Avinash In Viveka Case : అవినాష్ విషయంలో హైకోర్టు తీర్పుతో వైసీపీలో టెన్షన్.. టెన్షన్.. హుటాహుటిన సమావేశమై..

ABN , First Publish Date - 2023-04-28T20:15:54+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) సహ నిందితుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) ముందస్తు బెయిల్‌పై..

Avinash In Viveka Case : అవినాష్ విషయంలో హైకోర్టు తీర్పుతో వైసీపీలో టెన్షన్.. టెన్షన్.. హుటాహుటిన సమావేశమై..

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) సహ నిందితుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) ముందస్తు బెయిల్‌పై (Anticipatary Bail) తెలంగాణ హైకోర్టు, సీజే బెంచ్ (TS High Court, CJ Bench) ఊహించని షాక్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికిప్పుడు తీర్పు ఇవ్వడం కుదరదని.. జూన్-05కు హైకోర్టు విచారణ వాయిదా వేసింది. అత్యవసరమైతే చీఫ్ కోర్టును అభ్యర్థించాలని అటు అవినాష్ రెడ్డి.. ఇటు వైఎస్ సునీతారెడ్డి లాయర్లకు హైకోర్టు సూచించింది. దీంతో అవినాష్ తరఫు న్యాయవాది సీజేని ఆశ్రయించగా.. ఇప్పటికిప్పుడు విచారణ సాధ్యం కాదని చీఫ్ జస్టిస్ తెలిపారు. వెకేషన్ బెంచ్‌ ముందు మెన్షన్ చేసుకోవాలని సీజే స్పష్టం చేశారు. ఈ కేసుపై సుప్రీంకోర్టు సీజేఐ కామెంట్స్ చేశాక ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు..? అని తెలంగాణ హైకోర్టు సీజే ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు. శుక్రవారం జరిగిన ఈ పరిణామాలతో ఏపీలోని అధికార వైసీపీలో టెన్షన్ మొదలైంది. రెండోరోజు అయినా ముందస్తు బెయిల్‌పై హైకోర్టు నుంచి శుభవార్త వస్తుందని ఆశపడిన వైసీపీ పెద్దలు ఈ తీర్పుతో అవాక్కయ్యారట. సీజే బెంచ్ నుంచి అనుకూలంగా తీర్పు వస్తుందని భావించినా అక్కడా ఎదురుదెబ్బ తగలడంతో.. సీబీఐ ఏం చేయబోతోంది..? ఎప్పుడేం పరిణామాలు చోటుచేసుకుంటాయో అని వైసీపీలో ఆందోళన మొదలైందట.

CBI-Enquiry.jpg

వైసీపీ ఏం చేయబోతోంది..!?

హైకోర్టు, సీజే బెంచ్ తీర్పు తర్వాత హుటాహుటిన తాడేపల్లి ప్యాలెస్‌లో వైసీపీ పెద్దలు, సీనియర్ న్యాయవాదులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే పరిస్థితులు అయితే లేవు.. పైగా వెకేషన్ బెంచ్ కూడా ఇప్పుడు లేకపోవడంతో ఈ వ్యవహారంలో ఏం చేద్దాం..? ఎలా ముందుకెళ్దాం..? అని ప్రత్యామ్నాయాలపై వైసీపీ పెద్దలు దృష్టి పెట్టినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే.. హౌస్‌మోషన్ మూవ్ చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై సీనియర్ న్యాయవాదులతో పెద్దలు చర్చిస్తున్నారని తెలియవచ్చింది. మళ్లీ సుప్రీంకోర్టుకు వెళితే పరిస్థితి ఏంటి..? అని వైసీపీ పెద్దలు న్యాయవాదులతో సమాలోచనలు చేశారట. అయితే.. సుప్రీంకోర్టుకు వెళితే మళ్లీ ఇబ్బందులేనని సీనియర్ న్యాయవాదులు చెప్పారట. అయితే.. ఈలోపే అవినాష్‌‌ను అరెస్ట్ చేస్తే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని వైసీపీ పెద్దలు ఆందోళన చెందుతున్నారట. అయితే.. సీబీఐని కట్టడి చేసేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేయాలని వైసీపీ నిర్ణయించిందట. గురువారం నుంచే తెలంగాణా హైకోర్టులో సంభవించిన పరిణామాలపై వైసీపీలో కలవరం మొదలైందట. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఢిల్లీ, హైదరాబాద్ సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపుల్లో మునిగిన తర్వాత ఇవాళ తీర్పు అనంతరం హుటాహుటిన సమావేశం అయ్యారట.

TS-High-Court.jpg

మొత్తానికి చూస్తే.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా అడ్డుకునేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోందే తప్ప విచారణను ఎదుర్కొని నిజాయితీని నిరూపించుకోవడానికి మాత్రం ఎందుకు ముందుకెళ్లట్లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకూ అయితే దారులన్నీ మూసుకుపోయాయి. ఇక అరెస్ట్ తప్ప వేరే మార్గమే లేదని విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. మరోవైపు.. రేపట్నుంచే సీబీఐ మరింత దూకుడు పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఫైనల్‌గా వైసీపీ ఏం చేస్తుంది..? సీబీఐ ఎలా ముందుకెళ్తుందనే విషయాలపై మాత్రం సర్వత్రా ఉత్కంఠే నెలకొంది.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Avinash In Viveka Case : హైకోర్టు తీర్పు తర్వాత సీజే బెంచ్‌లో ఎంపీ అవినాశ్‌రెడ్డికి ఎదురుదెబ్బ.. తిప్పలు తప్పవా..!?

******************************

Avinash In Viveka Case : వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు ఏం తేల్చిందంటే..

******************************

Avinash In Viveka Case : అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై సస్పెన్స్ కంటిన్యూ.. పలు లాజిక్‌లు చెప్పిన ఎంపీ తరఫు న్యాయవాది.. ఫైనల్‌గా ఏం తేలిందంటే..

******************************

Updated Date - 2023-04-28T20:22:28+05:30 IST