: ఆరోగ్యానికి మంచిది కదా అని భోజనం చేసిన వెంటనే అరటిపండ్లు తింటున్నారా..? అసలు నిజం తెలిస్తే..

ABN , First Publish Date - 2023-03-27T17:13:27+05:30 IST

ఇంట్లో అందుబాటులో ఉంది కదా? అని ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. ఈ పండు ఎప్పుడు తినాలో.. తినకూడదో తెలుసుకోవల్సిన అవసరం ఉంది. లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు (Experts) చెబుతున్నారు.

Banana: ఆరోగ్యానికి మంచిది కదా అని భోజనం చేసిన వెంటనే అరటిపండ్లు తింటున్నారా..? అసలు నిజం తెలిస్తే..
Banana

అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే ఫ్రూట్ (Fruit) ఏదైనా ఉందంటే అది బనానే (Banana). చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. అలాగే ఈ అరటి పండులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు వీటి ధర కూడా తక్కువే. అందుకే చాలా మంది కొనడానికి కూడా ఆసక్తి చూపుతుంటారు. ఇందులోని యాంటీ యాక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక ఇందులోని పొటాషియం బీపీని నియంత్రించి గుండె పని తీరును మెరుగుపరుస్తుంది. అంతే కాదు పిల్లల ఎదుగుదలకు కూడా ఈ పండు ఎంతో మంచిదే. కానీ ఇంట్లో అందుబాటులో ఉంది కదా? అని ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. ఈ పండు ఎప్పుడు తినాలో.. తినకూడదో తెలుసుకోవల్సిన అవసరం ఉంది. లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు (Experts) చెబుతున్నారు.

అరటిపండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్ ఎ, బి, సి పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తపోటు ఉన్నవారికి చాలా మంచిది. పొటాషియం రక్తపోటును తగ్గించడంలో కీ రోల్ పోషిస్తుంది. దీంతో పాటు మలబద్ధకం సమస్య ఉన్నవారు ఈ పండును కచ్చితంగా నెలరోజులు తింటే ఆ సమస్య తగ్గుతుంది. ఇందులోని ఫైబర్ ఆ సమస్యని దూరం చేస్తుంది. ఇలా అరటి పండుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

అయితే చాలా మంది భోజనం చేసిన తర్వాత ఏదొకటి తినడం అలవాటుగా ఉంటుంది. కొంత మంది స్వీట్లు తింటుంటారు. ఇంకొందరు ఫ్రూట్స్ తీసుకుంటారు. ఇందులో భాగంగానే చాలా మందికి భోజనం చేసిన తర్వాత అరటి పండు తినడం అలవాటు ఉంటుంది. అలాంటి వారు రెగ్యులర్‌గా అరటిపండ్లు తింటారు. కానీ.. భోజనం తర్వాత మాత్రం అరటిపండు తినొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భోజనం చేసిన వెంటనే అరటి పండ్లు తినడం వల్ల ఊపిరితిత్తుల్లో మ్యూకస్ ఏర్పడుతుంది.. దీని వల్ల జలుబుకు గురవుతారని చెబుతున్నారు. అయితే ఇది చాలా వరకు తగ్గుతుందన్నారు. అయితే మధ్యాహ్న సమయంలో మాత్రం తింటే మాత్రం మంచిదేనని చెబుతున్నారు. ఇంకొంత మంది ఖాళీ కడుపుతో.. లేదంటే పరగడుపున తింటుంటారు. ఇలా చేయడం కూడా మంచిది కాదని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో చక్కెరలు తక్షణ శక్తిని అందిస్తాయన్నారు. ఆ తర్వాత వెంటనే అలసటగా ఉంటుందని చెబుతున్నారు. అందుకోసం అరటి పండ్లు తినేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: BirthMarks: పుట్టు మచ్చల వెనుక కథేంటి..? పుట్టినప్పుడు లేని మచ్చలు ఆ తర్వాత ఎలా వస్తాయంటే..

Updated Date - 2023-03-27T17:13:27+05:30 IST