Share News

Vijayashanti : రాములమ్మకు రేవంత్ రెడ్డి బంపరాఫర్.. రేపోమాపో కండువా కప్పుకోవడమే ఆలస్యమట!!

ABN , First Publish Date - 2023-11-04T13:36:24+05:30 IST

ఫైర్ బ్రాండ్, బీజేపీ మహిళా నేత విజయశాంతి (Vijayashanti) అలియాస్ రాములమ్మ (Ramulamma) డైలమాలో ఉన్నారా..? కమలం పార్టీలో (BJP) కొనసాగాలా లేకుంటే కండువా మార్చేయాలా..? అనేదానిపై ఆలోచనలో పడ్డారా..? ఎన్నికల ముందు కీలక నిర్ణయమే రాములమ్మ తీసుకోబోతున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా ఇదే నిజమనిపిస్తోంది...

Vijayashanti : రాములమ్మకు రేవంత్ రెడ్డి బంపరాఫర్.. రేపోమాపో కండువా కప్పుకోవడమే ఆలస్యమట!!

ఫైర్ బ్రాండ్, బీజేపీ మహిళా నేత విజయశాంతి (Vijayashanti) అలియాస్ రాములమ్మ (Ramulamma) డైలమాలో ఉన్నారా..? కమలం పార్టీలో (BJP) కొనసాగాలా లేకుంటే కండువా మార్చేయాలా..? అనేదానిపై ఆలోచనలో పడ్డారా..? ఎన్నికల ముందు కీలక నిర్ణయమే రాములమ్మ తీసుకోబోతున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా ఇదే నిజమనిపిస్తోంది. ఎందుకంటే.. గత కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. బీజేపీ తీరుతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అందుకే పార్టీతో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో కాషాయం కండువా తీసేస్తారని గట్టిగానే టాక్ నడుస్తోంది. పక్కాగా పార్టీ మారుతారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఖండించిన దాఖలాల్లేవ్. కనీసం సోషల్ మీడియా (Social Media) వేదికగా కూడా రియాక్ట్ కాలేదు. పైగా.. బీజేపీని తిట్టినట్లే, వ్యతిరేకించినట్లే పరోక్షంగా ట్వీట్లు చేస్తుండటం ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది.


Vijayasanti.jpg

అసలేం జరుగుతోంది..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి (TS BJP) వరుసగా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. అభ్యర్థులను ఇంతవరకూ పూర్తిగా ప్రకటించకపోవడం, కనీసం మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయకపోవడం.. మరోవైపు.. పార్టీలో ఉన్న ముఖ్య, సీనియర్ నేతలు కూడా పోటీ నుంచి తప్పుకోవడంతో.. పార్టీ శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. దీనికి తోడు ఒక్కొక్కరుగా సీనియర్లు, ముఖ్య నేతలంతా పార్టీకి దూరం అవుతుండటంతో బీజేపీలో అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి. అదేదో.. ‘ ఇక్కడ హ్యాండ్ ఇవ్వబడును’ అని ‘కమలవనం’లో బోర్డు పెట్టుకున్నట్లుగా ఒకరి తర్వాత ఒకరు బీజేపీకి రాజీనామా (Resignation) చేసేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy), వివేక్ వెంకటస్వామి (Vivek VenkataSwamy) .. అంతకుముందు పలువురు ముఖ్య నేతలు కాషాయ పార్టీకి టాటా చెప్పేశారు. వారంతా కాంగ్రెస్ గూటికి చేరిపోయారు కూడా. ఇప్పుడు ఇదే బాటలో మరో ఇద్దరు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. అందులో ఒకరు విజయశాంతి.. మరొకరు బిగ్ షాట్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Visweswar Reddy). దీంతో నెక్స్ట్ ఎవరు..? ఎవరెప్పుడు పార్టీకి గుడ్ బై చెబుతారో ఏమోనని రాష్ట్ర నాయకత్వం సైతం ఆందోళనలో ఉన్న పరిస్థితట.

Vijayasanti-1.jpg

రాములమ్మ రూటెటు..!

