YSRCP Meeting : ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ కీలక సమావేశం తర్వాత.. బొత్సపై ఏబీఎన్ ప్రశ్నల వర్షం.. మంత్రి రియాక్షన్ చూశారో...!

ABN , First Publish Date - 2023-04-03T17:06:31+05:30 IST

వైసీపీ బిగ్ డేగా (YSRCP Big Day) భావించిన ఏప్రిల్-3న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) కీలక సమావేశం నిర్వహించారు.

YSRCP Meeting : ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ కీలక సమావేశం తర్వాత.. బొత్సపై ఏబీఎన్  ప్రశ్నల వర్షం.. మంత్రి రియాక్షన్ చూశారో...!

వైసీపీ బిగ్ డేగా (YSRCP Big Day) భావించిన ఏప్రిల్-3న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) కీలక సమావేశం నిర్వహించారు. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన ఈ మీటింగ్‌లో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం’పై (Gadapa Gadapaku Mana Prabhutvam) స‌మీక్ష నిర్వహించారు. ముఖ్యంగా గత కొన్నిరోజులుగా కొన్ని మీడియా సంస్థల్లో, సోషల్ మీడియాలో (Social Media) వస్తున్న రూమర్స్‌కు జగన్ చెక్ పెట్టేశారు. ముందస్తు ఎన్నికలు (Early Elections), మంత్రివర్గ విస్తరణ (AP Cabinet Reshuffle), ఎమ్మెల్యేల టికెట్ల వ్యవహారంపై వచ్చిన వార్తలను సీఎం ఖండించారు. అవన్నీ రూమర్సే వాటిని పట్టించుకోవాల్సిన అక్కర్లేదని ఎమ్మెల్యేలకు భరోసా కల్పించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఏప్రిల్-3న ఏదో జరిగిపోతుందని అందరూ అనుకున్నారు కానీ.. అదేమీ జరగలేదు. అంతేకాకుండా.. రానున్న ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి..? ఏయే కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలి..? ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలి..? అనే విషయాలపై సమావేశంలో కులంకశంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ సమన్వయకర్తలకు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. ‘జగనన్నే మా భవిష్యత్తు’ అనే కార్యక్రమాన్ని ఈ నెల 7 నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు.. 13 నుంచి ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో క్యాంపెయిన్‌పై పార్టీ శ్రేణులకు జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశం అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ జగన్ ఏం మాట్లాడారనే విషయాలను వెల్లడించారు.

YS-Jagan-Meeting.jpg

సమావేశం ఇందుకే..!

గత కొన్నిరోజులుగా ఏప్రిల్-3 వైసీపీ సమావేశం గురించి మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తల్లేవని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీని మరింత బలోపేతం చేసేందుకు, సంస్థాగతంగా తీసుకోవాల్సిన కార్యక్రమాల గురించి సీఎం జగన్ గారు దిశానిర్దేశం చేశారు. సీఎం గారు ఇచ్చిన ఆదేశాలను ఎమ్మెల్యేలు అంతా తూ.చ తప్పకుండా పాటిస్తాం. ఇప్పుడున్న 151 సీట్లు కాకుండా 175 అసెంబ్లీ స్థానాలే టార్గెట్‌గా ముందుకెళ్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమైంది.. ఫలితాలు ఏమయ్యాయ్. మీడియా అనుకుంటున్నట్లు ఏమీ కాలేదు అని బొత్స చెప్పుకొచ్చారు.

నో రియాక్షన్..!

మీడియాతో మాట్లాడుతుండగా మంత్రి బొత్సపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhra Jyothy) ప్రతినిధి పలు ప్రశ్నలు సంధించారు. వాటికేమీ సమాధానం చెప్పకుండానే బొత్స కారులో ముందుకెళ్లిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. ‘చూడు పాపం మా ఏబీఎన్ ఫ్రెండ్ ఎంత బాధపడుతున్నాడో చూడండి..’ అని నవ్వుతూ బొత్స సమాధానం దాటవేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు సమావేశానికి ఎందుకు హాజరుకాలేదు..? వారిపైన జగన్ ఏమైనా చర్యలు తీసుకుంటారా..? అని ఏబీఎన్ ప్రతినిధి ప్రశ్న సంధించగా.. ‘ఇంకేం లేవమ్మా.. చెప్పాల్సినవి అన్నీ అయిపోయాయ్..’ అని బొత్స బదులిచ్చారు.

మొత్తానికి చూస్తే.. ఇవాళ్టి ఎమ్మెల్యేలతో సమావేశం చాలా సాఫీగానే జరిగిందని చెప్పుకోవచ్చు. మంత్రి ఒక్కరే కాదు సమావేశం తర్వాత బయటికొచ్చిన ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దాదాపు ఇదే విషయాలనే మీడియా ముందు వెల్లడించారు.

Updated Date - 2023-04-03T17:13:13+05:30 IST