Balineni Row : మొన్న అలక.. నిన్న కంటతడి.. ఇప్పుడు బాలినేని పరిస్థితి ఎలా ఉందో ఓ లుక్కేయండి..!

ABN , First Publish Date - 2023-05-07T14:21:21+05:30 IST

బాలినేని శ్రీనివాసరెడ్డి.. (Balineni Srinivasa Reddy) ఈ పేరు గత నెలన్నర రోజులుగా ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా ఇదే మాట వినిపించింది. ఎప్పుడైతే తీవ్ర అసంతృప్తితో వైసీపీ అధిష్టానం తనకిచ్చిన..

Balineni Row : మొన్న అలక.. నిన్న కంటతడి.. ఇప్పుడు బాలినేని పరిస్థితి ఎలా ఉందో ఓ లుక్కేయండి..!

అవును.. బాలినేని మొన్న అలకబూనారు.. నిన్న కంటతడి పెట్టారు.. ఇప్పుడిక పంతం నెగ్గడంతో ఆల్ హ్యాపీస్ అట. సడన్‌గా ఆయన ముఖంలో మునుపటి చిరునవ్వు కనిపించడంతో.. వాసన్నకు పాతరోజులు వచ్చేశాయని అభిమానులు, అనుచరులు ఆనందంలో మునిగితేలుతున్నారట. ఇంత అనూహ్యంగా బాలినేనికి జరిగిన అద్భుతమేంటి..? ఆయన అనుకున్నది సాధించారా..? పంతం నెగ్గిందని మాజీమంత్రి హ్యాపీగా ఫీలవుతున్నారా..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..

Balineni-And-Jagan.jpg

అసలేం జరిగింది..!?

బాలినేని శ్రీనివాసరెడ్డి.. (Balineni Srinivasa Reddy) ఈ పేరు గత నెలన్నర రోజులుగా ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా ఇదే మాట వినిపించింది. ఎప్పుడైతే తీవ్ర అసంతృప్తితో వైసీపీ అధిష్టానం తనకిచ్చిన రీజనల్ కో-ఆర్డినేటర్ (Regional Co-Ordinator) పదవికి రాజీనామా (Resignation) చేశారో ఆ మరుక్షణమే ఈయన ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఆ తర్వాత సీఎంవో నుంచి ఫోన్ కాల్ వెళ్లిన కనీసం స్పందించకపోవడంతో ఈ వ్యవహారం మరింత చర్చకు దారితీసింది. ఆఖరికి సీఎం జగన్ రెడ్డే రంగంలోకి దిగి తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకున్నారు. అటు వైవీ సుబ్బారెడ్డి.. ఇటు బాలినేనిని కూర్చోబెట్టి ఇద్దరి సమక్షంలో పంచాయితీ తేల్చేయాలని జగన్ భావించారు. కానీ.. ఈ సమావేశంతో అంతా సెట్ అవుతుందుకున్నా సమస్య మరింత పెద్దదయ్యిందే తప్ప పరిష్కారం కాలేదు. గంటన్నరపాటు బాలినేనిని జగన్ బుజ్జగించినా కో-ఆర్డినేటర్ పదవి వద్దంటే వద్దని వెళ్లిపోయారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేయడం, మరికొందరు అసంతృప్తి వెళ్లగక్కుతుండటం, మరోవైపు వైఎస్ వివేకా కేసు.. ఇటు ప్రతిపక్షాల మాటల తూటాలతో రగిలిపోతున్న జగన్‌కు బాలినేని ఎపిసోడ్‌తో మరింత ఆందోళన చెందించిందట. ఇందుకు కారణం బాలినేని.. జగన్ దగ్గరి బంధువు కావడమే. కుటుంబ సభ్యులుగా ఉన్నవారే ఇలా చేస్తుండటంతో ఎందుకిలా జరుగుతోందని ఆలోచనలో పడ్డారట.

Balineni-Sreenivas.jpg

పంతం నెగ్గించుకున్న బాలినేని..

