Jr Ntr : ‘కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్’ అంటూ భారీగా ఫ్లెక్సీలు.. అసలు విషయం తెలిస్తే..?

ABN , First Publish Date - 2023-07-18T12:34:34+05:30 IST

అవును.. కాబోయే సీఎం టాలీవుడ్ నటుడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి.! ఈ మధ్య టీడీపీ బహిరంగ సభల్లో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర పాదయాత్రలో ఇలా ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనిస్తున్నాయి. ఇక నినాదాలు అంటారా కొదువేలేదు...

Jr Ntr : ‘కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్’ అంటూ భారీగా ఫ్లెక్సీలు.. అసలు విషయం తెలిస్తే..?

అవును.. కాబోయే సీఎం టాలీవుడ్ నటుడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి.! ఈ మధ్య టీడీపీ బహిరంగ సభల్లో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర పాదయాత్రలో ఇలా ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనిస్తున్నాయి. ఇక నినాదాలు అంటారా కొదువేలేదు. ఇవన్నీ నిజమైన ఎన్టీఆర్ అభిమానులే చేస్తున్నారా..? లేకుంటే అభిమానుల ముసుగులో మరెవరైనా ఇలా చేసి రెచ్చగొడుతున్నారా..? అనేది తెలియరాలేదు కానీ.. తాజాగా ఒంగోలు జిల్లాలో ఎన్టీఆర్ పేరిట వెలిసిన ఫ్లెక్సీలతో అసలు విషయం బయటికి వచ్చింది. ఎవరి పని ఇది..? దీని వెనుక ఎవరున్నారు..? అనే విషయాలను లోతుగా ఆరాతీయగా ఈ వ్యవహారం వెనుక పెద్ద కథే నడుస్తోందని తేలింది..


Lokesh-Padayatra.jpg

ఇదీ అసలు కథ..

ఎక్కడ చూసినా ఎన్టీఆర్ బ్యానర్లు.. ఏ సభలో చూసినా ‘జై ఎన్టీఆర్’ అంటూ నినాదాలు ఇవీ గత కొన్నిరోజులుగా టీడీపీ సభల్లో జరుగుతున్న పరిణామాలు. సీన్ కట్ చేస్తే.. ఉమ్మడం ప్రకాశం జిల్లాలోకి నారా లోకేష్ పాదయాత్ర త్వరలో ప్రారంభం కానుంది. అయితే.. ఓ వైపు లోకేష్‌కు ఘన స్వాగతం పలుకుతూ పార్టీ శ్రేణులు, అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. ఇందుకు విరుద్ధంగా జూనియర్ ఎన్టీఆర్ పేరుతో బ్యానర్లు కట్టి అత్యాత్సాహం ప్రదర్శించారు. ‘కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్.. అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే’ అని ఒంగోలులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలను తెలుగు తమ్ముళ్లు ఆరా తీయగా మాకెలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇదెవరిపని అని లోతుగా ఆరా తీయగా.. ఇదంతా జిల్లాలో వైసీపీ నాయకులు చేస్తున్న చీప్ పాలిటిక్స్ అని తేలిపోయింది. ఎన్టీఆర్ అభిమానుల పేరుతో జిల్లాలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది వైసీపీ నాయకులేనని తేలిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచట్లేదట. ఒంగోలుతో పాటు కనిగిరిలో కూడా ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు జూనియర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తేల్చారు. అర్థరాత్రి ముసుగులు ధరించి కొందరు వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ అభిమానులు తేల్చారు. అయితే.. ఈ ఫ్లెక్సీల వెనుక ఒంగోలు-01వ డివిజన్ వైసీపీ అధ్యక్షుడు సాంబశివరావు ఉన్నట్లు టీడీపీ నాయకులు గుర్తించారు. ఇదిలావుంటే.. ఫ్లెక్సీల కోసం ఫ్రేమ్‌లు ఒకటవ వార్డు వలంటీర్ ఆఫ్రీద్ సప్లై చేసినట్లు ఎన్టీఆర్ వీరాభిమానులు తేల్చారు. వెంటనే ఎక్కడికక్కడ ఆ ఫ్లెక్సీలను టీడీపీ నేతలు తొలగించేశారు. ఇదంతా ఐ-ప్యాక్‌ సూచనల మేరకే జరుగుతోందనే చర్చ కూడా స్థానికంగా పెద్ద ఎత్తున జరుగుతోంది. వైసీపీ నాయకుల తీరుపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జూనియర్ వీరాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ ఫ్లెక్సీల వ్యవహారంపై టీడీపీ నాయకులు ఎలా ముందుకెళ్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

WhatsApp Image 2023-07-18 at 12.09.10 PM.jpeg

ఎందుకింత చీప్ పాలిట్రిక్స్..!

నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రకు ఎలాంటి ఆదరణ వస్తోందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇదంతా చూసిన వైసీపీ నాయకులు ఓర్చుకోలేక.. ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. వాస్తవానికి.. నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీలో కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. నిద్ర లేచింది మొదలుకుని రోజూ ఏదో ఒక పంచాయితీ బయటికొస్తూనే ఉంది. పైగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం వైఎస్ జగన్ రెడ్డితో పాటు పార్టీకి ఊహించని రీతిలో గ్రాఫ్ పడిపోవడం, టీడీపీకి భారీగా గ్రాఫ్ పెరగడంతో ఇలా టీడీపీ ఏ కార్యక్రమాలు చేపట్టినా.. లోకేష్ పాదయాత్రలో ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పైత్యం ప్రదర్శిస్తున్నారని టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎందుకింత చీప్ పాలిటిక్స్ అని వైసీపీలోనే కొందరు ఆయా నేతలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారట. మొత్తానికి చూస్తే.. ఫ్లెక్సీల వెనుక ఎవరున్నారనే విషయం అయితే బయటికొచ్చింది.. ఇప్పుడు ఈ బండారం ఆధారాలతో సహా బయటపడంతో వైసీపీ అధిష్టానం, జిల్లా నాయకులు ఎలా రియాక్ట్ అవుతారు..? టీడీపీ నేతలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు..? అనేది తెలియాల్సి ఉంది.

WhatsApp Image 2023-07-18 at 12.10.35 PM.jpeg


ఇవి కూడా చదవండి


Janasena : ఢిల్లీ వేదికగా కీలక ప్రకటన చేయనున్న పవన్.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి..!


TS Power Politics : రాహుల్‌తో పోలికేంటి కేటీఆర్.. మంత్రికి తెలిసిందల్లా ఒక్కటే.. దిమ్మదిరిగే కౌంటరిచ్చిన రేవంత్ రెడ్డి!


BRS Vs Revanth : కేటీఆర్.. ఎక్కడికి రమ్మంటావో చెప్పు.. ‘పవర్‌’పై తేల్చుకుందాం.. రేవంత్ రెడ్డి సవాల్


Chikoti Praveen : మరో వివాదంలో చికోటి ప్రవీణ్.. ఈసారి గట్టిగానే..?



Updated Date - 2023-07-18T12:40:10+05:30 IST