TS Power Politics : రాహుల్‌తో పోలికేంటి కేటీఆర్.. మంత్రికి తెలిసిందల్లా ఒక్కటే.. దిమ్మదిరిగే కౌంటరిచ్చిన రేవంత్ రెడ్డి!

ABN , First Publish Date - 2023-07-17T19:26:50+05:30 IST

తెలంగాణలో ‘పవర్’ పాలిటిక్స్ (TS Power Politics) నడుస్తోంది. 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని బీఆర్ఎస్ (BRS) .. అస్సలు ఇవ్వట్లేదని కాంగ్రెస్ (Congress) ఆధారాలతో సహా నిరూపించింది. అయినప్పటికీ బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య పవర్ వార్‌కు (Power War) ఫుల్‌స్టాప్ పడలేదు..

TS Power Politics : రాహుల్‌తో పోలికేంటి కేటీఆర్.. మంత్రికి తెలిసిందల్లా ఒక్కటే.. దిమ్మదిరిగే కౌంటరిచ్చిన రేవంత్ రెడ్డి!

తెలంగాణలో ‘పవర్’ పాలిటిక్స్ (TS Power Politics) నడుస్తోంది. 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని బీఆర్ఎస్ (BRS) .. అస్సలు ఇవ్వట్లేదని కాంగ్రెస్ (Congress) ఆధారాలతో సహా నిరూపించింది. అయినప్పటికీ బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య పవర్ వార్‌కు (Power War) ఫుల్‌స్టాప్ పడలేదు. 24 గంటల కరెంట్ ఇస్తున్న మాట నిజమేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ (Minister KTR).. మీడియా ముందుకొచ్చి చెప్పారు. అయితే గ్రౌండ్ లెవల్‌లో నిజమేంటో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సబ్‌స్టేషన్ దగ్గరికెళ్లి ఆధారాలతో సహా తేల్చేశారు. ఇంత జరిగినప్పటికీ బీఆర్ఎస్ మాత్రం రచ్చ రచ్చ చేస్తూనే ఉంది. కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి మాట్లాడిన ప్రతి మాటకీ గాంధీ భవన్ వేదికగా రేవంత్ కౌంటర్లిచ్చేశారు.


Revanth-Reddy.jpg

రేవంత్ కౌంటర్లు ఇవీ..

కేటీఆర్.. రాహుల్ గాంధీకి క్లబ్బు, పబ్బు తప్ప వ్యవసాయం తెలియదంటావా?. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ (Sonia Gandhi) వారసుడిపై అంత మాట అంటావా?. పగలు, రాత్రికి తేడా తెలియని నువ్వు రాహుల్‌ను విమర్శిస్తావా..?. అసలు కేటీఆర్‌కు వ్యవసాయం అంటే ఏంటో తెలుసా?. దుడ్లు, బుడ్లు, బెడ్లు తప్ప కేటీఆర్‌కు వ్యవసాయం తెలియదు. కేటీఆర్‌కి సాలు కొట్టుడు తెలుసా? సీసా కొట్టుడు అంటే తెలుసు. గో ధూలి వేళ అంటే ఏంటో చెప్పురా బై. లైన్ గుంజుడు అంటే కేటీఆర్‌కు తెలుసు. మూడు లైన్లు గుంజుడు కేటీఆర్‌కు తెలుసు. అమెరికాలో బాత్ రూమ్‌లు కడిగి మంత్రి అయినందుకు కేటీఆర్ అందరికీ ఆదర్శమే. బంగారు స్పూన్‌లో తినగలిగే అవకాశం ఉన్నవారు రాహుల్. ప్రపంచంలో ఏది కావాలని చిటికేసినా రాహుల్ ముందు ఉంటుంది. అలాంటి రాహుల్ ప్రజల కోసం రోడ్లపైకి వచ్చారు. రాహుల్ గాంధీలాగా నడవగలవా?. ఒక ముగ్గు పోస్తే అటు ఇటు సోలకుండా పది అడుగులు కేసీఆర్ వేయగలరా?అని కేటీఆర్‌పై రేవంత్ ప్రశ్నల వర్షం కురిపించారు.

rahul.jpg

అడ్డుకోండి.. కట్టేయండి..!

రైతులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాను. రాహుల్‌పై కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా కేటీఆర్‌ను ఎక్కడికక్కడ అడ్డుకోండి. విద్యుత్ లడాయి నాకు.. కేటీఆర్‌కే. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ .. ఆయనకి నాలెడ్జ్ నిల్లు. మళ్లీ చెబుతున్నా.. కేటీఆర్‌ని ఎక్కడ దొరికితే అక్కడ అడ్డుకోండి. కేటీఆర్ చెంపలు వాయించండి. 24 గంటల విద్యుత్ ఇచ్చే వరకు రైతు వేదికలకు తాళం పెట్టి నిరసన తెలపండి. రుణమాఫీ, పోడు భూముల పట్టాలు24 గంటల కరెంటు ఇచ్చే వరకు బీఆరెస్ ఎమ్మెల్యేలను చెట్లకు కట్టేసి నిలదీయండి. పుట్టలో ఉన్న పాములు బయటకి వచ్చాయి.. వాళ్ళ పని పట్టాల్సిందే. ఎమ్మెల్యేలను చెట్లకు కట్టేసి లాగుల్లో తోండలు వేయండి. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలుచేసేదాకా ఎమ్మెల్యేలను వదలకండి. అవగాహన లేకే కేటీఆర్ నాపై పనికిమాలిన విమర్శలు చేస్తున్నారు. చేసిన దోపీడీని కప్పిపుచుకునేందుకే నాపై కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బీజేపీ, బీఆరెస్ చీకటి మిత్రులు. వారిద్దరిది ఫెవికాల్ బంధం అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

revanth-reddy.jpg

టికెట్లు ఇవ్వండి..!

కాంగ్రెస్ పార్టీది జలయజ్ఞం.. బీఆర్ఎస్‌ది ధనయజ్ఞం. కేసీఆర్ నాయకత్వంపై హరీష్‌కు విశ్వాసం ఉంటే.. కేసీఆర్ గజ్వేల్‌లోనే పోటీ చేయాలి.. సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వాలి. కేసీఆర్ పాలనకు ఇదే రెఫరెండం. మూడోసారి అధికారంలోకి వస్తామన్న కేసీఆర్‌కు గజ్వేల్‌లో పోటీ చేయడానికి భయం ఎందుకు?. సిట్టింగులకు సీట్లు ఇవ్వడానికి ఎందుకు జంకుతున్నారు?. ఈ రెఫరెండంకి రెడీనా అని హరీష్ రావుకు సవాలు విసురుతున్నాను. కేసీఆర్‌వి పొంగనాల పోషిగాడి వేషాలు. 24 గంటలు త్రీ ఫేజ్ ఇవ్వడం లేదని సీఎండీనే ఒప్పుకున్నారు. వ్యవసాయానికి అవసరమైనంత మాత్రమే ఇస్తున్నామన్నారు. నేను అమెరికాలో, హైదరాబాద్‌లో ప్రశ్నించింది ఇదే. 24 గంటల కరెంటు ఇవ్వకుండా ప్రతీ ఏటా 16వేల కోట్లు కొనుగోలు ఖర్చు చూపిస్తున్నారు. ఉచిత విద్యుత్‌ను కేసీఆర్ అవినీతికి వాడుకుంటున్నారని నేను చెప్పాను. దీనిపై కేటీఆర్ కల్లు తాగిన కోతిలా గెంతులు వేస్తుండు. రైతు వేదికల్లో చర్చ పెట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేటీఆర్ ఏ రైతు వేదికకు వస్తాడో చెబితే నేను అక్కడికి వస్తాఅని కేసీఆర్, కేటీఆర్, హరీష్‌కు రేవంత్ సవాల్ విసిరారు.

ktr saba thirumalagiri (30) copy.JPG

ఏదో ఒకటి ఫిక్సవ్వండి!

కాంగ్రెస్ అధికారంలో ఉందని నేను పార్టీలోకి రాలేదు. కాంగ్రెస్‌లో అధికారం చెలాయించడం లేదు. క్రమశిక్షణతో పనిచేస్తున్న కాబట్టి కాంగ్రెస్ అధిష్ఠానం నన్ను అధ్యక్షుడిని చేసింది. చేసిన దోపిడీ కప్పిపుచ్చుకోవడానికి నాపై బీఆర్ఎస్ నేతలు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ సిద్దాంతం నమ్మి పార్టీ సభ్యత్వం తీసుకున్నాను. లఫుట్ గాళ్ళకి సారీ చెప్పాల్సిన పని నాకేంటి?. ఒకసారి చంద్రబాబు శిష్యుడు అంటారు.. ఒకసారి ఆర్ఎస్ఎస్ కార్యకర్త అంటారు. ముందు ఏదో ఒకదానికి ఫిక్స్ అవ్వండి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ కౌంటర్లు, సవాళ్లపై బీఆర్ఎస్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.


ఇవి కూడా చదవండి


BRS Vs Revanth : కేటీఆర్.. ఎక్కడికి రమ్మంటావో చెప్పు.. ‘పవర్‌’పై తేల్చుకుందాం.. రేవంత్ రెడ్డి సవాల్


Chikoti Praveen : మరో వివాదంలో చికోటి ప్రవీణ్.. ఈసారి గట్టిగానే..?


Updated Date - 2023-07-17T19:40:54+05:30 IST