Share News

Bhuvaneswari : పరామర్శకు వస్తున్నా.. నిజం గెలవాలి!

ABN , First Publish Date - 2023-10-24T10:09:39+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు అరెస్ట్ (Nara Chandrababu Arrest) తర్వాత ఏపీలో పరిస్థితులు ఎలా మారిపోయాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నిత్యం ప్రజల కోసం.. ప్రజా సంక్షేమం గురించే ఆలోచించే విజనరీ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని జీర్ణించుకోలేక వందలాది గుండెలు ఆగిపోయాయి!..

Bhuvaneswari : పరామర్శకు వస్తున్నా.. నిజం గెలవాలి!

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు అరెస్ట్ (Nara Chandrababu Arrest) తర్వాత ఏపీలో పరిస్థితులు ఎలా మారిపోయాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నిత్యం ప్రజల కోసం.. ప్రజా సంక్షేమం గురించే ఆలోచించే విజనరీ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని జీర్ణించుకోలేక వందలాది గుండెలు ఆగిపోయాయి!. దీంతో ఆ కుటుంబాలకు అండగా.. భరోసానిస్తా పరామర్శించడానికి ‘నిజం గెలవాలి’ (Nijam Gelavali) పేరుతో బాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) బస్సుయాత్రకు (Bus Yatra) శ్రీకారం చుట్టారు. చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ యాత్ర ద్వారా బాబు అరెస్ట్ వార్తలతో మనస్తాపం చెంది మరణించిన అభిమానులు, టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. యాత్ర మధ్యలో పలుచోట్ల బహిరంగ సభలు, మీడియా సమావేశాలు, చిట్ చాట్‌లు చేయడానికి టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. అవును.. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు.. న్యాయం కావాలి.. న్యాయం గెలవాలనే విషయాన్ని ఈ యాత్ర ద్వారా భువనేశ్వరి.. జనాల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.


Bhuva-5.jpg

ఇవాళ ఇలా..?

ఇవాళ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారిని భువనేశ్వరి దర్శించుకున్నారు. అనంతరం అక్కడ్నుంచి నేరుగా కుప్పంలోని నారావారి పల్లెకు చేరుకొని.. పెద్దల సమాధులకు నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత నారావారిపల్లెలో గ్రామ దేవతలైన దొడ్డి గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు. రేపటి నుంచి భువనేశ్వరి పరామర్శ మొదలుపెట్టనున్నారు. మొదట.. చంద్రబాబు అరెస్ట్‌తో మనోవేదనతో మృతిచెందిన టీడీపీ కార్యకర్త చిన్నబ్బ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇక్కడ ప్రారంభమైన ఈ యాత్ర నారా రాష్ట్రవ్యాప్తంగా జరగనుంది. మూడు రోజులపాటు తిరుపతి జిల్లాలో ఆమె యాత్ర చేయబోతున్నారు. ఈ యాత్రలో యాత్రలో భాగంగా చంద్రగిరి మండలం, తిరపతితో రెండుచోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.

Babu-And-Bhuvaneswari.jpg

రేపు ఇలా..!

బుధవారం నాడు.. ఐతేపల్లి మండలంలోని ఎస్సీ కాలనీలో పల్లె ప్రజలతో కలిసి భువనేశ్వరి సహపంక్తి భోజనం చేయబోతున్నారు. అనంతరం అగరాల బహిరంగసభలో చంద్రబాబు అక్రమ అరెస్టుపై సుదీర్ఘ ప్రసంగం చేయనున్నారు. అనంతరం అగరాలలో మహిళలతో భువనేశ్వరి సమావేశం కానున్నారు. ఆ తర్వాత గురువారం నాడు భువనేశ్వరి తిరుపతికి రానున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసనలు చేపట్టిన జనసేన-టీడీపీ కార్యకర్తలపై పలుచోట్ల పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వారందరితో భువనేశ్వరి సమావేశమై పరామర్శించి.. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించనున్నారు. ఇక్కడ కూడా బహిరంగ సభను టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. భువనేశ్వరి ప్రసంగించనున్నారు. అనంతరం ఆటో డ్రైవర్లతో ఆమె సమావేశం కానున్నారు. 27న శ్రీకాళహస్తిలో మహిళలతో భువనేశ్వరి సమావేశం కాబోతున్నారు.

Bhuvaneswari-1.jpg

ఇదే సెంటిమెంట్‌..

నారా చంద్రబాబు ఏ కార్యక్రమమైనా చేపట్టిన కుప్పం నుంచి ప్రారంభిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. బాబుకు ఇదొక సెంటిమెంట్. దీన్నే టీడీపీ యువనేత నారా లోకేష్ ఫాలో అయ్యారు.. యువగళం పాదయాత్రను ఇక్కడ్నుంచే ఆరంభించారు. ఇప్పుడు నారా భువనేశ్వరి కూడా కుప్పం నుంచే ‘నిజం గెలవాలి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే.. బస్సు యాత్రకు ఇంతవరకూ తమను అనుమతి కోరలేదని.. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా ముఖంగా చెప్పారు. అనుమతి కోరితే పోలీసుల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందనేది ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు పర్యటన, లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన వైసీపీ కార్యకర్తలు, పోలీసులు.. భువనేశ్వరికి యాత్రకు ఏ మాత్రం సహకిరస్తారో చూడాలి మరి.

Bhuvaneswari.jpg

Nijam-Gelavali.jpg


ఇవి కూడా చదవండి


Birth Day : ప్రభాస్‌పై వైసీపీ ఎమ్మెల్యే పొగడ్తల వర్షం.. సడన్‌గా ఎందుకిలా..?


TS Assembly Polls : ఎన్నికల వేళ.. బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ.. ఒకేసారి ఐదుగురు రాజీనామా!


Updated Date - 2023-10-24T13:21:55+05:30 IST