Share News

CBN : ఏఐజీ ఆస్పత్రిలో చేరిన చంద్రబాబు.. ఎన్నిరోజులు ఉంటారంటే..?

ABN , First Publish Date - 2023-11-02T18:27:44+05:30 IST

టీడీపీ అధినేత నారా చంద్రబాబు హైదరాబాద్‌లోని ప్రముఖ ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. గురువారం ఉదయం పలు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. రిపోర్టులను నిశితంగా పరిశీలించిన

 CBN : ఏఐజీ ఆస్పత్రిలో చేరిన చంద్రబాబు.. ఎన్నిరోజులు ఉంటారంటే..?

టీడీపీ అధినేత నారా చంద్రబాబు హైదరాబాద్‌లోని ప్రముఖ ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. గురువారం ఉదయం బాబుకు పలు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. రిపోర్టులను నిశితంగా పరిశీలించిన అనంతరం వైద్యుల సూచన మేరకు సాయంత్రం ఆయన ఆస్పత్రిలో చేరారు. ఇవాళ రాత్రికి కూడా ఆస్పత్రిలోనే బాబు ఉంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయన వెంట కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు టీడీపీ కీలక నేతలు కూడా ఉన్నారని సమాచారం. మరోవైపు చంద్రబాబు త్వరగా అనారోగ్య సమస్యల నుంచి కోలుకోవాలని టీడీపీ కార్యకర్తలు పూజలు చేస్తున్నారు.


CBN-Hosptial.jpg

ఎప్పుడు తేలింది..!!

ఇదిలా ఉంటే.. స్కిల్ అక్రమ కేసులో అరెస్టయిన బాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. ముఖ్యంగా.. డీహైడ్రేషన్, చర్మ సంబంధిత వ్యాధులు, బరువు తగ్గినట్లు రోజువారి హెల్త్ బులెటిన్లతో స్పష్టమైంది. పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆస్పత్రికి వెళ్లడం తప్పనిసరి కావడంతో హైకోర్టును ఆశ్రయించి.. మధ్యంతర బెయిల్‌పైన చంద్రబాబు బయటికొచ్చి ఆస్పత్రికి వెళ్లారు. బాబు అనారోగ్య సమస్యలపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. చంద్రబాబు అనారోగ్యంపై వైసీపీ పైత్యం ప్రదర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. ఒకానొక సందర్భంలో చంద్రబాబుకు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయని కూడా వైసీపీ విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

Babu-Health-O.jpg

ఎల్వీ ప్రసాద్‌కు ఎప్పుడు..?

కాగా.. శుక్రవారం మధ్యాహ్నం లేదా శనివారం ఉదయం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి చంద్రబాబు వెళ్తారని తెలియవచ్చింది. బాబుకు కంటి సమస్య ఉందని ప్రభుత్వ వైద్యులు సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఆయన కుడి కంటికి క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్స చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి కంటి డాక్టర్ నిర్ధారించారు. దీంతోపాటు రిపోర్టు ఇవ్వగా.. బాబు కుడి కంటిలో ఇమ్మెచ్యూర్‌ క్యాటరాక్ట్‌ ఉందని, దానికి శస్త్రచికిత్స చేయాలని సూచించారు. మరోవైపు.. చంద్రబాబుకు దృష్టి సమస్యను సరిదిద్దేందుకు కుడి కంటికి క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్స చేయాలని హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి డాక్టర్లు కూడా ఇటీవల నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్టులోనూ ఇదే విషయాన్ని వైద్యులు స్పష్టం చేశారు. 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు మంగళవారం నాడు రిలీజ్ అయ్యారు.

Updated Date - 2023-11-02T18:29:57+05:30 IST