KCR Cabinet Meeting : కొత్త సచివాలయంలో తెలంగాణ కేబినెట్ తొలి భేటీ.. తలనొప్పి తెప్పిస్తున్న లీక్‌లు.. ఈ మంత్రులకు గట్టిగానే కేసీఆర్ తలంటుతారా..!?

ABN , First Publish Date - 2023-05-07T10:55:54+05:30 IST

కొత్త సచివాలయంలోకి అడుగుపెట్టాక మొదటిసారి భేటీ జరగనుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేబినెట్‌ భేటీలో కేసీఆర్ ఏమేం మాట్లాడుతారు..? ఏయే విషయాలపై చర్చిస్తారు..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది..

KCR Cabinet Meeting : కొత్త సచివాలయంలో తెలంగాణ కేబినెట్ తొలి భేటీ.. తలనొప్పి తెప్పిస్తున్న లీక్‌లు.. ఈ మంత్రులకు గట్టిగానే కేసీఆర్ తలంటుతారా..!?

తెలంగాణ కొత్త సచివాలయంలో (TS New Secretariat) సోమవారం లేదా మంగళవారం నాడు సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన కేబినెట్ భేటీ (TS Cabinet Meeting) జరగనుంది. సచివాలయం ప్రారంభించిన తర్వాత మొదట ఇరిగేషన్ అధికారులతో మాత్రమే కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత జరుగుతున్న కేబినెట్ పరంగా జరుగుతున్న మొదటి సమావేశం ఇదే. పాలనా పరమైన సమస్యలు, ఆర్థిక వనరుల సమీకరణపై ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై నిశితంగా సుమారు గంటపాటు చర్చించే ఛాన్స్ ఉంది. కొత్త సచివాలయంలోకి అడుగుపెట్టాక మొదటిసారి భేటీ జరగనుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేబినెట్‌ భేటీలో కేసీఆర్ ఏమేం మాట్లాడుతారు..? ఏయే విషయాలపై చర్చిస్తారు..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ఏమేం చర్చించొచ్చు..? కొందరు మంత్రులకు గట్టిగా తలంటే ఛాన్స్ ఉందా..? పొంగులేటి ప్రస్తావన వస్తుందా..? ప్రతిపక్షాల విమర్శలపై బీఆర్ఎస్ (BRS) నో రియాక్షన్‌పై కేసీఆర్ ఎలా రియాక్ట్ కాబోతున్నారనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ప్రత్యేక కథనం..

CM-KCR.jpg

ఈ మంత్రులకు తలంటుతారా..!?

