Avinash In Viveka Case : హైకోర్టు తీర్పు తర్వాత సీజే బెంచ్‌లో ఎంపీ అవినాశ్‌రెడ్డికి ఎదురుదెబ్బ.. తిప్పలు తప్పవా..!?

ABN , First Publish Date - 2023-04-28T17:31:42+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ..

Avinash In Viveka Case : హైకోర్టు తీర్పు తర్వాత సీజే బెంచ్‌లో ఎంపీ అవినాశ్‌రెడ్డికి ఎదురుదెబ్బ.. తిప్పలు తప్పవా..!?

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) ముందస్తు బెయిల్‌పై (Anticipatary Bail ) వరుసగా రెండోరోజు తెలంగాణ హైకోర్టులో (TS High Court) విచారణ కొనసాగింది. ఇప్పటికిప్పుడు తీర్పు ఇవ్వడం కుదరదని.. జూన్-05కు హైకోర్టు విచారణ వాయిదా వేసింది. అయితే.. అత్యవసరమైతే చీఫ్ కోర్టును అభ్యర్థించాలని అటు అవినాష్ రెడ్డి.. ఇటు వైఎస్ సునీతారెడ్డి లాయర్లకు హైకోర్టు సూచించింది. దీంతో అవినాష్ తరఫు న్యాయవాది సీజేని ఆశ్రయించారు. హైకోర్టు తీర్పునిచ్చిన నిమిషాల వ్యవధిలోనే ఎంపీ అవినాష్ రెడ్డికి సీజే బెంచ్‌లోనూ (CJ Bench) ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికిప్పుడు విచారణ సాధ్యం కాదని చీఫ్ జస్టిస్ తెలిపారు. వెకేషన్ బెంచ్‌ ముందు మెన్షన్ చేసుకోవాలని సీజే స్పష్టం చేశారు. అసలు ఈ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని సీజే చెప్పడంతో అవినాష్‌కు గట్టి షాక్ తగిలినట్లయ్యింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు సీజేఐ కామెంట్స్ చేశాక ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు..? అని తెలంగాణ హైకోర్టు సీజే ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు.

TS-High-Court.jpg

హైకోర్టు ఏం చెప్పింది..!?

ఇవాళ మధ్యాహ్నం3:30 గంటల నుంచి అటు అవినాష్ రెడ్డి.. ఇటు వైఎస్ సునీతారెడ్డి లాయర్లు తమ వాదనలు న్యాయస్థానానికి వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ముందస్తు బెయిల్‌పై ఇవాళ వాదనలు వినిపించినా తీర్పు ఇవ్వడం కుదరదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. రేపట్నుంచీ హైకోర్టుకు సెలవులు కావడంతో వెకేషన్ తర్వాతే తీర్పు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. దీంతో జూన్-05కు విచారణ వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. అయితే ఈ కేసులో అర్జెన్సీ ఉందని ఇరుపక్షాల లాయర్లు కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్‌పై తీర్పు అన్ని రోజులు రిజర్వ్‌లో పెట్టడం బాగుండదని.. అత్యవసరమైతే చీఫ్ కోర్టును అభ్యర్థించాలని హైకోర్టు సూచించింది. అంతేకాదు.. కేసును వెకేషన్‌ బెంచ్‌కు మార్చుకోవచ్చని హైకోర్టు ఇరు పక్షాలకు సూచించింది. సీజే ఎదుట మెన్షన్ చేసి ఆర్జెన్సీ ఉందని చెబితే.. ఆయన నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు తెలిపింది. దీంతో హైకోర్టులో అవినాష్‌కు గట్టి షాక్ తగిలినట్లయ్యింది.

MP-Avinash-Reddy.jpg

మొత్తానికి చూస్తే.. హైకోర్టు, సీజే బెంచ్‌లో ముందస్తు బెయిల్‌పై ఊరట లభించకపోవడంతో అవినాష్‌రెడ్డికి తిప్పలు తప్పేలా లేవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఇక సీబీఐ మరింత దూకుడు పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు.. సీబీఐ ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మరో రెండు మూడ్రోజుల్లో ఈ కేసులో కీలక పరిణామాలు ఉండే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Avinash In Viveka Case : వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు ఏం తేల్చిందంటే..

******************************

Avinash In Viveka Case : అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై సస్పెన్స్ కంటిన్యూ.. పలు లాజిక్‌లు చెప్పిన ఎంపీ తరఫు న్యాయవాది.. ఫైనల్‌గా ఏం తేలిందంటే..

******************************


Updated Date - 2023-04-28T17:50:02+05:30 IST