Doctors Secret: ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లినా ముందుగా నాలుకను చూపించమంటారెందుకు..?

ABN , First Publish Date - 2023-03-29T16:15:31+05:30 IST

మొట్టమొదటిగా నాలుక చూపించమని వైద్యుడి (Doctors) అడుగుతాడు. అలా ఎందుకు అడుగుతారు? నాలుక ద్వారా వ్యాధుల గుర్తించవచ్చా? ఎప్పుడైనా ఈ విషయం ఆలోచించారా? అయితే ఈ నాలుకలో దాగి ఉన్న రహస్యమేంటో

Doctors Secret: ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లినా ముందుగా నాలుకను చూపించమంటారెందుకు..?
Doctors Secret

ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఇది అక్షర సత్యం. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం. లేదంటే ఏ పని చేయలేం. పరిస్థితులు అంత దారుణంగా ఉంటాయి. కానీ మనిషి అన్నాక.. ఏదొక రోగం రాక మానదు. జ్వరమో.. జలుబో.. ఏదొక జబ్బు వస్తూనే ఉంటుంది. కొన్ని నార్మల్ రోగాలు వచ్చినప్పుడు వేచి చూస్తారు. ఎంతకీ తగ్గకపోతే మాత్రం డాక్టర్ దగ్గరకు వెళ్తుతుంటారు. అలా వెళ్లినప్పుడు మొట్టమొదటిగా నాలుక చూపించమని వైద్యుడి (Doctors) అడుగుతాడు. అలా ఎందుకు అడుగుతారు? నాలుక ద్వారా వ్యాధుల గుర్తించవచ్చా? ఎప్పుడైనా ఈ విషయం ఆలోచించారా? అయితే ఈ నాలుకలో దాగి ఉన్న రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మనిషి ఏదైనా రోగాన బారిన పడినప్పుడు వెంటనే నాలుక రంగు లేత గులాబీ కలర్ నుంచి వేరొక రంగులోకి మారిపోతుంది. ఇలా రంగుల్లోకి మారడాన్ని బట్టి వైద్యులు ఫలానా వ్యాధి అని చెప్పగలుగుతుంటారు. ఆ రోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Viveka Mureder Case : వివేకా హత్య కేసులో సుప్రీం కీలక ఆదేశాలు.. హుటాహుటిన ఢిల్లీకి సీఎం జగన్.. ఏం జరుగుతుందో..!

టంగ్ (Tongue) నీలం రంగులోకి మారినప్పుడు హార్ట్‌ (Heart)కు సంబంధించిన వ్యాధులను సూచిస్తుంది. అంటే గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయలేకపోతుందుని సంకేతం ఇస్తుంది. అలాగే రక్తంలో ఆక్సిజన్ కొరత కూడా ఉందని సూచిస్తుంది. ఇక టీ, కాఫీలు ఎక్కువగా తాగే వారి నాలుక గోధుమ రంగులో ఉంటుంది. అలాగే సిగరెట్, బీడీ కాల్చే వారి నాలుక కూడా గోధుమ రంగులో ఉంటుంది. ఇటువంటి వారు వాటికి దూరంగా ఉండటం మంచింది.

ఇది కూడా చదవండి: Banana: ఆరోగ్యానికి మంచిది కదా అని భోజనం చేసిన వెంటనే అరటిపండ్లు తింటున్నారా..? అసలు నిజం తెలిస్తే..

ఇక మీ నాలుక పింక్ నుంచి ఎరుపు రంగులోకి మారితే విటమిన్ బి 12, ఫోలిక్ యాసిడ్ లోపం ఎక్కువగా ఉందని అర్థం. అందుకే జిహ్వపై ఎర్రటి మచ్చలు కనిపిస్తుంటాయి. తెల్లగా ఉంటే మాత్రం నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోవడం లేదని తెలుపుతుంది.

ఇక నాలుక పసుపు రంగులోకి మారితే శరీరానికి పోషకాల కొరత ఉందని సూచిస్తుంది. అలాగే కాలేయం లేదా కడుపులో సమస్యల కారణంగా నాలుకపై పసుపు పొర ఏర్పడుతుంది. నాలుక నల్లగా మారితే తీవ్రమైన వ్యాధులకు సిగ్నల్ ఇస్తుంది. ఇది క్యాన్సర్ సంకేతం కావచ్చు. తరచుగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు, అల్సర్ల కారణంగా నాలుక నల్లగా మారుతుంది. ఎక్కువగా ధూమపానం చేసేవారు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు.

ఇక నాలుక వణకడం కనిపిస్తే థైరాయిడ్‌ గ్రంధి అతిగా పని చేస్తోందని సంకేతం. లేదంటే కొన్ని రకాల నరాల వ్యాధులకు కారణం కావొచ్చు. ఇక నాలుక ఒక పక్కకు వాలిపోతే మాత్రం దాన్ని పక్షవాతంగా పరిగణిస్తారు.

ఇది కూడా చదవండి: BirthMarks: పుట్టు మచ్చల వెనుక కథేంటి..? పుట్టినప్పుడు లేని మచ్చలు ఆ తర్వాత ఎలా వస్తాయంటే..

Updated Date - 2023-03-29T16:23:26+05:30 IST