TS Politics : విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ దసరా కానుక.. ఇకపై రోజూ..

ABN , First Publish Date - 2023-09-15T21:31:30+05:30 IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సీఎం కేసీఆర్ (CM KCR) వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే పలు శుభవార్తలు చెప్పిన గులాబీ బాస్.. తాజాగా విద్యార్థులకు దసరా కానుక (Dussehra Gift) ప్రకటించారు...

TS Politics : విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ దసరా కానుక.. ఇకపై రోజూ..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సీఎం కేసీఆర్ (CM KCR) వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే పలు శుభవార్తలు చెప్పిన గులాబీ బాస్.. తాజాగా విద్యార్థులకు దసరా కానుక (Dussehra Gift) ప్రకటించారు. తెలంగాణలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మరో వినూత్న పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.


2kcr---Copy.jpg

ఇక టిఫిన్..!

ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో (1 నుంచి 10 తరగతి వరకు) చదువుకునే విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘ ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ (CM Breakfast Scheme) పేరుతో అల్పాహారం అందించనున్నట్లు సర్కారు జీవో జారీచేసింది. దసరా రోజు అనగా అక్టోబర్-24 నుంచి ఈ పథకంగా ప్రారంభం కానుంది. పాఠశాల పనిదినాల్లో మాత్రమే ఉదయం పూట టిఫిన్ (Tiffin) లాగా అందించునున్నారు. ఈ పథకం వల్ల ప్రభుత్వంపై రూ. 400 కోట్ల అదనపు భారం పడనుందని కేసీఆర్ సర్కార్ పేర్కొంది. కాగా ఇప్పటికే మధ్యాహ్నం భోజన పథకం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో అమలవుతున్న విషయం తెలిసిందే.

ap-govt-schools.jpg

అటు నుంచి ఇటు..!

ఉదయాన్నే వ్యవసాయ, కూలీ పనులకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకొని ప్రభుత్వం.. మానవీయ ఆలోచనకు అద్దం పట్టే దిశగా ఈ పథకాన్ని తీసుకొస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ఇలా అల్పాహార పథకాన్ని తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ (Stalin Sarkar) అమలు చేస్తుండగా.. ఐఏఎస్ అధికారుల బృందం వెళ్లి అక్కడి పరిస్థితులను.. పథకం అమలవుతున్న తీరును గమనించి కేసీఆర్‌కు ఒక నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత సాధ్యాసాధ్యాలను పరిశీలించిన కేసీఆర్.. ఫైనల్‌గా తెలంగాణలోనూ అమలు చేయాలని నిర్ణయించి ఈ మేరుకు ‘ ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ అమల్లోకి తెస్తున్నారు. సర్కార్ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులను నుంచి హర్షాతిరేకాలు వస్తున్నాయి.

Dasara-Gift.jpg

Updated Date - 2023-09-15T21:36:11+05:30 IST