Kaun Banega Crorepati: ఐపీఎల్‌పై రూ. 6.40లక్షల ప్రశ్న.. మీకు సమాధానం తెలుసేమో ఒకసారి ట్రై చేయండి..!

ABN , First Publish Date - 2023-08-19T13:49:56+05:30 IST

బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా 'కౌన్ బనేగా కరోపతి' 15వ సీజన్ ఆగస్టు 14 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ క్వీజ్ ప్రోగ్రామ్‌లో అబితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) గెస్ట్‌గా పాల్గొన్నారు.

Kaun Banega Crorepati: ఐపీఎల్‌పై రూ. 6.40లక్షల ప్రశ్న.. మీకు సమాధానం తెలుసేమో ఒకసారి ట్రై చేయండి..!

ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా 'కౌన్ బనేగా కరోపతి' 15వ సీజన్ ఆగస్టు 14 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ క్వీజ్ ప్రోగ్రామ్‌లో అబితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) గెస్ట్‌గా పాల్గొన్నారు. తన అప్‌కమింగ్ మూవీ 'ఘూమర్' ప్రచారంలో భాగంగా హీరోయిన్ సయామీ ఖేర్‌తో కలిసి అభిషేక్.. కేబీసీ (KBC) లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఐపీఎల్‌ (IPL) పై ఓ ప్రశ్న ఎదురైంది. రూ.6,40,000 విలువ చేసే ఆ క్వశ్చన్ ఏంటంటే.. '2023 ఐపీఎల్‌లోని ఒక మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ ఎవరు?'. దీనికి ఆప్షన్స్‌గా ఏ. ఆండ్ర్యూ రస్సెల్, బీ. నీతిష్ రాణా, సీ. రింకూ సింగ్, డీ. వెంకటేష్ అయ్యర్ అని ఇచ్చారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం క్రికెట్ చూసే వారికైతే చాలా ఈజీ అనుకోండి. ఎందుకంటే ఆ ఇన్నింగ్స్ ఆ ఆటగాడిని రాత్రికి రాత్రే క్రికెట్ సూపర్ స్టార్‌గా మార్చేసింది మరి.

ఇంతకీ దీనికి సరియైన సమాధానం ఏంటో మీకు తెలుసా? ఆప్షన్ 'డీ'.. రింకూ సింగ్ (Rinku Singh). గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో జట్టు విజయానికి 28 పరుగులు కావాల్సి ఉండగా రింకూ రెచ్చిపోయాడు. వరుస సిక్సర్లతో ప్రత్యర్థి జట్టు బౌలర్‌ను బెంబెలెత్తించాడు. చివరికి అమోఘమైన ఐదు సిక్సర్లతో కేకేఆర్‌ (KKR) కు మరిచిపోలేని విక్టరీని కట్టాబెట్టాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత రింకూ సింగ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. టీమిండియా (Team India) కు మంచి మ్యాచ్ ఫినిషర్ దొరికాడంటూ అందరూ మెచ్చుకున్నారు. ఇక 2023 ఐపీఎల్ సీజన్ మొత్తం బాగా రాణించిన రింకూ ఇటీవల ఏకంగా జాతీయ జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. తాజాగా ఐర్లాండ్‌తో జరుగుతున్న 3మ్యాచుల టీ20 సిరీస్‌లో అతడు సభ్యుడు. శుక్రవారం నాటి తొలి టీ20 ద్వారా మనోడు అరంగేట్రం కూడా చేశాడు.

Magic Mirror: అద్దంలో నగ్నంగా కనిపిస్తారంటూ కేటుగాళ్ల బురిడీ.. రూ.9లక్షలు పొగొట్టుకున్న వృద్ధుడు..!

Updated Date - 2023-08-20T07:48:27+05:30 IST