Telangana : ఎన్నికల ముందు మరో తీపికబురు చెప్పిన సీఎం కేసీఆర్..!

ABN , First Publish Date - 2023-09-04T21:31:37+05:30 IST

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సీఎం కేసీఆర్ (CM KCR) చెప్పే శుభవార్తలు (Good News) ఎక్కువవుతున్నాయి.! ఇప్పటికే ఏయే వర్గాల్లో అయితే ప్రభుత్వంపై అసంతృప్తి ఉందో వాటన్నింటికీ ఏదో ఒకరకంగా సంతృప్తి పరుస్తూ వస్తోంది సర్కార్...

Telangana : ఎన్నికల ముందు మరో తీపికబురు చెప్పిన సీఎం కేసీఆర్..!

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సీఎం కేసీఆర్ (CM KCR) చెప్పే శుభవార్తలు (Good News) ఎక్కువవుతున్నాయి.! ఇప్పటికే ఏయే వర్గాల్లో అయితే ప్రభుత్వంపై అసంతృప్తి ఉందో వాటన్నింటికీ ఏదో ఒకరకంగా సంతృప్తి పరుస్తూ వస్తోంది సర్కార్. పెన్షన్లు, పోస్టులు ఇలా సమయం, సందర్భాన్ని బట్టి గులాబీ బాస్ శుభవార్తలు చెబుతూ వస్తున్నారు. అయితే తాజాగా.. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ కానుక ఇచ్చారు.


KCR.jpg

ఇదిగో ఇదే శుభవార్త..

సెప్టెంబర్-05న గురుపూజోత్సవం (Teachers Day) కావడంతో ఒకరోజు ముందే గురుకులాల్లో పనిచేసే కాంట్రాక్టు ఉపాధ్యాయులకు (Contract Teachers) కేసీఆర్ సర్కార్ తీపికబురు చెప్పింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న 567 మంది కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులను క్రమబద్దీకరించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 567 మంది ఉపాధ్యాయులు గురుకుల పాఠశాలల్లో గత 16 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. ఈ ఉద్యోగులందరికీ 12 నెలల జీతం, బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది.

Koppula.jpg

504 మంది మహిళలే..!

కాగా.. ఇప్పటికే బీసీ గురుకులాల్లోని 139 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను కేసీఆర్ ప్రభుత్వం రెగ్యులర్‌ చేసిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టు పద్ధతిలో ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న 567 మంది ఉపాధ్యాయుల్లో వారిలో 504 మంది మహిళలే ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంట్రాక్టు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధులు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను (Minister Koppula Eswar) కలిసి ధన్యవాదాలు తెలిపారు. కాంట్రాక్టు ఉపాధ్యాయులకు రెగ్యులర్‌ ఉపాధ్యాయులతోపాటుగా పీఆర్సీని అమలు చేయడం, పూర్తి వేతనాన్ని చెల్లిస్తుండటం సంతోషకరమని ఉపాధ్యాయుల సంఘం చెబుతోంది.

Teachers.jpg

శుభాకాంక్షలు..

కాగా.. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణను, జ్ఞానాన్ని పెంపొందించి, లక్ష్యం పట్ల వారికి స్పష్టమైన అవగాహనను కలిగించి, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిది. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అనే సూక్తి తల్లిదండ్రులు తర్వాత గురువుకున్న ప్రాధాన్యతను తెలియచేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, ఉపాధ్యాయుల విద్యార్థుల సంక్షేమానికి, అభివృద్ధికి సమర్థవంతమైన కార్యాచరణను అమలుచేస్తున్నది. గురుకుల విద్యలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, నాణ్యమైన విద్యను అందిస్తూ రేపటి తరాన్ని తీర్చిదిద్దడంలో ముందంజలో ఉంది. గుణాత్మక విద్యను అందిస్తూ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ సత్ఫలితాలను ఇస్తున్నది. తెలంగాణ ప్రభుత్వ విధానాలతో నేడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు చదువుల్లోనూ, క్రీడల్లోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటుతున్నారు. విద్యారంగ ప్రగతి పట్ల తెలంగాణ ప్రభుత్వానికున్న అంకితభావానికి, చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని కేసీఆర్ ప్రకటనలో తెలిపారు.

KCR.jpg


ఇవి కూడా చదవండి


Viveka Murder Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత ఆర్డర్ కాపీలో కీలక అంశాలు


LB Nagar Incident : సంఘవి ఆరోగ్యంపై షాకింగ్ విషయం చెప్పిన ఏఐజీ హాస్పిటల్ చైర్మన్


TS Assembly Polls : కాంగ్రెస్ కీలక నేతతో రాజయ్య రహస్య భేటీ.. 45 నిమిషాలు అసలేం జరిగింది..!?


YSR Congress : గుడివాడ నుంచి కొడాలి నాని ఔట్.. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదా.. వాట్ నెక్స్ట్..!?


ABN Fact Check : గుడివాడలో నానిని దెబ్బకొట్టేందుకు ‘నారా’స్త్రం.. నిజంగానే నారా రోహిత్‌ బరిలోకి దిగుతున్నారా..!?


Updated Date - 2023-09-04T21:35:00+05:30 IST