Lagadapati Re Entry : లగడపాటి రీ ఎంట్రీ సరే.. ఏ పార్టీ, పోటీ ఎక్కడ్నుంచి.. ఎవరెవరితో టచ్‌లో ఉన్నారు..!?

ABN , First Publish Date - 2023-09-06T17:01:41+05:30 IST

అవును.. ఆంధ్రా ఆక్టోపస్‌గా (Andhra Octopus) ప్రసిద్ధి చెందిన లగడపాటి రాజగోపాల్‌ (Lagadapati Rajagopal) రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్నికల బరిలోకి దిగాలని.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పోటీచేయాల్సిందేనని అనుచరులు, వీరాభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అన్నీ సరేగానీ..

Lagadapati Re Entry : లగడపాటి రీ ఎంట్రీ సరే.. ఏ పార్టీ, పోటీ ఎక్కడ్నుంచి.. ఎవరెవరితో టచ్‌లో ఉన్నారు..!?

అవును.. ఆంధ్రా ఆక్టోపస్‌గా (Andhra Octopus) ప్రసిద్ధి చెందిన లగడపాటి రాజగోపాల్‌ (Lagadapati Rajagopal) రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్నికల బరిలోకి దిగాలని.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పోటీచేయాల్సిందేనని అనుచరులు, వీరాభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అన్నీ సరేగానీ.. రాజకీయాల్లోకి మళ్లీ వస్తారు సరే.. ఏ పార్టీలో చేరుతారు..? ఎక్కడ్నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయ్..? లగడపాటి ఎవరెవరితో టచ్‌లో ఉన్నారు..? ‘వచ్చేయ్ రాజా..’ అని ఆయన్ను ఎవరెవరు ఆహ్వానిస్తున్నారు..? రీ ఎంట్రీ ఇస్తున్నారని తెలిసిన వెంటనే టచ్‌లోకి వెళ్లిన నేతలు ఎవరు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN-Andhrajyothy) ప్రత్యేక కథనం..


Rajagopal.jpg

ఇదీ అసలు కథ..!

లగడపాటిని విజయవాడ (Vijayawada Parliament) నుంచి ఎంపీగా పోటీ చేయించాలన్నది ఆయన అభిమానులు, ముఖ్య అనుచరుల ఉద్దేశం. ఇందులో భాగంగానే మంగళవారం నాడు విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్‌లో కొందరు రహస్య సమాలోచనలు చేశారు. సుమారు గంటపాటు లోతుగా చర్చలు, సమాలోచనలు చేసిన తర్వాత లగడపాటి కూడా మళ్లీ రాజకీయాల్లోకి (Lagadapati Political Re Entry) రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. వస్తారు సరే.. పోటీ ఎక్కడ్నుంచి.. ఏ పార్టీ తరఫున..? అనేది ఆయన గురించి తెలిసిన వారి మదిలో మెదులుతున్న ప్రశ్న. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అవన్నీ సెట్ అయిన తర్వాతే అభిమానులు, అనుచరులతో ప్రత్యేకంగా రాజగోపాల్ సమావేశమయ్యారని టాక్. అంతేకాదు.. ఒకట్రెండు ప్రముఖ పార్టీల అధినేతలు లగడపాటికి టచ్‌లోకి వెళ్లారట. ఓ పార్టీ ముఖ్యనేత.. జాతీయస్థాయిలో చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు.. రాజగోపాల్ కూడా ఒక ప్రముఖ వ్యక్తితో టచ్‌లోకి వెళ్లారని తెలియవచ్చింది.

Lagadapati-F.jpg

రాజా బ్యాగ్రౌండ్ ఇదీ..?

కాంగ్రెస్ తరఫున ల‌గ‌డ‌పాటి 2004, 2009 ఎన్నికల్లో విజ‌యవాడ పార్లమెంట్ నుంచి పోటీచేసి రెండుసార్లు గెలిచారు. 2004లో టీడీపీ అభ్యర్థి, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌పై (Aswani Dutt) 114,487 ఓట్ల మెజార్టీతో గెలవగా.. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీపై (Vamsi Mohan Vallabhaneni) 12,712 ఓట్ల తేడాతో రాజగోపాల్ గెలుపొందారు. 2014లో ఉమ్మడి రాష్ట్రం విడిపోవడానికి ముందు రాజగోపాల్‌ సమైక్యాంధ్ర ఉద్యమంలో (Samaikyandhra Movement) చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. రాష్ట్రం విడిపోదని, విడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. రాష్ట్రం విడిపోవడంతో ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయాల నుంచి నిష్క్రమించారు. 2019 ఎన్నికల సమయంలో ముందస్తు ఎన్నికల ఫలితాలను (AP Election Results) ప్రకటించారు. అయితే ఫలితాలు వచ్చిన తరువాత ఆయన అంచనాలు తప్పాయి. అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఆయన్ను ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దింపాలని అనుచరులు కోరుతున్నారు. త్వరలో పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. లగడపాటి ఏ పార్టీలో ఉన్నా అభ్యంతరం లేదని ఆయనతో పాటే తామంతా అని నేతలు పేర్కొన్నట్లు సమాచారం.

