NCBN Arrest : లోకేష్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ మీటింగ్.. ఏం చేద్దాం.. ఎలా ముందుకెళ్దాం..?

ABN , First Publish Date - 2023-09-16T17:05:48+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ కేసులో అరెస్టయిన తర్వాత.. పార్టీకి, పార్టీని నమ్ముకున్న ప్రజలకు అన్నీ తానై యువనేత నారా లోకేష్ చూసుకుంటున్నారు..

NCBN Arrest : లోకేష్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ మీటింగ్.. ఏం చేద్దాం.. ఎలా ముందుకెళ్దాం..?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ కేసులో అరెస్టయిన తర్వాత.. పార్టీకి, పార్టీని నమ్ముకున్న ప్రజలకు అన్నీ తానై యువనేత నారా లోకేష్ చూసుకుంటున్నారు. యువగళం పాదయాత్రను ఆపేసి.. తన తండ్రిని సెంట్రల్ జైలు నుంచి బయటికి తీసుకురావడానికి అటు న్యాయ పోరాటం.. ఇటు జాతీయ స్థాయిలో జగన్ సర్కార్ తీరును ఎండగట్టడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారు చంద్రబాబుకు సపోర్టుగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో హస్తిన పర్యటనకెళ్లారు లోకేష్. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ఉండటం.. జాతీయ స్థాయిలో ఏపీలో జరుగుతున్న అన్యాయాలను వివరించడానికి హస్తినకు వెళ్లారు. ఇప్పటికే పలు ప్రముఖ టీవీ చానెల్స్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చిన లోకేష్.. ఇప్పుడు పార్లమెంట్‌ సమావేశాల్లో ఏపీలో జరుగుతున్న అక్రమాలను తెలియజేయడానికి.. ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు.


Lokesh-mps-meeting.jpg

ఏం చేద్దాం..?

కేంద్రంలోని పెద్దలను కలవడానికి ప్రయత్నాలు చేసున్నారు లోకేష్. మరోవైపు.. పార్లమెంట్ వేదికగా ఎంపీలు ఏం చేయాలి..? జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి..? ఇలా అన్ని విషయాలను పార్లమెంట్ వేదికగా ఎండగట్టాలని ఎంపీలకు లోకేష్ దిశానిర్ధేశం చేశారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి వ్యూహ రచన పూర్తయ్యింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో ఎంపీలంతా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి లోకేష్ అధ్యక్షత వహించగా.. పార్లమెంట్‌లో రాబోయే బిల్లులు, టీడీపీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మరీ ముఖ్యంగా.. కనీస ఆధారాలు లేకుండా చంద్రబాబు అరెస్ట్, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లేలా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఏ ఒక్కటీ మరిచిపోకుండా పార్లమెంట్‌లో ప్రస్తావించాలని.. ఎవరేం మాట్లాడాలనే విషయాలను కూడా అన్నీ క్లియర్ కట్‌గా లోకేష్ వివరించారు. అంతేకాదు.. వైసీపీతో పోరాటం చేసే పార్టీలు టీడీపీతో కలిసి రావాలని ఢిల్లీ వేదికగా లోకేష్ పిలుపునిచ్చే అవకాశం ఉంది. ఇవాళ రాత్రిలోపు ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ మీడియా ముందుకు రానున్నట్లు తెలియవచ్చింది.

Lokesh-and-CBN-Advocate.jpg


ఇవి కూడా చదవండి


NCBN Arrest : చంద్రబాబు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో పరిస్థితి ఎలా ఉందో ఈ ఒక్క సీన్‌తో చెప్పేయొచ్చు!

NCBN Arrest : చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై స్పందించిన వైఎస్ జగన్.. షాకిచ్చిన జనం



Updated Date - 2023-09-16T17:07:13+05:30 IST