MLC Kavitha ED Enquiry : ఈడీ ఆఫీసు నుంచి కవిత ఎలా వచ్చారో చూడండి.. ఆమెను చూసి అంతా ఒక్కసారిగా.. ఫొటోలు వైరల్..!

ABN , First Publish Date - 2023-03-11T22:01:33+05:30 IST

దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (BRS MLC Kavitha) 9 గంటలపాటు సుదీర్ఘంగా ఈడీ విచారించింది..

MLC Kavitha ED Enquiry : ఈడీ ఆఫీసు నుంచి కవిత ఎలా వచ్చారో చూడండి.. ఆమెను చూసి అంతా ఒక్కసారిగా.. ఫొటోలు వైరల్..!

దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (BRS MLC Kavitha) 9 గంటలపాటు సుదీర్ఘంగా ఈడీ విచారించింది (ED Enquiry). ఇవాళ ఉదయం 11 గంటలకు మొదలైన ఈడీ విచారణ రాత్రి 8 గంటలకు ముగిసింది. మొత్తం 9 గంటలకు ఇవాళ ఈడీ అధికారులు కవితను విచారించారు. ఈనెల 16న మరోసారి విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. గురువారం నాడు మరోసారి ఢిల్లీలోని ఈడీ అధికారుల ఎదుట ఎమ్మెల్సీ హాజరుకానున్నారు. కాగా.. ఇవాళ విచారణలో లిక్కర్ పాలసీలో జరిగిన అవకతవకలు మొదలుకుని, ఫోన్లు ధ్వంసం, అరుణ్ పిళ్లై-గోరంట్ల బుచ్చిబాబుతో ఉన్న సంబంధాలపై ఈడీ ఆరాతీసినట్లు తెలియవచ్చింది. ముఖ్యంగా ఈడీ విచారణ మధ్యలో లంచ్ బ్రేక్ ఇచ్చి ఇంటి దగ్గరున్న కవిత పర్సనల్ ఫోన్‌ను (Kavitha Phone) ఆఫీసుకు తెప్పించారు. ఆ వెంటనే కవిత ఫోన్‌ను ఈడీ సీజ్ చేసింది. ఇదలా ఉంచితే.. విచారణ సమయం ముగిసినప్పటికీ కవిత బయటికి రాకపోవడం, ఈడీ కార్యాలయం చుట్టూ పోలీసులు హై అలర్ట్ ప్రకటించడం, మీడియాను కూడా అనుమతించకపోవడంతో అసలేం జరుగుతోందో తెలియక బీఆర్ఎస్ శ్రేణుల్లో నరాలు తెగేలా ఉత్కంఠ నెలకొంది. అప్పటికే విచారణ తర్వాత అరెస్ట్ చేస్తారని ఢిల్లీలో వార్తలు చక్కర్లు కొట్టాయి. సీన్ కట్ చేస్తే.. రాత్రి 8 గంటల తర్వాత ఈడీ ఆఫీసు నుంచి కవిత బయటికొచ్చేశారు.

Kavitha-Happy-Come.jpg

అంతా ఓకే.. ధైర్యంగా ఉండండి..!

శనివారం ఉదయం ఎంత హ్యాపీగా కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఈడీ విచారణకు వెళ్లారో.. తిరిగి వచ్చేటప్పుడు అంతకుమించి సంతోషంతో కవిత బయటికొచ్చారు. కవిత వస్తూ.. వస్తూ అభివాదం చేయడంతో ముఖ్య నేతలు, కార్యకర్తలు, అనుచరులు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. కారు దగ్గరికి వచ్చే వరకూ అభివాదం చేస్తూనే వచ్చారు. కారు కదలగానే పిడికిలి బిగించి అంతా ఓకే అన్నట్లుగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ధైర్యం నింపారు. దీంతో అప్పటి వరకూ ఈడీ కార్యాలయం ఎదుట కవిత కోసం వేయి కళ్లతో వేచి చూసిన బీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగి తేలాయి. తమ అభిమాన నాయకురాలు బయటికి రావడంతో ‘జై కవిత.. జై జై బీఆర్ఎస్’ అని నినాదాలు చేస్తూ.. ఈలలు, కేకలతో హోరెత్తించారు. ఆమె కారును అనుసరిస్తూ ఢిల్లీలోని నివాసం వరకూ అభిమానులు వచ్చారు.

