NCBN Arrest : లండన్ పర్యటన తర్వాత మారిన సీన్.. వైఎస్ జగన్ భయపడ్డారా..!?

ABN , First Publish Date - 2023-09-15T22:17:39+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) భయపడ్డారా..? లండన్ పర్యటన (London Tour) నుంచి తిరిగొచ్చాక పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయా..? అంటే తాజాగా జరిగిన ఓ కార్యక్రమంతో ఇవన్నీ అక్షరాలా నిజమేనని అనిపిస్తోంది...

NCBN Arrest : లండన్ పర్యటన తర్వాత మారిన సీన్.. వైఎస్ జగన్ భయపడ్డారా..!?

ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) భయపడ్డారా..? లండన్ పర్యటన (London Tour) నుంచి తిరిగొచ్చాక పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయా..? అంటే తాజాగా జరిగిన ఓ కార్యక్రమంతో ఇవన్నీ అక్షరాలా నిజమేనని అనిపిస్తోంది. ప్రభుత్వాన్ని పొల్లెత్తు మాట అంటే చాలు.. అదెలాంటి కార్యక్రమం అయినా సరే రాజకీయ ప్రస్తావన వచ్చేస్తుంటుంది. ఇక ప్రతిపక్షాలపైన అయితే నిత్యం నోరుపారేసుకుంటూ ఉంటారు జగన్. అలాంటిది ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలపై సీఎం ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు..? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.


CBN-Case.jpg

అసలేం జరిగింది..?

ఏపీలో గత కొన్నిరోజులుగా రాజకీయ పరిణామాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును (Chandrababu Arrest) అక్రమంగా అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాబు అక్రమ అరెస్టును తెలుగు రాష్ట్రాలతో (Telugu States) పాటు దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలు.. పలు రాష్ట్రాల సినీ, రాజకీయ ప్రముఖులు.. దేశ విదేశాల ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడచూసినా బాబు అరెస్టుపై నిరసన జ్వాలలు హోరెత్తుతున్నాయి. నీతి నిజాయితి గల వ్యక్తిని.. మచ్చలేని చంద్రుడిని అరెస్ట్ చేశారంటూ తెలుగు ప్రజలు రగిలిపోతున్నారు. దీంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయ వాతావరణం మారిపోయింది. సరిగ్గా ఇదే పరిస్థితుల్లో.. చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ములాఖత్ కావడం.. ఆ వెంటనే టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందని, కలిసే బరిలోకి దిగుతామని ప్రకటించడం పెను సంచలనంగా మారింది. మరోవైపు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh Delhi Tour) హస్తిన పర్యటనకు వెళ్లడం ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి కీలక పరిణామాలే రాష్ట్రంలో చోటుచేసుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా జగన్ మాత్రం ఎందుకో మౌనం పాటిస్తున్నారు..? ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు .. సొంత పార్టీలో జరుగుతున్న చర్చ. అయితే.. ఏదో అనుకొని సీఎం లండన్ పర్యటనకు వెళ్లడం ఇక్కడేమో పరిస్థితులు మారిపోవడం.. వచ్చీరాగానే ఏపీలో వాతావరణం చూసి కంగుతిన్నారట. అందుకే ఇకపై ఈ అరెస్టులు, నిరసనపై మాట్లాడకూడదనే జగన్ మౌనం పాటిస్తున్నారట.

YS-Jagan.jpg

మౌనమా.. భయమా..?

