Viveka Murder Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత ఆర్డర్ కాపీలో కీలక అంశాలు

ABN , First Publish Date - 2023-09-04T20:50:37+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Murder Case) వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే...

Viveka Murder Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత ఆర్డర్ కాపీలో కీలక అంశాలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Murder Case) వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు చుక్కెదురైంది. నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy), ఉదయ కుమార్ రెడ్డిల బెయిల్ పిటిషన్‌లను (Bail Pitition) హైకోర్టు (TS High Court) తిరస్కరించింది. ఇప్పటికే సీబీఐ కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేయడంతో హైకోర్టుకి వెళ్లారు. సునీత, సీబీఐ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. కేసులో మెరిట్స్ ఆధారంగా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉండటంతో బెయిల్ మంజూరు చేయలేమని న్యాయస్థానం భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాదికి స్పష్టం చేసింది. వివేకా హత్యకు జరిగిన కుట్రలో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని సీబీఐ వాదనలు వినిపించింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే జరిగే పరిణామాలను కోర్టుకు సీబీఐ తరపు న్యాయవాది స్పష్టంగా వివరించారు. సీబీఐ, సునీత వాదనల్లో మెరిట్స్ ఉండడంతో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. అయితే బెయిల్ పిటిషన్ కొట్టివేత ఆర్డర్ కాపీలో కీలక అంశాలు ఉన్నాయి.


2high-court.jpg

ఆర్డర్ కాపీలో ఏమేం ఉన్నాయ్!

దీపక్ యాదవ్ వర్సెస్ యూపీ రాష్ట్రం కేసులో ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ తీర్పు ఆధారంగా బెయిల్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది.వివేకా హత్య కేసులో పిటిషనర్లు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. నిందితులుగా ఉన్న భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ అవినాష్ రెడ్డి.. ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డికి చాలా దగ్గర బంధువులు. ఈ కేసులో చాలా మంది సాక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు ఉన్నారు. కేసులో A8 అవినాష్ రెడ్డి కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు. వివేకా కేసులో పెద్ద కుట్ర దాగి ఉంది. సాక్ష్యాలను నాశనం చేశారనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. బెయిల్‌పై విడుదల అయితే నిందితులు పరారయ్యే ప్రమాదం ఉంది. ఈ కేసులో సాక్షులుగా ఉన్న వారిని ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. వివేకా హత్యకు కుట్రలో భాగమేనని, సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఆధారాలు ఉన్నాయిఅని ఆర్డర్ కాపీలో ఉంది. కాగా.. కేసు ప్రాసిక్యూషన్ దశలోఉండగా పిటిషనర్లకు బెయిల్ మంజూరు చేయడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో రెండు క్రిమినల్ పిటిషన్‌లు కొట్టి వేస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది.

Viveka-and-Bhaskar-and-Avin.jpg

బెయిల్ ఎందుకు ఇవ్వట్లేదంటే..?

ఛార్జ్‌షీట్31.01.2022న మొదటి అనుబంధ ఛార్జ్ షీట్, 30.06.2023న రెండవ అనుబంధ ఛార్జిషీటు పరిలిస్తే వీరి పాత్రపై అర్థం అయింది. జూన్ 30న ధాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో పిటిషనర్లు ఇద్దరిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. 306 ప్రకారం ఆమోదించిన A4 షేక్ దస్తగిరి వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. సహ సాక్షుల వాంగ్మూలం యొక్క విశ్వసనీయతను న్యాయస్థానం పరిగణించింది. వివేక హత్య కేసులో విచారణను ఆలస్యం చేసేందుకు పిటిషనర్లు ఇద్దరితో పాటు సహనిందితులు ప్రయత్నం చేస్తున్నారు.సాక్షులను ప్రభావితం చేయడంలో నిందితులు చురుకుగా ఉన్నట్లు భావిస్తున్నాం. వివేక మరణించారన్న వార్త బయటికి తెలియక ముందే నిందితులు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు ఆధారాలు లభించాయి. సీబీఐ సమర్పించిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అలాగే గూగుల్ టేక్ అవుట్ లొకేషన్ ద్వారా సాక్షాలు పరిశీలించాము. ఈ హత్య కేసులో కుట్ర దాగి ఉందని ఇద్దరు నిందితుల బెయిల్ పిటిషన్‌ను సిబిఐ కోర్టు తిరస్కరించింది. కేసు ప్రాసిక్యూషన్ దశలో ఉన్నందున బెయిల్ మంజూరు చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే భాస్కర్ రెడ్డి ,దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి గుండెపోటు రక్తపువంతులు అని ప్రచారం చేశారు. ఈ ముగ్గురు ఘటనా స్థలానికి వెళ్లి అక్కడున్న సాక్షాలను చెరిపివేశారని సీబీఐ వీరిపై అభియోగాలు మోపింది. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి తదితరులు బ్యాండేజ్ కుట్లు వేయడంపై హాల్లో ఉండి చర్చించారు. ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో పనిచేసే కాంపౌండర్‌ను పిలిపించి బ్యాండేజ్ కుట్లు వేయించారు. ఈ కేసులో ఘటన స్థలానికి వచ్చిన సీఐ శంకరయ్యను సైతం బెదిరింపులకు దిగారు. గుండెపోటు, రక్తపువాంతులతోటే వివేకా మరణించారని భాస్కర్ రెడ్డి, సహనిందితులు కలిపి పబ్లిక్‌లో ప్రచారంలోకి తీసుకొచ్చారుఅని ఆర్డర్ కాపీలో ఉంది.

YS-Viveka-PSDD.jpg


ఇవి కూడా చదవండి


LB Nagar Incident : సంఘవి ఆరోగ్యంపై షాకింగ్ విషయం చెప్పిన ఏఐజీ హాస్పిటల్ చైర్మన్


TS Assembly Polls : కాంగ్రెస్ కీలక నేతతో రాజయ్య రహస్య భేటీ.. 45 నిమిషాలు అసలేం జరిగింది..!?


YSR Congress : గుడివాడ నుంచి కొడాలి నాని ఔట్.. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదా.. వాట్ నెక్స్ట్..!?


ABN Fact Check : గుడివాడలో నానిని దెబ్బకొట్టేందుకు ‘నారా’స్త్రం.. నిజంగానే నారా రోహిత్‌ బరిలోకి దిగుతున్నారా..!?


Updated Date - 2023-09-04T20:57:00+05:30 IST