NCBN Arrest : చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై స్పందించిన వైఎస్ జగన్.. షాకిచ్చిన జనం

ABN , First Publish Date - 2023-09-16T13:32:21+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్టుపై సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) తొలిసారి స్పందించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన ‘కాపు నేస్తం’ (Kapu Nestham) కార్యక్రమంలో పాల్గొన్న జగన్..

NCBN Arrest : చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై స్పందించిన వైఎస్ జగన్.. షాకిచ్చిన జనం

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్టుపై సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) తొలిసారి స్పందించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన ‘కాపు నేస్తం’ (Kapu Nestham) కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. చంద్రబాబు అరెస్టుపై (NCBN Arrest) మాట్లాడారు.


YS-Jagan.jpg

తేడాను గమనించండి..

చంద్రబాబును కాపాడటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చట్టం అందరికీ ఒకటే అని చెప్పిన వాళ్లు ఇంత వరకు లేరు. ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అనే అయన ప్రశ్నించారా?. నిబంధనలు పక్కన పెట్టి చంద్రబాబే స్వయంగా అగ్రిమెంట్‌ సృష్టించారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో (Skill Development Case) సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే. సాక్ష్యాలు, ఆధారాలు చూసి కోర్టు బాబును రిమాండ్‌కు పంపింది. మనం ఎలాంటి వ్యవస్థలో బతుకుతున్నామో ఆలోచించండి. బాబు హయాంలో వందల కోట్ల ప్రజాధనం ఎక్కడికి పోయింది?. చంద్రబాబును కాకుండా ఎవరిని అరెస్టు చేయాలి?. చంద్రబాబు ప్రభుత్వం, మా ప్రభుత్వ తేడాను గమనించండి న్యాయం, ధర్మం మా పక్షాన ఉన్నాయి. జరగబోయేది కురుక్షేత్ర యుద్ధం అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు.

Lokesh-and-CBN-Advocate.jpg

షాకిచ్చిన జనం..!

ఓ వైపు కాపు నేస్తం సభ జరుగుతుండగా జగన్‌కు జనం ఊహించని షాకిచ్చారు. సభ నుంచి పెద్ద ఎత్తున జనం వెళ్లిపోయారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ గురించి ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడిక ఒక్కసారిగా భారీగా జనాలు కూర్చీల్లో నుంచి లేచి.. బయటికి వెళ్లిపోయారు. ‘జగన్ ఇక షురూ చేశాడ్రా బాబూ.. తట్టుకోలేం.. ఎందుకీ తలనొప్పి’ అంటూ జనాలు సభ నుంచి పరుగులెత్తారు. అంతేకాదు.. సభ ప్రారంభం కాకమునుపే వందల సంఖ్యలో జనాలు తిరిగి వెళ్లిపోయారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ఇవ్వడం జరిగింది. స్కూళ్లు తెరిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. సుమారు 700 బస్సుల్లో జనాలు తరలించినప్పటికీ ఇలా సభ ప్రారంభం కాక మునుపు.. మధ్యలో వెళ్లిపోవడంపై స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారట.

Jagan-Sabhalo-Janam.jpg

కోతల నేస్తం..!

మరోవైపు.. లోన్లు ఎత్తేసి సాయం పేరుతో జగన్ సర్కార్ మోసం చేస్తోందని కాపు సోదరులు తిట్టిపోస్తున్నారు. ఇప్పటికే ఉపాధి లేక కాపు యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఇంతవరకూ కాపులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లను జగన్ సర్కార్ అమలే చేయలేదు. కాపునేస్తం పేరుతో ఇచ్చే దాంట్లోనూ ఏపీ ప్రభుత్వం కోత విధించింది. అయిదేళ్లలో రూ. 75 వేలు ఇస్తామని ఇప్పుడు ఇస్తోంది నాలుగవ విడతే. ఒక విడత తప్పించడం ద్వారా రూ. 500 కోట్లు ప్రభుత్వం ఎగ్గొట్టింది. సంవత్సరానికి రూ. 25వేల కోట్లు కాపులకు ఇస్తామన్న హామీపైనా జగన్ మాట తప్పేశారు. మొత్తానికి చూస్తే.. ‘కాపు నేస్తం’.. కాస్త ‘కోతల నేస్తం’గా (Kothala Nestham) మారిపోయిందన్న మాట.

chand-jagan.jpg


ఇవి కూడా చదవండి


NCBN Arrest : లండన్ పర్యటన తర్వాత మారిన సీన్.. వైఎస్ జగన్ భయపడ్డారా..!?


TS Politics : విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ దసరా కానుక.. ఇకపై రోజూ..


ABN Fact Check : పవన్ పొత్తు ప్రకటన చేసిన నిమిషాల్లోనే.. వైసీపీ చేసిన కుట్ర ఏంటో చూడండి..!


Lokesh Delhi Tour : హుటాహుటిన హస్తినకు లోకేష్.. ఏపీలో మారిన సీన్.. ఏం జరగబోతోంది..?


Delhi Liquor Case : ఈడీ నోటీసులొచ్చాక కేసీఆర్‌తో కవిత భేటీ.. ఈడీ విచారణపై ఫైనల్‌గా నిర్ణయమిదీ..!


NCBN Arrest : చంద్రబాబు కేసులో కీలక పరిణామం.. రేపు శుభవార్త ఉంటుందా..!?


Balakrishna : తగ్గేదేలే.. ఇకపై దెబ్బకు దెబ్బ.. వేటుకు వేటే!


Luthra On CBN Case : కత్తి దూసి పోరాడాల్సిందే.. బాబు అరెస్ట్‌పై సిద్ధార్థ లూథ్రా ఆసక్తికర ట్వీట్


YSRCP Vs TDP : వై‘చీప్’ పాలిట్రిక్స్‌ను పసిగట్టిన టీడీపీ.. వ్యూహాత్మకంగా ‘లూథ్రా’ అడుగులు.. చంద్రబాబుకు బిగ్ రిలీఫ్!


Updated Date - 2023-09-16T13:37:52+05:30 IST