ఈ మధ్య మీడియా ముందుకొచ్చినా, బహిరంగ సభల్లో తెలంగాణ మంత్రుల్లో నలుగురైదుగురు అస్తమాను సొంత పార్టీ, స్వరాష్ట్రం విషయాలను కాకుండా.. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) గురించి మాట్లాడటం షరామామూలైపోయింది. ఇటు మంత్రులు మాట్లాడటం.. అటు ఏపీ నుంచి కౌంటర్లు రావడం రెండ్రోజులకోసారైనా జరుగుతున్న పరిస్థితి. అయితే ఇది కేసీఆర్‌కు అస్సలు నచ్చట్లేదట. అసలు ఆంధ్రా గురించి మాట్లాడటం ఎందుకు..? అంత అవసరమేంటి..? రచ్చ రచ్చ చేసి వార్తల్లో నిలవడం ఎందుకు..? అని గులాబీ బాస్ గుర్రుగా ఉన్నారట. ప్రస్తుతం ఏపీలో పూర్తిగా బీఆర్ఎస్ కార్యకలాపాలు జరగట్లేదు కదా..? విమర్శలకు హద్దు ఉండక్కర్లేదా..? మాట్లాడాల్సి వస్తే అక్కడ ఉంటే అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota Chandra Sekhar) మాట్లాడుతారు కదా..? మీకెందుకు..? అని ఈ విషయాలన్నీ కేబినెట్ సమావేశంలో ప్రస్తావించి మరీ.. ఏపీ గురించి మాట్లాడే మంత్రులకు గట్టిగానే తలంటుతారని టాక్ నడుస్తోంది. అయితే సమావేశంలోనే లేకుంటే ప్రత్యేకంగా క్యాబిన్‌కు పిలిచి ఆ మంత్రులతో (TS Ministers) కేసీఆర్ మాట్లాడుతారని తెలుస్తోంది. ఏపీ గురించి మాట్లాడిన మంత్రులు ఎవరు..? ఏయే విషయాల గురించి మాట్లాడారు..? అనేది అందరికీ తెలిసిన విషయమే. వాస్తవానికి వైజాగ్ స్టీల్‌ ప్లాంట్ (Vizag Steel Plant) బిడ్డింగ్‌లో పాల్గొని కాపాడుతామని బీఆర్ఎస్ ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు.. అయితే ఆఖరికి బిడ్డింగ్ టైమ్‌కు పత్తాలేకుండా పోయింది. ఎందుకిలా జరిగిందనే విషయం పక్కనెడితే ‘కాపాడుతాం.. మేం తప్ప ఎవరూ కాపాడలేరు’ అని బీఆర్ఎస్ మంత్రులు ఓ రేంజ్‌లో ఊదరగొట్టారు. ఇది బీఆర్ఎస్‌కు బాగా మైనస్ అయ్యింది. ఈ వ్యవహారం సమసిపోకముందే.. మంత్రి మల్లారెడ్డి పోలవరం ప్రస్తావన తేవడం పెను దుమారమే రేపింది. ఇలా ఒకటి పోతే ఒకటి రచ్చ జరుగుతోందే తప్ప.. స్వరాష్ట్రం గురించి పట్టించుకోవట్లేదని కేసీఆర్ ఆగ్రహంతో రగిలిపోతున్నారట.

Ponguleti-and-jupally.jpg

పొంగులేటి ప్రస్తావన..!

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయబడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy), జూపల్లి కృష్ణారావుల (Jupally Krishna Rao) చుట్టూనే తిరుగుతున్నాయి. కాషాయ కండువా కప్పాలని కమలనాథులు.. రండి ‘చేయి’ చేయి కలుపుదాం.. తెలంగాణ ఇచ్చిన పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామని కాంగ్రెస్ చెబుతోంది. అంతేకాదు పోటాపోటీగా జిల్లాలో ఎన్ని సీట్లు కావాలంటే అన్ని తీసుకోవచ్చని బహిరంగంగానే ఆఫర్లు ఇచ్చేస్తున్నాయి జాతీయ పార్టీలు. ఈ తరుణంలో అసలు పొంగులేటి ఎటువెళ్తారనే దానిపై సందిగ్ధత అయితే నెలకొంది. సరిగ్గా ఇదే సమయంలో ‘కొత్త పార్టీ దిశగా పొంగులేటి’.. ‘జూన్‌ 2న పొంగులేటి ముహూర్తం?’ అని దమ్మున్న ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. దీంతో ఈ కథనాలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. అసలు ఇందులో నిజానిజాలెంత..? టీఆర్ఎస్ (TRS) పేరుతో పార్టీ ఏర్పాటు చేస్తున్నారా..? ఒకవేళ ఇదే నిజమైతే మనం ఎలా ముందుకెళ్లాలి..? నిజంగానే 45 స్థానాలే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవమెంత..? ఇంతకీ పొంగులేటికి టచ్‌లోకి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు ఎవరు..? అనే విషయాలపై కేబినెట్ భేటీలో కేసీఆర్ చర్చించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

KCR-meeting.jpg

ఏం చేస్తున్నారు..!?

సచివాలయంలో లీకేజీ విషయం, శరద్ మర్కడ్‌ను కేసీఆర్ ప్రైవేట్ సెక్రటరీగా నియమిస్తూ జీవో జారీ చేయడం, ఇలా కొన్ని కొన్ని రహస్య జీవోలు బయటికి రావడంతో బీఆర్ఎస్‌లోఅంతా గజిబిజిగా అయ్యిందట. అసలు ఇవన్నీ ఎవరు లీక్ చేస్తున్నారు..? ఇది ఎవరు పని..? పనిగట్టుకుని ఇలా చేస్తున్నారా..? ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నదెవరో తెలుసుకుని వారి భరతం పట్టాలని కేసీఆర్ భావిస్తు్న్నారట. ఇంత జరుగుతున్నా కీలక మంత్రులు, ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు..? అని కేసీఆర్ ఈ సమావేశంలో కన్నెర్రచేసే పరిస్థితులు ఉండొచ్చట.

