Lokesh Delhi Tour : హుటాహుటిన హస్తినకు లోకేష్.. ఏపీలో మారిన సీన్.. ఏం జరగబోతోంది..?

ABN , First Publish Date - 2023-09-15T00:10:26+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) అరెస్ట్ అయిన తర్వాత పరిస్థితులు చోటుచేసుకున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

Lokesh Delhi Tour : హుటాహుటిన హస్తినకు లోకేష్.. ఏపీలో మారిన సీన్.. ఏం జరగబోతోంది..?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) అరెస్ట్ అయిన తర్వాత పరిస్థితులు చోటుచేసుకున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా చంద్రబాబుతో రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా జరిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ములాఖత్‌తో ఒక్కసారిగా రాష్ట్రంలో పరిణామాలు మారిపోయాయి. టీడీపీ-జనసేన (TDP-Janasena) కలిసే వైసీపీపై పోరాటం చేస్తాయని పవన్ ప్రకటించడం పెను సంచలనంగా మారింది. ఆ తర్వాత పవన్ ప్రకటనను ఎమ్మెల్యే నందమూరి బాలయ్య, టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారాలోకేష్ స్వాగతించడంతో వైసీపీ పెద్దల్లో ముచ్చెమటలు ఆగలేదు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే అత్యవసరంగా లోకేష్ ఢిల్లీకి పయనం అయ్యారు. ఆయన ఢిల్లీ వెళ్తున్నారని మొదటి వార్తలు రావడం.. టీడీపీ ఖండించడంతో అక్కడితో ముగిసిపోయిందనుకున్నారు.. కానీ ఆ కొద్దిసేపటికే లోకేష్ పర్యటన నిజమేనని అధికారిక ప్రకటన వచ్చింది.. ఆయన హస్తినకు బయల్దేరి వెళ్లారు కూడా.


Lokesh-Delhi.jpg

ఎందుకీ పర్యటన..?

నారా లోకేష్ అత్యవసరంగా ఢిల్లీ బయల్దేరి (Lokesh Delhi Tour) వెళ్లారు. రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు. మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండే అవకాశాలున్నాయి. అయితే.. లోకేష్ హస్తినకు వెళ్తున్నట్లు..? ఎందుకు వెళ్తున్నారు..? ఢిల్లీ వేదికగా ఏం చేయబోతున్నారు..? ఎవరెవర్ని కలవబోతున్నారు..? అనే విషయాలు ఇప్పటి వరకూ తెలియరాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే లోకేష్ పర్యటనను టీడీపీ అధిష్టానం అత్యంత గోప్యంగా ఉంచింది. అయితే మూడ్రోజుల పాటు ఉంటారని మాత్రమే బయటికి సమాచారం పొక్కింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చిందని కొందరు చెబుతుంటే.. ఢిల్లీ పెద్దల్ని కలిసేందుకని మరి కొందరు చెబుతున్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు ఒకరిద్దరు పెద్దలను లోకేష్ కలవబోతున్నారని మాత్రం వార్తలు గుప్పుమంటున్నాయి. మరోవైపు.. అక్రమంగా చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు, తదనాంతరం చోటు చేసుకున్న పరిణామాలను జాతీయ మీడియా ముందు ప్రజంటేషన్ ఇవ్వడం ద్వారా.. ఇప్పటికంటే మరింత ఎక్కువగా జాతీయ స్థాయిలో చర్చకు తెరతీయాలనేది టీడీపీ యోచన అన్నట్లుగా తెలుస్తోంది. లోకేష్ ఢిల్లీ పర్యటన ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు హాట్ టాపిక్‌గా మారింది.

Balu-and-Pawan.jpg

వీటిపైనా..?

మరీ ముఖ్యంగా.. ఏపీలో దాడులు చేసినవారిని వదిలేసి బాధితులపైనే ఎక్కువగా కేసులు పెడుతున్నారన్నది గత కొద్దిరోజులుగా టీడీపీ నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ ఏపీలో జరిగిన అరాచకాలు దేశంలో మరెక్కడా జరగలేదనే విషయాన్ని హస్తిన వేదికగా జాతీయ మీడియాకు లోకేశ్ వివరించనున్నారు. దీంతో పాటు.. అంగళ్లులో చంద్రబాబుపై జరిగిన దాడి.. అంతేకాకుండా తిరిగి చంద్రబాబుపైనే హత్యాయత్నం కేసు నమోదు చేయడాన్ని.. ఏపీలో శాంతి భద్రతలు ఏవిధంగా ఉండాయనేది ఢిల్లీ పెద్దలకు, జాతీయ మీడియాకు వివరించబోతున్నారట. తాను చేపట్టిన యువగళం పాదయాత్రలో జరిగిన పరిణామాలు.. ఇలా ఏ ఒక్కటి మరిచిపోకుండా ప్రతిదీ నోట్ చేసుకున్న లోకేష్.. ఆ నివేదికను ఢిల్లీ పెద్దలకు ఇవ్వడం, ఆ తర్వాత జాతీయ మీడియా ముందుంచడం చేస్తారని తెలియవచ్చింది. మరోవైపు.. బాబు అరెస్టుపై లోక్‌సభలో పార్టీ ఎంపీలతో మాట్లాడించాలని లోకేష్ ఫిక్సయ్యారట. ఢిల్లీ పెద్దలతో చర్చలు, జాతీయ మీడియాతో మాట్లాడిన తర్వాత చంద్రబాబు కేసు విషయంలో సుప్రీంకోర్టు న్యాయవాదులో లోకేష్ చర్చించనున్నారట.

Lokesh-and-CBN-Advocate.jpg

మొత్తానికి చూస్తే.. చూశారుగా అక్రమంగా జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన నాన్న కోసం.. నాన్నను బయటికి తీసుకురావడం కోసం ‘నాన్నకు ప్రేమతో..’ లోకేష్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో.!


ఇవి కూడా చదవండి


Delhi Liquor Case : ఈడీ నోటీసులొచ్చాక కేసీఆర్‌తో కవిత భేటీ.. ఈడీ విచారణపై ఫైనల్‌గా నిర్ణయమిదీ..!


NCBN Arrest : చంద్రబాబు కేసులో కీలక పరిణామం.. రేపు శుభవార్త ఉంటుందా..!?


Balakrishna : తగ్గేదేలే.. ఇకపై దెబ్బకు దెబ్బ.. వేటుకు వేటే!


Luthra On CBN Case : కత్తి దూసి పోరాడాల్సిందే.. బాబు అరెస్ట్‌పై సిద్ధార్థ లూథ్రా ఆసక్తికర ట్వీట్


YSRCP Vs TDP : వై‘చీప్’ పాలిట్రిక్స్‌ను పసిగట్టిన టీడీపీ.. వ్యూహాత్మకంగా ‘లూథ్రా’ అడుగులు.. చంద్రబాబుకు బిగ్ రిలీఫ్!


Updated Date - 2023-09-15T00:12:35+05:30 IST