NCBN Arrest : చంద్రబాబు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో పరిస్థితి ఎలా ఉందో ఈ ఒక్క సీన్‌తో చెప్పేయొచ్చు!

ABN , First Publish Date - 2023-09-16T16:33:04+05:30 IST

టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై (Chandrababu) జగన్ రాజకీయ కక్ష జిల్లా పోలీసులకు పరీక్షగా మారింది. అసలే తూర్పుగోదావరి జిల్లాలో

NCBN Arrest : చంద్రబాబు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో పరిస్థితి ఎలా ఉందో ఈ ఒక్క సీన్‌తో చెప్పేయొచ్చు!

  • జగన్ రాజకీయ కక్ష.. పోలీసులకు కక్ష

  • సెంట్రల్ జైలులో చంద్రబాబు ఉండడంతో..

  • ఉన్నతాధికారులు సహా నలిగిపోతున్న సిబ్బంది

  • అసలే తూర్పుగోదావరి జిల్లాలో సిబ్బంది కొరత

  • జైలు ముందు పెద్దఎత్తున బందోబస్తు

  • ఎస్పీకి జిల్లా కొత్త.. వచ్చిన వెంటనే ఇవే విధులు

  • సీఎం నిడదవోలు రాకతో పోలీసులకు మరిన్ని కష్టాలు

తూర్పుగోదావరి/రాజమహేంద్రవరం : టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై (Chandrababu) జగన్ రాజకీయ కక్ష జిల్లా పోలీసులకు పరీక్షగా మారింది. అసలే తూర్పుగోదావరి జిల్లాలో పోలీసు సిబ్బంది కొరత ఉంది. పోలీస్ స్టేషన్లలో రోజువారీ విధులకే సరిపోవడం లేదు. ఈ జిల్లా సాధారణంగానే వీఐపీల తాకిడి ఎక్కువ. రోజూ బందోబస్తులు తప్పనిసరి. దీంతో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నమోదు చేసుకోవడం వేగంగా జరుగుతున్నా దర్యాప్తునకు నానాతంటాలు తప్పేవి కావు. సిబ్బంది కొరతతో రోజువారీ డ్యూటీలు వేయడానికి అధికారులకు తలపోటు తప్పేదికాదు. ఇప్పుడు. చంద్రబాబు ఉన్న సెంట్రల్ జైలు వద్ద బందోబస్తు, వినాయకచవితి హడావుడి, సీఎం పర్యటన. అన్నీ ఒకేసారి మీదపడడంతో పోలీసుల పరిస్థితి దయనీయంగా మారింది.


Rajamundry-Jail.jpg

ఈనెల 10న రాత్రి చంద్రబాబు జైలుకు రావడంతో పోలీసులకు పరుగులు మొదలయ్యాయి. పికెట్ ఏర్పా టు, నిరంతర బందోబస్తు డ్యూటీలు, చంద్రబాబుతో ములాఖత్‌కి ప్రముఖులు వచ్చినపుడు మరింత భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపు తదితర విధుల్లో బిజీ అయిపోయారు. 18న వినాయక చవితి పర్వదినం కావడంతో చవితి పందిళ్ల వద్ద పరిస్థితి, వేడుకలకు అనుమతి, రోజు వారే పర్యవేక్షణ. నిమజ్జనానికి భద్రత చూడాల్సి ఉంది. ఇంతలోనే శనివారం సీఎం జగన్ బటన్ నొక్కుడు కార్య క్రమానికి నిడదవోలు వస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు, ప్రజాసంఘాలు చేస్తున్నాయి. వీటిని ప్రభుత్వం పోలీసుల సహాయంతో అడ్డుకుంటోంది.

Chandrababu-Car.jpg

దీంతో విశాఖ నుంచి ఏపీఎస్పీ పోలీసు లను రప్పించినా, రిజర్వు పోలీసుల సేవలనూ వినియోగించుకుంటున్నా దినదిన గండం మాదిరిగా పోలీసులకు రోజులు గడుస్తున్నాయి. దీనికితోడు ఎస్సీ కొత్తగా వచ్చారు. జిల్లా గురించి అవగాహన పూర్తిగా రావడానికి సమయం పడుతుంది. ఆయన చార్జి తీసుకున్న చంద్రబాబు సెంట్రల్ జైలుకు వచ్చారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు కంటిపై కునుకు కరువైంది. సిబ్బందికి అదనపు డ్యూటీలు ఎక్కువకావడంతో ఒత్తిడి తప్పడం లేదు. జగన్ ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసును పెంచింది. కొత్తగా నియామకాలను చేపట్టలేదు. దీంతో మామూలు రోజుల్లో సైతం డబుల్, ట్రిబుల్ డ్యూటీలు చేస్తుండగా ప్రస్తుతం సెలవు మాట దేవుడెరుగు.. కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి సమయం దొరకడం లేదు.

CBN-Case.jpg

Updated Date - 2023-09-16T16:33:04+05:30 IST