MLC Election Results : క్రాస్ ఓటింగ్ వేసిందెవరో తెలుసన్న సజ్జల.. ఎమ్మెల్యే శ్రీదేవి రియాక్షన్ ఇదీ.. ఇవాళ ఉదయమే...

ABN , First Publish Date - 2023-03-23T23:20:10+05:30 IST

ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLA Quota MLC Elections) టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ (Panchumarthy Anuradha) ఊహించని రీతిలో గెలుపొందిన విషయం తెలిసిందే.

MLC Election Results : క్రాస్ ఓటింగ్ వేసిందెవరో తెలుసన్న సజ్జల.. ఎమ్మెల్యే శ్రీదేవి రియాక్షన్ ఇదీ.. ఇవాళ ఉదయమే...

ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLA Quota MLC Elections) టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ (Panchumarthy Anuradha) ఊహించని రీతిలో గెలుపొందిన విషయం తెలిసిందే. అసలు అభ్యర్థినే నిలబెట్టడం కష్టమని అందరూ అనుకున్నారు. కానీ అనురాధను అభ్యర్థిగా నిలబెట్టడమే కాదు.. గెలిపించుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. క్రాస్ ఓటింగ్ టీడీపీకి కలిసిరాగా.. వైసీపీ అభ్యర్థి కోలా రాఘవులు ఓటమిపాలయ్యారు. ఎన్నికల ముందు సెమీ ఫైనల్‌ భావిస్తున్న ఈ ఎన్నికల్లో చంద్రబాబు చక్రం తిప్పి అభ్యర్థిని గెలిపించుకోవడంతో.. వైసీపీకి బిగ్ షాక్ తగిలినట్లయ్యింది. ఈ ఎన్నికల్లో అనురాధ గెలుపుకోసం చంద్రబాబు ఏం చేశారు..? ఎవరితో టచ్‌లోకి వెళ్లారు..? అసలు క్రాస్ ఓటింగ్ చేసిందెవరు..? అనే విషయాలు వైసీపీ పెద్దలకు అంతు చిక్కక తలలు పట్టుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహం గ్రాండ్ సక్సెస్ అయ్యిందనే చెప్పొచ్చు. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపైనే (Mekapati Chandra Sekhar Reddy) వైసీపీకి అనుమానాలు వచ్చాయట. అటు సోషల్ మీడియాలో (Social Media).. ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ విషయం కోడై కూయడంతో ఎట్టకేలకు తనపై వచ్చిన ఆరోపణలకు శ్రీదేవి వివరణ ఇచ్చుకున్నారు.

MLAS-with-Jagan.jpg

నాకేం అవసరం..!

నేను క్రాస్ ఓటింగ్ (Cross Voting) చేయలేదు. క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరమే నాకు లేదు. నాపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమే. పార్టీ ఇచ్చిన కోడ్ ప్రకారమే నేను ఓటు వేశాను. ఉదయమే నా కుమార్తెతో పాటు సీఎం జగన్‌ గారిని కలిశాను. సొంత అన్నలా చూసుకుంటానని నాతో జగన్ చెప్పారు. జగన్ గారి నుంచి నాకు స్పష్టమైన హామీ వచ్చింది. క్రాస్ ఓటింగ్ చేసిందెరో రెండ్రోజుల్లో నిజా నిజాలు బయటికొస్తాయి. మాకు కొన్ని విలువలు ఉన్నాయి. విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉన్నాం. దళిత మహిళపై దుష్ప్రచారం చేయొద్దు. దళిత మహిళను కాబట్టే ఇలా చులకనగా చూస్తున్నారు. నేను అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉంటే నియోజకవర్గానికి ఇంచార్జ్‌ని పెట్టినప్పుడే రాజీనామా చేయాలి. నేను సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. ఆ 22 మందిని స్క్రూటిని చేసి నిజాన్ని తేల్చండి. మళ్లీ చెబుతున్నాను.. నాకు క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇందులో నా పేరును దయచేసి లాగొద్దుఅని శ్రీదేవి చెప్పుకొచ్చారు.

Undavalli-and-Mekapati.jpg

మేకపాటి ఏమయ్యారో..!

తనపై వచ్చిన ఆరోపణలు శ్రీదేవి వివరణ ఇచ్చుకోగా ఇంతవరకూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం స్పందించిన దాఖలాల్లేవ్. పైగా వైసీపీ పెద్దల నుంచి వరుసగా ఫోన్ కాల్స్ వెళ్లినప్పటికీ ఎలాంటి రియాక్షన్ లేదట. కొన్నిసార్లు ఫోన్ స్విచాఫ్ అని కూడా వస్తోందట. కనీసం రిటర్న్ కాల్ కూడా రాకోవడంతో అధిష్ఠానం అనుమానమే నిజమేనని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఉదయగిరి నియోజకవర్గానికి పరిశీలకుడిగా ధనుంజయ్ రెడ్డిని అధిష్ఠానం నియమించడంతో మేకపాటి చాలా రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయన టీడీపీకి ఓటు వేసి ఉంటారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే ఆయన మీడియా ముందుకు రావాల్సిందే.. లేదంటే.. స్క్రూటినీలో నిజాలు తేలాల్సిందే.

మరోవైపు.. టీడీపీకి ఓటు వేసిన ఎమ్మెల్యేలు ఎవరనే విషయాన్ని గుర్తించామని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మీడియా ముఖంగా చెప్పేశారు. అంతేకాదు.. చర్యలు తీసుకోవాల్సిన టైమ్‌లో కచ్చితంగా తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు. ఇంతకీ వైసీపీ పెద్దలు గుర్తించిన ఆ ఇద్దరు ఎవరో.. ఆ ఇద్దరిలో మేకపాటి ఉన్నారో లేదో..? పేర్లు బయటికి వచ్చిన తర్వాత అధిష్ఠానం ఏం చేస్తుందో.. అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

MLC Election Results : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌కు వెన్నుపోటు పొడిచింది ఈ ఇద్దరు ఎమ్మెల్యేలేనా.. ఫోన్ స్విచాఫ్ రావడంతో...!


******************************

MLC Elections Counting Live Updates : అనురాధ గెలుపుపై సజ్జల ఇలా అన్నారేంటి.. ఇదేందయ్యా...!

******************************

Updated Date - 2023-03-23T23:33:52+05:30 IST