Share News

Birth Day : ప్రభాస్‌పై వైసీపీ ఎమ్మెల్యే పొగడ్తల వర్షం.. సడన్‌గా ఎందుకిలా..?

ABN , First Publish Date - 2023-10-23T18:03:47+05:30 IST

పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌ 44వ పుట్టిన రోజు నేడు (అక్టోబర్‌ 23). ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా డార్లింగ్‌కు బర్త్‌ డే విషెస్‌ చెబుతున్నారు. ఇక అభిమానులంతా తమ హీరో బర్త్‌ డేను కేక్ కట్ చేసి..

Birth Day : ప్రభాస్‌పై వైసీపీ ఎమ్మెల్యే పొగడ్తల వర్షం.. సడన్‌గా ఎందుకిలా..?

పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌ 44వ పుట్టిన రోజు నేడు (అక్టోబర్‌ 23). ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా డార్లింగ్‌కు బర్త్‌ డే విషెస్‌ చెబుతున్నారు. ఇక అభిమానులంతా తమ హీరో బర్త్‌ డేను కేక్ కట్ చేసి.. భారీగా కటౌట్లు కట్టి ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలు, ఇండియాలోనే కాదు.. పలు దేశాల్లో ఉన్న అభిమానులు కూడా వేడుకలు జరుపుకుంటున్నారు. మరీ ముఖ్యంగా బాహుబలి, సాహో సినిమాలతో జపాన్‌లో ప్రభాస్‌కు భారీ ఫాలోయింగ్ వచ్చింది. మరోవైపు.. సినీ, రాజకీయ నేతలు సైతం సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాంకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా.. ప్రభాస్ పుట్టిన రోజు వేడుకల్లో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డార్లింగ్‌ను మునుపెన్నడూ లేని విధంగా పొగడ్తలతో ముంచెత్తారు.


Grandhi-Srinivas.jpg

బాబోయ్.. అస్సలు తగ్గట్లేదుగా!

యంగ్ రెబల్ స్టార్, బాహుబలి ప్రభాస్ జన్మదిన వేడుకలు ప్రతి ఏడాదీ భీమవరం పట్టణంలో లక్షలాది అభిమానులు ఘనంగా చేస్తూ.. సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం చాలా ఆనందంగా ఉంది.. అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో ఉన్న హీరోలు మేమే దైవాంశ సంబూదులు లాగా ఊహల్లో తేలుతూ ఫీలయ్యేవారు. పౌరాణిక పాత్రల్లో నటించినంత మాత్రాన అలా ఫీలవ్వడం వారికే చెల్లుతుంది. అప్పట్లో వారంతా అభిమానులు, ప్రజలకు దూరంగా ఉంటూ వస్తుండేవారు. ప్రభాస్ లేకుంటే బహుబలి సినిమా అనేది ఉండేది కాదేమో. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ దేశాల్లో అభిమానులు ఉన్నారు. ఎంత ఎదిగినా.. ఎంత పాన్ ఇండియా స్టార్ అయినా ఆయన ఒదిగి ఉండే వ్యక్తిత్వం ప్రభాస్‌ది. ఆఖరికి నేను కూడా ఆయన అభిమానిగా మారిపోయానంటే అర్థం చేస్కోండి. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని పెద్ద, చిన్న హీరోలు ముందుకెళ్తున్నారు. ఈ పరిస్థితిని తీసుకొచ్చింది ప్రభాసే. పాత తరం హీరోలకు ప్రభాస్‌కు వ్యత్యాసం చూపిస్తూ అందర్నీ కలుపుకొని వెళ్తున్నారు. పెద నాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు.. తండ్రి సూర్య నారాయణ రాజుల ద్వారానే ప్రభాస్‌కు మంచి అలవాట్లు వచ్చాయి. వాళ్లు అజాత శత్రువులు. మొగల్తూరు మహారాజులు అయినా ఎప్పుడూ ప్రజలు, సేవా కార్యక్రమాల్లోనే ఉండేవారు. ప్రభాస్ హీరో అయ్యాకే ఇప్పుడున్న కుర్ర హీరోలంతా కలిసి కట్టుగా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించడం తెలుగువారిగా మనకు గర్వకారణం అని గ్రంధి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. హీరోల అభిమానులంతా గొడవలు లేకుండా కలిసికట్టుగా ఉండాలని కూడా ఎమ్మెల్యే సలహాలిచ్చారు.

Prabhas-Grandhi.jpg

ఎందుకీ ప్రేమ, పొగడ్తలు..!

ఎమ్మెల్యే కామెంట్స్ విన్న ప్రభాస్ వీరాభిమానులు, సినీ ప్రియులు, నియోజకవర్గ ప్రజలు ఆశ్చర్యపోయారట. ఎప్పుడూ లేని ఈ ప్రేమ సడన్‌గా ఎందుకు పుట్టుకొచ్చిందబ్బా..? అంటూ నియోజకవర్గ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారట. మరోవైపు.. ఈ వ్యాఖ్యలు క్షత్రియ వర్గంలో చర్చకు దారితీశాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్‌ను బుట్టలో వేసుకోవడానికే ఇలా చేస్తున్నారంటూ కామెంట్స్ కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ప్రభాస్ ఫ్యాన్స్ సపోర్టుతోనే గెలిచారు.. ఈసారి కష్టమేలే అన్నట్లుగా కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్న పరిస్థితి.

Prabhas-Fans.jpg

Updated Date - 2023-10-23T18:08:07+05:30 IST