Mallareddy On AP : ఏపీ గురించి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇన్ని మాటలు అనేశారేంటి.. రచ్చ రచ్చ చేశారుగా..!

ABN , First Publish Date - 2023-05-01T19:03:19+05:30 IST

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) నోట ఇన్నిరోజులు కష్టపడ్డా.. పనిచేసినా.. పాలు, పూలు అమ్మినా.. అనే డైలాగ్‌లే (Mallareddy Dialogues) విన్నారు కదూ..

Mallareddy On AP : ఏపీ గురించి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇన్ని మాటలు అనేశారేంటి.. రచ్చ రచ్చ చేశారుగా..!

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) నోట ఇన్నిరోజులు కష్టపడ్డా.. పనిచేసినా.. పాలు, పూలు అమ్మినా.. అనే డైలాగ్‌లే (Mallareddy Dialogues) విన్నారు కదూ.. ఆయన ఒరిజనల్ వేరే ఉందండోయ్. ఒక్కసారి ఆయన కామెడీని కాస్త పక్కనెట్టి రాజకీయాలు గురించి మాట్లాడారో ఇక ప్రత్యర్థులు అంతే సంగతులు. తెలంగాణ ప్రతిపక్ష పార్టీల నేతల గురించే కాదు.. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని (YSR Congress) ఈ మధ్య ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడ సభ నిర్వహించినా.. ప్రెస్‌మీట్ పెట్టినా ఏపీ గురించి ప్రస్తావన లేనిదే మల్లారెడ్డి ప్రసంగం ముగించట్లేదు. ఇవాళ కార్మిక దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతీలో నిర్వహించిన కార్యక్రమంలో కార్మికుల గురించి కాసేపు మాట్లాడిన మల్లారెడ్డి.. డైరెక్టుగా ఏపీ రాజకీయాల గురించి ఓ రేంజ్‌లో మాట్లాడేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతకీ మేడే రోజున మల్లారెడ్డి మాట్లాడి అంతగా ఏం మాట్లాడారు..? వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తోంది..? అనే విషయాలపై ప్రత్యేక కథనం..

Minister-Mallareddy.jpg

ఇంత మాట అన్నారేంటో..!

ఏపీ రాజకీయాలపై మంత్రి మల్లారెడ్డి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో కుల రాజకీయం నడుస్తోందని.. కాపు, కమ్మ, రెడ్డి అంటూ రాజకీయాలు చేస్తు్న్నారే తప్ప జనాలను, సమస్యలను పట్టించుకోవడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీని బాగుచేయబోయేది కేసీఆరే (CM KCR) అని కామెంట్స్ చేశారు. అంతటితో ఆగని ఆయన.. పోలవరం (Polavram) నిర్మాణం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని (Vizag Steel Factory) కాపాడటం ఎవరి తరం కాదని కేసీఆర్ మాత్రమే ఆదుకోగలరని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌నే ఏపీ ప్రజలు నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో విశాఖలో (Vizag) లక్ష మందితో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని ఈ సందర్భంగా మల్లారెడ్డి చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ ప్రభుత్వంకు ఏమీ చేతకాదని.. ఇక ఏపీ ప్రజలకు కేసీఆరే దిక్కు అన్నట్లుగా పరోక్షంగా అనేశారు మల్లారెడ్డి. మంత్రి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) తెగ వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు ఈ కామెంట్స్‌ను ఓ రేంజ్‌లో షేర్ చేస్తుండగా వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు మాత్రం కౌంటర్ల వర్షం కురిపిస్తున్నారు.

Jagan-Sad.jpg

మళ్లీ అగ్గిరాజేశారుగా..!

వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత ఏపీ-తెలంగాణ మంత్రుల (AP-TS Ministers) మధ్య ఏ రేంజ్‌లో మాటల యుద్ధం నడిచిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య ఏదో ఒక విషయంలో వార్ జరుగుతూనే ఉంది. ఆ మాటల యుద్ధం కాస్త తగ్గిందనుకున్న టైమ్‌లో ఇప్పుడు మల్లారెడ్డి పోలవరం, స్టీల్ ఫ్యాక్టరీ అంటూ అగ్గి రాజేశారు. కాగా.. స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో నానా హడావుడి చేసిన కేసీఆర్ సర్కార్ ఆఖరికి బిడ్డింగ్‌ టైమ్‌లో ఆ దరిదాపుల్లోకి పోకపోవడం గమనార్హం. దీంతో ఇంత బిల్డప్ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం బిడ్డింగ్‌లో ఎందుకు పాల్గొనలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఇప్పుడు ఏకంగా మల్లారెడ్డి పోలవరం అంటూ కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు. దీనిపై ఏపీ మంత్రులు (AP Ministers) స్పందిస్తారో వేచి చూడాల్సిందే. మొత్తానికి చూస్తే.. మంత్రి కామెంట్స్‌తో మరో రచ్చ మాత్రం పక్కా అని స్పష్టంగా అర్థమవుతోంది.

KCR-Maha-Sabha.jpg

సినిమా యాక్టర్ కాదు..!

సీఎం కేసీఆర్ సినిమా యాక్టర్ (Cinema Actor) కాదు.. అయినా ఏపీ (AP), కర్ణాటక (Karnataka), మహారాష్ట్ర (Maharastra) ఇలా ఏ రాష్ట్రానికి వెళ్లి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. దేశ ప్రజలు కేసీఆర్‌ను కోరుకుంటున్నారు. మహారాష్ట్రలో అతి త్వరలో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం రాబోతోంది. ఐటీ మంత్రి కేటీఆర్ లాంటి డైనమిక్ మినిస్టర్ యావత్ దేశంలో లేరు. తెలంగాణ ప్రభుత్వ చర్యల కారణంగా ప్రస్తుతం ఐటీ రంగంలో హైదరాబాద్ (Hyderabad) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. కాగా.. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీకి మొదటి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. తెలంగాణకు ఆనుకొని ఉన్న నాందేడ్‌ జిల్లాలోని భోకర్‌ తాలూకాలో ఉన్న ప్రఖ్యాత భోకర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ 18 డైరెక్టర్‌ పదవులకు జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు పరాజయంపాలయ్యారు. ఇక మేడే కార్యక్రమంలో కార్మికులు ధరించే ఖాకీ ప్యాంటు, చొక్కా, మెడలో ఎర్ర కండువా వేసుకొని మల్లారెడ్డి సందడి చేశారు. సాంస్కృతిక శాఖ కళాకారులతో కలిసి మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ డప్పు కొట్టి కాలు కదిపారు.

Mallareddy-With-Dappu.jpg

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Chikoti Arrest : అరెస్టయిన చికోటి ప్రవీణ్ థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్‌ కోసం ఏ రేంజ్‌లో ప్లాన్ చేశాడో తెలిస్తే..

******************************

Chikoti Praveen : థాయిలాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్.. 14 మంది మహిళలు కూడా..

******************************

Casino King Chikoti : థాయిలాండ్‌లో చికోటితో పట్టుబడిన వారిలో వైసీపీ నేతలు.. కీలకంగా వ్యవహరించిన మహిళ..!

******************************

New Secretariat : కొత్త సచివాలయంకు వెళ్లిన ఉద్యోగుల్లో గందరగోళం.. తొలిరోజు సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారంటే..

******************************

Mallareddy Comedy : బాబోయ్.. మల్లారెడ్డి.. పాలు, పూలు, కూరగాయలు అమ్మడమే కాదు.. ఇంకా చాలానే చేశారుగా.. పగలబడి నవ్వే విషయం చెప్పిన కేటీఆర్..

******************************

KCR Warning : సీఎం కేసీఆర్‌తో కీలక సమావేశం తర్వాత ఏపీ గురించి మల్లారెడ్డి ఏమన్నారో తెలిస్తే.. మరోసారి రచ్చ..

******************************

Updated Date - 2023-05-01T19:15:43+05:30 IST