ఎన్నికల ముందు రాజకీయ భవిష్యత్తుపై రాములమ్మ కీలక నిర్ణయమే తీసుకోనుందని తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం.. కేసీఆర్‌ (CM KCR) నుంచి తెలంగాణను కాపాడుకునేందుకు కొందరు కాంగ్రెస్‌లో చేరాలని కోరుతున్నారని.. మరికొందరు బీజేపీలోనే ఉండమంటున్నారని ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే ఇద్దరి అభిప్రాయం తెలంగాణ మేలు కోసమేనని.. సినిమాల్లో లాగా రాజకీయాల్లో డబుల్ యాక్షన్ కుదరదని ట్వీట్ చేశారు. దీంతో అసలు ఆమె ఏం చెప్పదలుచుకుంటున్నారనే విషయం ఎవరికీ అర్థం కాలేదు. ఈ పరిస్థితుల్లో బీజేపీలో ఉంటారా.. కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా..? అనేది ప్రశ్నార్థకంగానే మారింది. పైగా ఇప్పటి వరకూ మూడు జాబితాలను బీజేపీ రిలీజ్ చేసినప్పటికీ ఇందులో రాములమ్మ (Ramulakka) పేరు లేదు. రాములమ్మ కచ్చితంగా కండువా మార్చేస్తారనే హైకమాండ్ అభ్యర్థిగా ప్రకటించలేదనే టాక్ కూడా ఉంది. వాస్తవానికి బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించిన నాటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు పార్టీ కార్యక్రమాల్లో విజయశాంతి పాల్గొన్న దాఖలాల్లేవ్. పైగా ఢిల్లీ నుంచి పెద్దలు మోదీ (PM Modi), అమిత్ షా (Amit Shah) .. కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటించినప్పటికీ ఎక్కడా రాములమ్మ కనిపించలేదు. దీంతో రాష్ట్ర నాయకత్వం.. ఎప్పటికైనా విజయశాంతి పార్టీ మారిపోతారని అప్పుడే డిసైడ్ అయ్యిందట. అందుకే.. రాములక్కను కమలం పార్టీ.. బీజేపీని.. రాములమ్మ పట్టించుకోవట్లేదట.

Vijayasanti-Congress.jpg

బంపరాఫర్..!

మొత్తానికి చూస్తే.. రాములమ్మ మనసులో ఏదో ఉందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. విజయశాంతి అసంతృప్తిగా ఉండటం, కమలం పార్టీ పట్టించుకోని పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి.. అది కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి పిలుపు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. పార్టీలో తగిన ప్రాధాన్యంతోపాటు.. ప‌ద‌వి కూడా ఇస్తామ‌ని హైకమాండ్ హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మెద‌క్ పార్లమెంట్ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు మాటిచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ హామీతో రాములమ్మ కమలం పార్టీకి రాజీనామా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. ఒకట్రెండు రోజుల్లో రాజీనామా చేసి.. సోమవారం, లేదా మంగళవారం నాడు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలియవచ్చింది. ఇదే జరిగితే.. కష్టకాలంలో కాషాయ పార్టీకి పెద్ద ప్రభావమే పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఫైనల్‌గా ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.


ఇవి కూడా చదవండి


TS Polls : ప్చ్.. తెలంగాణ బీజేపీలో అనిశ్చితి.. మేనిఫెస్టో రాసేదెవరు..!?


TS Elections : బీజేపీకి బిగ్ షాక్.. కేటీఆర్ ఆహ్వానంతో బీఆర్ఎస్‌లోకి సీనియర్ నేత..!


CBN : ఏఐజీ ఆస్పత్రిలో చేరిన చంద్రబాబు.. ఎన్నిరోజులు ఉంటారంటే..?


Big Breaking : చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సీఐడీ.. ముగ్గురు కీలకనేతలపై కూడా..!!


TS Assembly Polls : ఊహించని ఝలక్.. బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్న బిగ్ షాట్!!


Updated Date - 2023-11-04T13:41:07+05:30 IST