Lagadapati.jpg

సైకిలెక్కుతారా..!?

గతంలో లగడపాటి టీడీపీ (Lagadapati TDP) వైపు అడుగులేస్తున్నారని.. విజయవాడ లేదా ఏలూరు నుంచి పోటీచేస్తారని వార్తలు వచ్చినప్పటికీ అదేమీ జరగలేదు. ఇప్పుడు కూడా టీడీపీ అధినేత చంద్రబాబుతో (TDP Chief Chandrababu) స్వయంగా రాజగోపాలే టచ్‌లోకి వెళ్లినట్లు తెలియవచ్చింది. పోటీచేస్తే కచ్చితంగా టీడీపీ తరఫునే చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని (Kesineni Nani) రానున్న ఎన్నికల్లో టీడీపీ (Telugudesam) తరఫున పోటీచేస్తారా..? అసలు ఆయనకు టికెట్ ఇస్తారా..? లేదా అనేదానిపై క్లారిటీ లేదు. దీంతో తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని నాని తమ్ముడు కేశినేని చిన్ని (Kesineni Chinni) రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో అన్నీ తానై చూసుకుంటున్నారు కూడా. పైగా టీడీపీ అధిష్టానం ఆశీస్సులు కూడా ఈయనకే మెండుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఒకవేళ లగడపాటి టీడీపీలో చేరితే ఎలా ఉంటుంది..? పోటీచేస్తారా..? అసలు టికెట్ ఇచ్చే పరిస్థితి ఉందా..? అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ఒకవేళ టీడీపీ టికెట్ దక్కితే మాత్రం గెలుపు పక్కా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Lagadapati-Parties.jpg

బీజేపీలో చేరుతారా..?

మాజీ సీఎం, బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి (Nallari Kiran Kumar Reddy) లగడపాటికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బీజేపీలో చేరిన అతి కొద్దిరోజుల్లోనే కిరణ్ రెడ్డికి మంచి ప్రాధాన్యత ఇచ్చింది అధిష్టానం. కమలం గూటికి చేరితే బాగుంటుందని కిరణ్ స్వయంగా ఆహ్వానించినట్లు సమాచారం. బీజేపీలో చేరితే విజయవాడ పార్లమెంట్ నుంచి టికెట్ పక్కా అని కమలనాథుల (BJP Leaders) నుంచి హామీ కూడా లభించిందట. ఒకవేళ టీడీపీతో పొత్తు ఉన్నాసరే కచ్చితంగా టికెట్ లగడపాటికేననే సంకేతాలు కూడా బీజేపీ పెద్దల నుంచి అందాయట. అయితే పొత్తుల వ్యవహారం తర్వాతే తాను నిర్ణయం వెల్లడిస్తానని రాజగోపాల్ చెప్పారని తెలియవచ్చింది. అటు టీడీపీ.. ఇటు బీజేపీ కాదంటే మాత్రం జనసేన నుంచి కూడా పోటీచేసే అవకాశాలు లేకపోలేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో (Janasena Chief Pawan Kalyan) కూడా లగడపాటికి మంచి పరిచయాలున్నాయి. ఇదేగానీ జరిగితే టీడీపీ, వైసీపీ (TDP, YSR Congress) ఓట్లు కూడా భారీగా చీలిపోయే ఛాన్స్ లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Lagadapati-Raja.jpg

మొత్తానికి చూస్తే.. రీ ఎంట్రీ ఇవ్వడానికి రాజా సిద్ధమైపోయారు గానీ.. ఏ పార్టీలో చేరే అవకాశముంది..? ఏ నియోజకవర్గం నుంచి.. పోటీ చేస్తారు..? అభిమానులు, అనుచరులు ఎటువైపు అడుగులేయమని చెబుతారు..? లగడపాటి మనసులో ఏముంది..? అనే ప్రశ్నలకు అతి త్వరలోనే సమాధానాలు అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. సో.. ఏపీ రాజకీయాల్లో అతి త్వరలోనే కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయ్ అన్న మాట. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Raja.jpg


ఇవి కూడా చదవండి


Bharat Row : ‘భారత్’ గురించి పవన్ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్.. ఎక్కడ చూసినా ఇదే చర్చ


BRS First List : బీఆర్ఎస్‌ టికెట్లు ఆశించి భంగపడ్డ వారిపై ఎమ్మెల్యే భర్త ఆసక్తికర వ్యాఖ్యలు!


Telangana : ఎన్నికల ముందు మరో తీపికబురు చెప్పిన సీఎం కేసీఆర్..!


Viveka Murder Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత ఆర్డర్ కాపీలో కీలక అంశాలు


LB Nagar Incident : సంఘవి ఆరోగ్యంపై షాకింగ్ విషయం చెప్పిన ఏఐజీ హాస్పిటల్ చైర్మన్


TS Assembly Polls : కాంగ్రెస్ కీలక నేతతో రాజయ్య రహస్య భేటీ.. 45 నిమిషాలు అసలేం జరిగింది..!?


YSR Congress : గుడివాడ నుంచి కొడాలి నాని ఔట్.. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదా.. వాట్ నెక్స్ట్..!?


Updated Date - 2023-09-06T18:02:46+05:30 IST