- సచివాలయం ప్రారంభించిన తర్వాత మంత్రులు పెద్దగా చాంబర్లలో కనిపించట్లేదు. ఒకరిద్దరు మినహా రోజూ సచివాలయంకు వచ్చిన పరిస్థితులు కూడా లేవు. దీంతో కేసీఆర్ గుర్రుగా ఉన్నారట. ఎప్పటికప్పుడు సంబంధిత శాఖల అధికారులతో మంత్రులు టచ్‌లో ఉంటూ సమీక్షలు నిర్వహించాలని సూచించబోతున్నారట. మంత్రులంతా మొక్కబడిగా కాకుండా ప్రతిరోజూ సచివాలయానికి రావాల్సిందేనని అని ఆదేశించే అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి. కొత్త సచివాలయంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా..? అని కూడా గులాబీ బాస్ ఆరాతీసే చాన్స్ ఉంది.

- మరోవైపు.. కేసీఆర్ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. ప్రతిపక్ష పార్టీల నేతలు మీడియా ముందుకొచ్చి మాటల తూటాలు పేలుస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఒకరిద్దరు తప్పితే పెద్దగా ఎవరూ స్పందించట్లేదు. దీంతో అసలేం జరుగుతోందో తెలంగాణ ప్రజానీకానికి తెలియని పరిస్థితి నెలకొన్నట్లు బీఆర్ఎస్ భావిస్తోందట. ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని కేసీఆర్ సూచించే ఛాన్స్ ఉంది. ఒక్కరిద్దరే కాదు ప్రతి ఒక్కరూ స్పందించాలని నిజం నిక్కచ్చిగా చెప్పడంలో తప్పేముందని బాస్ చెప్పబోతున్నారట. ఏది పడితే అది మాట్లాడకుండా సబ్జక్ట్ తెలుసుకుని మాట్లాడాలని మంత్రులకు సూచించబోతున్నారట.

మొత్తానికి చూస్తే.. కొత్త సచివాలయంలో తొలిసారి జరిగే కేబినెట్ సమావేశం హాట్ హాట్‌గా ఉండబోతోందని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. భేటీ ముగిశాక పరిస్థితి ఎలా ఉంటుంది..? ఏమేం కీలక నిర్ణయాలు తీసుకుంటారు..? పైన చెప్పిన విషయాలతో ఇంకా ఏమేం చర్చకొచ్చే ఛాన్స్ ఉందనే విషయాలు తెలియాంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Kejriwal Vs Sukesh : సుకేష్ మరో సంచలనం.. కేజ్రీవాల్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న వరుస లేఖలు..

******************************
Karnataka Elections : ఫస్ట్ టార్గెట్ కర్ణాటక అన్న కేసీఆర్ పత్తా లేరేం.. కుమారస్వామితో చెడిందా.. ఇద్దరి మధ్య పెద్ద కథే నడిచిందా..!?

******************************

Mallareddy Comedy : బాబోయ్.. మల్లారెడ్డి.. పాలు, పూలు, కూరగాయలు అమ్మడమే కాదు.. ఇంకా చాలానే చేశారుగా.. పగలబడి నవ్వే విషయం చెప్పిన కేటీఆర్..

******************************

KCR Warning : సీఎం కేసీఆర్‌తో కీలక సమావేశం తర్వాత ఏపీ గురించి మల్లారెడ్డి ఏమన్నారో తెలిస్తే.. మరోసారి రచ్చ..

******************************

Mallareddy On AP : ఏపీ గురించి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇన్ని మాటలు అనేశారేంటి.. రచ్చ రచ్చ చేశారుగా..!

******************************

Updated Date - 2023-05-07T11:31:20+05:30 IST