శుక్రవారం నాడు మెడికల్‌ కాలేజీల ప్రారంభోత్సవం జరిగింది. ఒకేసారి ఐదు మెడికల్‌ కాలేజీలను ప్రారంభించిన జగన్.. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పలు విషయాలు మాట్లాడారు కానీ.. రాజకీయంగా మాట్లాడటానికి ఎందుకో సాహసించలేదు. చంద్రబాబు అరెస్టుపై, టీడీపీ-జనసేన పొత్తులపై.. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలపై కనీసం స్పందించనే లేదు. దీంతో జగన్ భయపడుతున్నారా..? లేకుంటే ఇప్పట్లో ఏం మాట్లాడినా సరే అది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని మౌనం పాటిస్తున్నారా..? అనేది తెలియట్లేదు. జగన్ ఇలా ఉండటాన్ని సొంత పార్టీ నేతలే సహించట్లేదట. ఇంత భయం ఎందుకు..? ఈ విషయాలన్నీ చంద్రబాబును టచ్ చేసినప్పుడు తెలియదా..? ఇంత భయం ముందుకు ఎక్కడికెళ్లింది..? అని సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. అయితే.. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కాబట్టే జగన్ భయపడి ముందుకెళ్లలేకపోతున్నారనే కామెంట్స్ సర్వత్రా వస్తున్నాయి. ఇప్పుడు అరెస్ట్ చేస్తారు సరే.. రేపొద్దున 2024 ఎన్నికల్లో (2024 Elections) వైసీపీ ఓడిపోతే జగన్ పరిస్థితి ఏంటి..? అవన్నీ ఇప్పుడు కళ్ల ముందు కనిపించాయి కాబట్టే.. ఇకదీన్ని మరింత సీన్‌లా క్రియేట్ చేయడం అనవసరం అని.. అసలే ఏపీలో ఆగ్రహ జ్వాలలు రగిలిపోతున్నాయని.. ఈ పరిస్థితుల్లో ఏ మాత్రం ముందడుగేసినా.. మాట్లాడినా కథ వేరేలా ఉంటుందని గ్రహించే ఇలా మిన్నకుండిపోయారని భోగట్టా.

cm-jagan-cabinet.jpg

వాస్తవానికి ఇలా..!

టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తామని పవన్‌ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపు కుదిపింది. ముందస్తుగా సంకేతాలు ఇవ్వకుండా ఆకస్మికంగా ఆయన చేసిన ఈ ప్రకటన.. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకుండా చేయగలమన్న నమ్మకంతో ఉన్న వైసీపీ వర్గాలకు షాక్‌ ఇచ్చింది. నిజానికి, టీడీపీ-జనసేన పొత్తు వ్యవహారం దీర్ఘకాలంగా ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. పొత్తు ఉంటుందని ఈ రెండు పార్టీల వర్గాలు ఆశాభావంతో ఉన్నా బీజేపీ అధినాయకత్వం ఆలోచనలు ఎలా ఉంటాయన్న అంశం రాజకీయవర్గాల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. అయితే కేంద్రపెద్దలతో ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న సత్సంబంధాల ఆధారంగా పవన్‌ టీడీపీ వైపు వెళ్లకుండా ఆపుచేస్తారని, ఎవరికి వారు విడివిడిగా పోటీచేస్తే గెలుపు మళ్లీ తమదే అవుతుందని వైసీపీ నాయకులు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. పొత్తుపై ప్రకటనకు పవన్‌ సరైన సమయమే ఎంపిక చేసుకొన్నారని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏపీలో రాజకీయంగా జరగకూడని పరిణామాలన్నీ జరిగిపోతున్నాయని.. దీంతో ఒకింత జగన్ డీలా పడిపోయారని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే.. ఇలా జగన్ ఏమీ మాట్లాడలేకపోతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మున్ముందు ఇంకా ఏం జరుగుతుందో.. ఏపీలో ఇంకా ఏమేం పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి మరి.

tdp and janasena.jpg


ఇవి కూడా చదవండి


TS Politics : విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ దసరా కానుక.. ఇకపై రోజూ..


ABN Fact Check : పవన్ పొత్తు ప్రకటన చేసిన నిమిషాల్లోనే.. వైసీపీ చేసిన కుట్ర ఏంటో చూడండి..!


Lokesh Delhi Tour : హుటాహుటిన హస్తినకు లోకేష్.. ఏపీలో మారిన సీన్.. ఏం జరగబోతోంది..?


Delhi Liquor Case : ఈడీ నోటీసులొచ్చాక కేసీఆర్‌తో కవిత భేటీ.. ఈడీ విచారణపై ఫైనల్‌గా నిర్ణయమిదీ..!


NCBN Arrest : చంద్రబాబు కేసులో కీలక పరిణామం.. రేపు శుభవార్త ఉంటుందా..!?


Balakrishna : తగ్గేదేలే.. ఇకపై దెబ్బకు దెబ్బ.. వేటుకు వేటే!


Luthra On CBN Case : కత్తి దూసి పోరాడాల్సిందే.. బాబు అరెస్ట్‌పై సిద్ధార్థ లూథ్రా ఆసక్తికర ట్వీట్


YSRCP Vs TDP : వై‘చీప్’ పాలిట్రిక్స్‌ను పసిగట్టిన టీడీపీ.. వ్యూహాత్మకంగా ‘లూథ్రా’ అడుగులు.. చంద్రబాబుకు బిగ్ రిలీఫ్!




Updated Date - 2023-09-15T22:24:24+05:30 IST