Kavitha-Phootsss.jpg

హారతులు పట్టిన ఆడపడుచులు..!

ఢిల్లీలోని కవిత నివాసానికి రాత్రి 7 గంటలకే భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. కవిత కారు ఇంటి ముందు ఆగగానే నినాదాలతో మోతెక్కించారు. అభిమానులకు అభివాదం చేస్తూనే కవిత ఇంట్లోకి వెళ్లారు. ఇక ఇంట్లోకి అడుగుపెట్టగానే బీఆర్ఎస్ ఆడపడుచులు హారతులు పట్టారు. కవిత రాకతో ఆమె నివాసం వద్ద ఒకింత పండుగ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత సోదరుడు కేటీఆర్ (KTR), మంత్రులు హరీష్ రావు (Harish Rao), శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌తో కాసేపు మాట్లాడారు. అనంతరం మంత్రులతో కలిసి హైదరాబాద్‌కు (Hyderabad) కవిత తిరుగుపయనం అయ్యారు.

Kavitha-Photos-1.jpg

ఫొటోలు వైరల్..

ఇవాళ ఉదయం నుంచి కవిత కళ్లు మాత్రమే కనిపిస్తున్న ఫొటోలు (Kavitha Photos).. విచారణ తర్వాత బయటికొచ్చాక అభివాదం చేస్తున్న ఫొటోలు, పిడికిలి బిగించినట్లు కారులో పయనిస్తున్నట్లు ఫొటోలు, హారతి పడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో (Social Media) తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలపై బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఫొటోలు బీఆర్ఎస్ శ్రేణులు ఉదయం నుంచి నెలకొన్న ఆందోళన పోయి కొత్త ఉత్సాహాన్ని నింపాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు మాత్రం యథావిధిగా కామెంట్ల రూపంలో విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. శనివారం ఉదయం నుంచి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ శ్రేణులు ఏ రేంజ్‌లో ఆందోళనలు, నిరసనలు చేపట్టాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

Kavitha-Eyes.jpg

మొత్తానికి చూస్తే.. కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది మొదలుకుని శనివారం రాత్రి వరకూ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొన్న ఆందోళనకు ఈ విచారణతో ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు. ఓ వైపు.. కవితను కచ్చితంగా అరెస్ట్ చేస్తారని ప్రతిపక్షాలు పదే పదే చెబుతుండటం.. ఇటు సీఎం కేసీఆర్ కూడా కవితను అరెస్ట్ చేస్తారని స్వయంగా చెప్పడంతో బీఆర్ఎస్‌లో టెన్షన్ మొదలైంది. అయితే ముందుగా అందరూ జోస్యం చెప్పినట్లు ఏమీ జరగకపోవడంతో అభిమానులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. 16న మరోసారి విచారణ ఉండటంతో కాస్త ఆందోళన అయితే ఉందనే బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ఏం జరుగుతుందో.. వేచి చూడాలి మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Delhi Liquor Scam Case : ఇంకా అయిపోలేదు.. మళ్లీ రావాలంటూ కవితకు ఈడీ నోటీసులు..!


******************************

Delhi Liquor Scam Case : ముగిసిన కవిత ఈడీ విచారణ.. 9 గంటలపాటు ఏమేం ప్రశ్నించారు..!?

******************************

Delhi Liquor Scam Case : హై అలర్ట్.. కవిత ఈడీ ఆఫీసు నుంచి బయటికొచ్చాక ఏం చేయబోతున్నారు..!?

******************************

Delhi Liquor Scam Case : ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణలో అనూహ్య నిర్ణయం తీసుకున్న అధికారులు..


******************************

Delhi Liquor Scam Case : ఎమ్మెల్సీ కవితను విచారిస్తూనే ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఈడీ.. సిబ్బందిని ఇంటికి పంపి...


******************************

Delhi Liquor Case : ఐదు గంటలు పూర్తయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.. ఇంకా ఎంతసేపు ఉంటుందంటే...!

******************************

Updated Date - 2023-03-11T22:13:48+05:30 IST