YSRCP Meeting : అరె ఏందిరా బై.. మొన్న మంత్రి పదవి.. ఇప్పుడేమో ఎమ్మెల్యే.. ఏంటో ఇది.. సీదిరి ఓ రేంజ్‌లో..!

ABN , First Publish Date - 2023-04-03T23:03:45+05:30 IST

తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం’ ముగిసింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) నిర్వహించిన ఈ కీలక సమావేశంలో పలు విషయాలు చర్చకు వచ్చాయి..

YSRCP Meeting : అరె ఏందిరా బై.. మొన్న మంత్రి పదవి.. ఇప్పుడేమో ఎమ్మెల్యే.. ఏంటో ఇది.. సీదిరి ఓ రేంజ్‌లో..!

తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం’ ముగిసింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) నిర్వహించిన ఈ కీలక సమావేశంలో పలు విషయాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ముందస్తు ఎన్నికలు (Early Elections), మంత్రివర్గ విస్తరణ (AP Cabinet Reshuffle), ఎమ్మెల్యేల టికెట్ల వ్యవహారంపై వచ్చిన వార్తలను సీఎం ఖండించారు. అవన్నీ రూమర్సే వాటిని పట్టించుకోవాల్సిన అక్కర్లేదని ఎమ్మెల్యేలకు భరోసా కల్పించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఏప్రిల్-3న ఏదో జరిగిపోతుందని అందరూ అనుకున్నారు కానీ.. అదేమీ జరగలేదు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇంచార్జ్‌ల జగన్ కీలక సూచనలు, సలహాలు చేశారు. సమావేశం అనంతరం అసలు జగన్ ఏం మాట్లాడారు..? ఏమేం సలహాలు ఇచ్చారనే విషయాలపై చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు.

అరే ఏంది రా బై..!

మిగిలిన వారి సంగతేమో కానీ.. మంత్రి సీదిరి అప్పలరాజు మాత్రం మీడియా ముందు ఓ రేంజ్‌లో సీన్ క్రియేట్ చేశారు. 175 అసెంబ్లీ స్థానాలకు 175 స్థానాలు గెలవాలనే లక్ష్యంతో పనిచేయాలని సీఎం జగన్ చెప్పారని మంత్రి చెప్పుకొచ్చారు. సీఎం సానుకూల దృక్పథంతోనే ఉన్నారని.. ప్రజలకు మరింత చేరువ కావాలని సీఎం సూచించారన్నారు. మీటింగ్‌లో ఏం జరిగిందనే విషయాలు నిశితంగా వివరించిన తర్వాత.. మీడియా ప్రతినిధులు ఇక ప్రశ్నలు మొదలుపెట్టారు. ఏంటి సార్.. ఈ మధ్య మీరు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.. మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి పోతుందంటూ రకరకాలు వార్తలు వస్తున్నాయి..? ఈ మధ్యనే సీఎం జగన్‌ను కూడా కలిశారు..? దీనిపై మాట్లాడాలని ప్రతినిధులు కోరారు. ఇందుకు ఆయన ఓ రేంజ్‌లో నవ్వులు తెప్పించేలా సమాధానం ఇచ్చారు. అరే ఏందిరా బై.. మొన్నేమో నా మంత్రి పదవిని తీసేశారు మీరు.. ఈ రోజు ఎమ్మెల్యే పదవిని కూడా మీరే తీసేశారు. అసలు మీకు ఇవన్నీ ఎలా వస్తాయో తెలియట్లేదు. నేను మరింత ఉత్సాహంతో పనిచేస్తాను. ఓ వ్యక్తిపై దాడిచేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఏందిరా బై ఇది నా మీద ఇన్ని.. నాకు అర్థం కాక అడుగుతున్నా.. ఎవడిదో భూమి ఆక్రమించుకుంటే వాళ్లు ఊరుకుంటారా.. వాళ్లు పట్టుకుని తన్నినారు. దానికి నాకేంటి సంబంధం. అసలు ఆ కొట్టినోడు నా నియోజకవర్గం కానే కాదు. అలాంటప్పుడు నాకేంటి సబంధం. ఎక్కడో ఏదో జరిగినా నాకే అంటగడుతున్నారు. ఇది ఏ మాత్రం పద్ధతి కాదుఅని మంత్రి సీదిరి చెప్పుకొచ్చారు.

Are-Endhir-Ra-Bhai-Seediri.jpg

ఈయనపై జరిగిన రూమర్స్ ఇవీ..!

గత కొన్నిరోజులుగా.. కేబినెట్ నుంచి ముగ్గురు, నలుగురు మంత్రులు ఔట్ అవుతారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మంత్రి వర్గ సమావేశంలో స్వయంగా జగన్ మోహన్ రెడ్డే ముగ్గురు, నలుగురు మంత్రులను పద్ధతి మార్చుకోకపోతే తొలిగిస్తానని తేల్చిచెప్పేశారు. జగన్ హెచ్చరికలను కూడా లెక్కచేయకుండా గత కొన్నిరోజులుగా సీదిరి ప్రవర్తిస్తున్నారని.. అందుకే ఆయన్ను క్యాంప్ ఆఫీస్‌కు జగన్ పిలిపించారని బయటికి వార్తలు వచ్చాయి. జగన్ మాటను లెక్కచేయని ఆయన్ను పక్కాగా మంత్రి పదవి నుంచి తొలగించే ఛాన్స్ ఎక్కువగా ఉందని కూడా వార్తలు వచ్చాయి. అంతేకాదు.. ఆ మంత్రి పదవిని ఉత్తరాంధ్ర సీనియర్ నేత.. ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు అప్పగిస్తారని కూడా తాడేపల్లిలో వార్తలు చక్కర్లు కొట్టాయి. సీన్ కట్ చేస్తే.. అవన్నీ రూమర్స్ అని తేలిపోయాయి. ఇలా వరుసగా తనపై వచ్చిన రూమర్స్‌కు పైవిధంగా సీదిరి రియాక్టయ్యి క్లారిటీ ఇచ్చుకున్నారు.

*****************************

ఇవి కూడా చదవండి..

*****************************

YSRCP : హుటాహుటిన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు మంత్రి సీదిరి.. తమ్మినేని కూడా రావడంతో ఒక్కసారిగా..

*****************************

Pawan Delhi Tour : పవన్ స్వయంగా ఢిల్లీకెళ్లారా.. కమలనాథులే పిలిపించుకున్నారా.. పర్యటన ఒక్కటే.. ప్రశ్నలెన్నో.. కొసమెరుపు ఏమిటంటే..!

*****************************

Viral News : సోషల్ మీడియాలో రామోజీరావు ఫొటో వైరల్.. ఇందులో నిజమెంత అని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆరాతీస్తే..!

*****************************

YSRCP Meeting : ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ కీలక సమావేశం తర్వాత.. బొత్సపై ఏబీఎన్ ప్రశ్నల వర్షం.. మంత్రి రియాక్షన్ చూశారో...!

*****************************

YSRCP Meeting : టెన్షన్ టెన్షన్‌గా కీలక సమావేశానికి వెళ్లిన ఎమ్మెల్యేలు.. టికెట్లు ఎవరెవరికో తేల్చి చెప్పేసిన సీఎం జగన్..


*****************************

Updated Date - 2023-04-03T23:08:03+05:30 IST