ABN Fact Check : పవన్ పొత్తు ప్రకటన చేసిన నిమిషాల్లోనే.. వైసీపీ చేసిన కుట్ర ఏంటో చూడండి..!

ABN , First Publish Date - 2023-09-15T16:54:39+05:30 IST

టీడీపీతో (Telugudesam) కలిసి ప్రయాణం చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలను (AP Politics) ఒక కుదుపు కుదిపింది. ముందస్తుగా సంకేతాలు ఇవ్వకుండా ఆకస్మికంగా సేనాని చేసిన ఈ ప్రకటన.. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకుండా చేయగలమన్న నమ్మకంతో ఉన్న వైసీపీ వర్గాలకు షాక్‌ ఇచ్చింది...

ABN Fact Check : పవన్ పొత్తు ప్రకటన చేసిన నిమిషాల్లోనే.. వైసీపీ చేసిన కుట్ర ఏంటో చూడండి..!

టీడీపీతో (Telugudesam) కలిసి ప్రయాణం చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలను (AP Politics) ఒక కుదుపు కుదిపింది. ముందస్తుగా సంకేతాలు ఇవ్వకుండా ఆకస్మికంగా సేనాని చేసిన ఈ ప్రకటన.. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకుండా చేయగలమన్న నమ్మకంతో ఉన్న వైసీపీ వర్గాలకు షాక్‌ ఇచ్చింది. నిజానికి, టీడీపీ-జనసేన పొత్తు (TDP-Janasena Alliance) వ్యవహారం దీర్ఘకాలంగా ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. పొత్తు ఉంటుందని ఈ రెండు పార్టీల వర్గాలు ఆశాభావంతో ఉన్నా బీజేపీ అధినాయకత్వం ఆలోచనలు ఎలా ఉంటాయన్న అంశం రాజకీయవర్గాల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో అటు జనసేన.. ఇటు టీడీపీ ఏదో ఒక విధంగా బురదజల్లాలని ప్లాన్ చేసిన వైసీపీ శ్రేణులు.. సోషల్ మీడియాలో (Social Media) దిగజారిపోయి మరీ ప్రవర్తిస్తున్నాయి. తాజాగా జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) చేసినట్లు ఉన్న ఓ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అసలు నాదెండ్ల చేయకపోయినా సరే.. ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ కొందరు ఇలా చేయడం గమనార్హం. అసలు ఇందులో నిజానిజాలెంత అనే విషయాలను ‘ఏబీఎన్ ఫ్యాక్ట్ చెక్’ (ABN Fact Check) చేసింది. ఇంతకీ ఏమిటా ప్రకటన..? ఎందుకింతలా చర్చనీయాంశం అయ్యింది..? జనసేనపై ఎందుకింతలా వైసీపీ శ్రేణులు కక్షగట్టాయి..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..


Pawan-on-Alliance.jpg

ప్రకటన సారాంశం ఏంటి..!

నాదెండ్ల పేరిట వైరల్ అవుతున్న ప్రకటన ఇదే. ‘జనసేన నాయకులు, నేతలు కూడా ఈ సారి టీడీపీ గుర్తు మీదనే. టీడీపీ బీ ఫామ్ మీదనే పోటీ చేస్తారు.. కారణం రాష్ట్ర స్థాయి పార్టీ హోదా లేకపోవడం వలన, మినిమం అభ్యర్థులు గెలవకపోవడం వలన కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును రద్దు చేసింది. కావున ఈ ఎన్నికలకు టీడీపీ గుర్తు మీదనే పోటీ చేయగలుగుతుంది. లేదా జనసేన నుంచి అభ్యర్థులను నిలపకుండా.. పోటీలో లేకుండా తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక జనసైనికుడు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని తెలుగుదేశం క్యాడర్‌తో కలిసి పనిచేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఇట్లు నాదెండ్ల మనోహర్ జనసేన ముఖ్య నేత’ అని వైరల్ అవుతున్న ప్రకటనలో ఉంది. అటు ట్విట్టర్.. ఇటు వాట్సాప్ గ్రూపుల్లో పనిగట్టుకుని మరీ కొందరు ప్రచారం చేస్తున్నారంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు.

CBN and PAwan.jpeg

ఇదీ అసలు కథ!

టీడీపీ-జనసేన కలిసే పోటీచేస్తాయని పవన్ ప్రకటనచేసిన మరుసటి క్షణం నుంచే.. ఆ విషయాన్ని ఎలా డైవర్ట్ చేయాలి..? జనాల్లోకి వెళ్లకుండా సోషల్ మీడియాలో చర్చ జరగకుండా చేయాలని చేయాల్సిన కుట్రలు, కుతంత్రలు అన్నీ వైసీపీ పన్నింది. అధికార పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు సోషల్ మీడియాలో లేని పోని ఎడిటింగ్ చేసి.. ఇష్టానుసారం అందులోని మ్యాటర్ మార్చేశారు. దీన్ని కాస్త నిశితంగా పరిశీలిస్తే.. అసలు విషయం ఏంటనేది అర్థమవుతుంది. ఇదే విషయమే ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఫ్యాక్ట్‌ చెక్‌’లో తేలింది. ఇదంతా ఫొటో షాప్‌లో మార్చడం.. లేదా ఇదివరకున్న ప్రకటనలో మ్యాటర్ మొత్తం మార్చేసి సంతకం అలాగే ఉంచడం చేశారన్నది క్లియర్‌ కట్‌గా తేలింది. దీనిపై టీడీపీ, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నాయి. ఇక మీమ్స్‌కు అయితే కొదువే లేదు. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావేంట్రా అని కొందరు అంటుంటే.. రేయ్.. ఎవర్రా మీరంతా అని ఇంకొందరు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. చూశారుగా కదా.. అలా పొత్తుపై ప్రకటన వచ్చిందో లేదో.. ఇలా మొదలెట్టేశారు. ఇంకా మున్ముందు.. టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నుంచి బయటికి వచ్చాక, రెండు పార్టీలు కలిసి కార్యక్రమాలు షురూ చేస్తే వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో ఉహకందదేమో మరి.

Fake Announcement.jpeg


ఇవి కూడా చదవండి


Lokesh Delhi Tour : హుటాహుటిన హస్తినకు లోకేష్.. ఏపీలో మారిన సీన్.. ఏం జరగబోతోంది..?


Delhi Liquor Case : ఈడీ నోటీసులొచ్చాక కేసీఆర్‌తో కవిత భేటీ.. ఈడీ విచారణపై ఫైనల్‌గా నిర్ణయమిదీ..!


NCBN Arrest : చంద్రబాబు కేసులో కీలక పరిణామం.. రేపు శుభవార్త ఉంటుందా..!?


Balakrishna : తగ్గేదేలే.. ఇకపై దెబ్బకు దెబ్బ.. వేటుకు వేటే!


Luthra On CBN Case : కత్తి దూసి పోరాడాల్సిందే.. బాబు అరెస్ట్‌పై సిద్ధార్థ లూథ్రా ఆసక్తికర ట్వీట్


YSRCP Vs TDP : వై‘చీప్’ పాలిట్రిక్స్‌ను పసిగట్టిన టీడీపీ.. వ్యూహాత్మకంగా ‘లూథ్రా’ అడుగులు.. చంద్రబాబుకు బిగ్ రిలీఫ్!


Updated Date - 2023-09-15T17:02:33+05:30 IST