YSRCP Meeting : వైఎస్ జగన్ మీటింగ్‌కు డుమ్మా కొట్టడం వెనుక కారణాలేంటో చెప్పిన వల్లభనేని వంశీ.. ఇంతకీ ఆ పరీక్ష కథేంటో..?

ABN , First Publish Date - 2023-04-04T17:21:16+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) క్యాంప్ ఆఫీసులో సోమవారం నాడు నిర్వహించిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ (Gadapa Gadapa Ku Mana Prabutvam) కార్యక్రమానికి..

YSRCP Meeting : వైఎస్ జగన్ మీటింగ్‌కు డుమ్మా కొట్టడం వెనుక కారణాలేంటో చెప్పిన వల్లభనేని వంశీ.. ఇంతకీ ఆ పరీక్ష కథేంటో..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) క్యాంప్ ఆఫీసులో సోమవారం నాడు నిర్వహించిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ (Gadapa Gadapa Ku Mana Prabutvam) కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలంతా కచ్చితంగా రావాల్సిందే అని జగన్ ఆదేశించినప్పటికీ చాలా మంది హాజరుకాలేదు. ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేకపోయారో ప్రకటన లేదా మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చుకున్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్‌కు నమ్మినబంటుగా, అత్యంత ఆప్తులుగా ఉన్న ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy), కొడాలి నాని (Kodali Nani) , వల్లభనేని వంశీ (MLA Vallabhaneni Vamsi) కూడా రాకపోవడంతో వీళ్లు వైసీపీకి (YSR Congress) గుడ్ బై చెప్పి.. గోడ దూకడానికి సిద్ధమైపోయారని ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఎమ్మెల్యే ఆర్కే ఇవాళ ఉదయం స్పందించి ఫుల్ క్లారిటీ ఇచ్చుకోగా.. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాను ఎందుకు జగన్ మీటింగ్‌కు రాలేకపోయాననే విషయంపై వివరణ ఇచ్చుకున్నారు.

కారణమిదే..!

మంగళవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన వంశీ.. తనపై వస్తున్న రూమర్స్‌ను కొట్టిపారేశారు. నేను, కొడాలి నాని పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. అదేమీ లేదు.. నేను ఇండియన్ స్కూల్‌ ఆఫ్ బిజినెస్‌లో కోర్సు చేస్తున్నాను. అది ఫైనల్ స్టేజ్‌కు వచ్చింది.. పరీక్షలు జరుగుతున్నాయి. ఒక వారం, పది రోజుల్లో కోర్సు పూర్తవుతుంది. అంతే తప్పితే ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవు. నేను పార్టీ మారుతున్నట్లు కొందరు అనవసర ప్రచారాలు చేస్తున్నారు. కేడర్‌లో అయోమయం సృష్టించేందుకే ఇలా చేస్తున్నారు. అవన్నీ మెరుపు కలల మాత్రమే. అటువంటి పరిస్థితులేమీ లేవు.. ఉండబోవు. ఏదో జరిగిపోతోందని కొందరు గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. వారం, పది రోజులు తర్వాత నేను పూర్తిగా జనాలకు అందుబాటులో ఉంటానుఅని వల్లభనేని వంశీ క్లారిటీ ఇచ్చుకున్నారు.

Vamsi-and-Kodali-Nani.jpg

ఆర్థిక అంశాలే..!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ 4 సీట్లు గెలవడం, ముందస్తు ఎన్నికలంటూ ప్రచారంపై కూడా వంశీ స్పందించారు. ఎన్నికలు పరోక్ష, ప్రత్యక్ష ఎన్నికలు ఉంటాయి. పరోక్ష ఎన్నికల్లో ఎప్పుడు వైసీపీ పోటీ పడలేదు. అందుకే టీడీపీకి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీట్లు వచ్చాయి. స్థానిక సంస్ధల కోటాలో జరిగిన ఎన్నికల్లో 19 ఓట్లు ఉన్నాయి. అయినా టీడీపీ అభ్యర్థి గెలిచారంటే దానికి ఆర్థిక అంశాలే కారణం. ఆ ప్రలోభాల్లో తెలంగాణలో జరిగిన ఘటన పునరావృతం కాకపోవడం చంద్రబాబు అదృష్టం. విరాళాలు, నిధుల కోసమే ముందస్తు ఎన్నికలంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు టచ్‌లు ఉన్నారని చెప్పడం మైండ్‌గేమ్‌గా ఉంది. గెలుపు ఓటములు నిర్ణయించేంది ఎమ్మెల్యేలు కాదు.. ప్రజల మాత్రమే అనే విషయం టీడీపీ గుర్తు పెట్టుకోవాలి అని వంశీ చెప్పుకొచ్చారు.

మొత్తానికి చూస్తే.. తాను పార్టీ మారట్లేదని వంశీ క్లారిటీ ఇచ్చేసుకున్నారు. కేవలం పరీక్షల వల్లే తాను రాలేదని వంశీ చెబుతున్నారు. ఇక రానున్న ఎన్నికల్లో గన్నవరం నుంచి ఈయనకు వైఎస్ జగన్ టికెట్ ఇస్తారో లేదో వేచి చూడాలి. అయితే ఈయన వైసీపీకి అనుకూలంగా మాట్లాడటం మొదలుకుని నిన్న, మొన్నటివరకూ ఈయనంటే యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావుకు అస్సలు పడట్లేదు. చాలాసార్లు సీఎం జగన్ దగ్గర ఇందుకు సంబంధించి పంచాయితీలు కూడా జరిగాయి. ఫైనల్‌గా ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Updated Date - 2023-04-04T17:28:14+05:30 IST