వాస్తవానికి.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్‌ కీలక నేత. నాడు వైఎస్సార్.. నేడు జగన్ హయాంలోనూ ఓ వెలుగు వెలిగారు. ఎందుకో ఈ మధ్య అసంతృప్తికి లోనయ్యారు. కారణామేంటా అని ఆరాతీస్తే.. సొంత జిల్లాలో ఆయనకు మునుపటిలాగా ప్రాధాన్యత లేకపోవడం, ఆఖరికి డీఎస్పీ విషయంలోనూ తనను సంప్రదించకుండా అన్నీ జరిగిపోతున్నాయని దీనంతటికీ కారణం వైవీ సుబ్బారెడ్డే అని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తాను టికెట్లు ఇప్పించిన ఎమ్మెల్యేలే ఇప్పుడు తనపై ఫిర్యాదులు చేసే పరిస్థితికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సొంత జిల్లాలోనే ప్రాధాన్యత లేకపోయినప్పుడు ఇక రీజనల్ కో-ఆర్డినేటర్‌గా రెండు మూడు జిల్లాలను ఎలా నడపగలనని హర్ట్ అయ్యారట. అందుకే తీవ్ర అసంతృప్తికి లోనై రాజీనామా చేశారన్నది ఇన్‌సైడ్ టాక్. జగన్‌తో బాలినేని సమావేశం అయిన తర్వాత కూడా మెత్తబడకపోవడంతో అసలు బాలినేని సమస్య ఏంటి..? ఆయనకు ఏం కావాలి..? ఎందుకీ పరిస్థితి వచ్చిందో తెలుసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి (Sajjala Ramakrishna Reddy) బాధ్యత అప్పగించారట. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన సజ్జల.. రెండే రెండ్రోజుల్లో మొత్తం సీన్ మార్చేశారట. జిల్లా ఉన్నతాధికారులతో పాటు, ఎమ్మెల్యేలకు బాలినేని ఏం చెప్పినా వినాల్సిందేనని గట్టిగానే ఆదేశాలు వెళ్లాయట. వైవీ సుబ్బారెడ్డికి (YV Subbareddy) కూడా బాలినేని వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పేశారట. దీంతో ఇక రంగంలోకి దిగిన బాలినేని డీఎస్పీ (DSP) విషయంలో మొదట అశోక్ వర్థన్ రెడ్డిని ఆయన వద్దని.. నారాయణ స్వామి రెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. దీంతో ఆయన పంతం నెగ్గినట్లయ్యింది. దీన్ని బాలినేని అనుచరులు, అభిమానులు మొదటి విజయంగా భావిస్తున్నారట.

Snapinsta.app_345443615_1886547198381826_6588073864673987500_n_1080.jpg

వరుస భేటీలు, జనాల్లోకి..!

అటు జగన్ నుంచి శుభవార్త రావడం.. ఇటు డీఎస్పీని మార్చేయడంతో ‘ఇక మొదలెడదామా’ అన్నట్లుగా మునుపటిలా బాలినేని యమా యాక్టివ్ అయిపోయారట. ఇన్నిరోజులుగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ చక్కబెట్టుకుంటున్నారట. నిన్న ఒంగోలు అతిథి గృహానికి వెళ్లిన మాజీమంత్రి.. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జిల్లాలో ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలో పూర్తికానున్న జగనన్న కాలనీల గురించి కార్యాచరణ ఏంటి..? పనులు ఎంవరకు వచ్చాయి..? అని చర్చించారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై కూడా సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. ఆయన నవ్వుతూ మాట్లాడున్నట్లు ఉన్న ఫోటోలో ఉండటంతో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఇప్పటి వరకూ పెద్దగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొనని ఆయన ఇప్పుడు హైపర్ యాక్టివ్‌గా పాల్గొంటున్నారు కూడా. ఇలా ఒకట్రెండు అని కాదు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుండంతో అధిష్టానంతో అంతా ఓకే అయ్యిందని.. బాలినేని అలక, అసంతృప్తి అన్నీ వీడినట్లేనని వైసీపీ శ్రేణులు అనుకుంటున్నాయి.

Snapinsta.app_345460036_661217102525839_3003939171014735551_n_1080.jpg

మొత్తానికి చూస్తే.. బాలినేని అలక వీడి హాయిగా తనపనులు చేసుకుంటున్నారని అభిమానులు చెప్పుకుంటున్నారు. కానీ ఇదే టైమ్‌లో బాలినేని పేరిట ఏర్పాటు చేసిన ఫెక్సీలు రాజకీయ చర్చకు తెరలేపాయి. నియోజకవర్గంలో పలుప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయగా అభిమానులు ఫ్లెక్సీలు వేయించారు. ఇందులో సీఎం జగన్, జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్, కీలక నేతలు వైవీ సుబ్బారెడ్డి ఫొటోలు లేకపోవడం గమనార్హం. అసలీ ఫ్లెక్సీలతో ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారో ఏంటో..! అసలు బాలినేని పరిస్థితేంటో అభిమానులకే అర్థం కావట్లేదట. ఫైనల్‌గా బాలినేని ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.

Snapinsta.app_345471781_1344328446131220_2797636492789810190_n_1080.jpg

******************************

ఇవి కూడా చదవండి..

******************************

KCR Cabinet Meeting : కొత్త సచివాలయంలో తెలంగాణ కేబినెట్ తొలి భేటీ.. తలనొప్పి తెప్పిస్తున్న లీక్‌లు.. ఈ మంత్రులకు గట్టిగానే కేసీఆర్ తలంటుతారా..!?


******************************

Kejriwal Vs Sukesh : సుకేష్ మరో సంచలనం.. కేజ్రీవాల్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న వరుస లేఖలు..

******************************
Karnataka Elections : ఫస్ట్ టార్గెట్ కర్ణాటక అన్న కేసీఆర్ పత్తా లేరేం.. కుమారస్వామితో చెడిందా.. ఇద్దరి మధ్య పెద్ద కథే నడిచిందా..!?

******************************




Updated Date - 2023-05-07T14:26:40+05:30 IST