Chikoti Praveen : థాయిలాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్.. 14 మంది మహిళలు కూడా..

ABN , First Publish Date - 2023-05-01T13:07:33+05:30 IST

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్‌ (Chikoti Praveen) మరోసారి వార్తల్లో నిలిచాడు. చికోటిని థాయిలాండ్ (Thailand ) పోలీసులు అరెస్ట్ చేశారు..

Chikoti Praveen : థాయిలాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్.. 14 మంది మహిళలు కూడా..

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌ (Chikoti Praveen) మరోసారి వార్తల్లో నిలిచారు. చికోటిని థాయిలాండ్ (Thailand ) పోలీసులు అరెస్ట్ చేశారు. థాయిలాండ్‌లోని పటాయలో మొత్తం 90 మంది ఉన్న ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో చికోటి ప్రవీణ్ కూడా ఒకరున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ ముఠాలో 14 మంది మహిళలు ఉన్నారు. వీరి నుంచి భారీగా నగదు, గేమింగ్ చిప్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చీకోటి నేతృత్వంలోనే ఈ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కోట్ల రూపాయిల నగదు, సుమారు 21 కోట్ల రూపాయిలు విలువ చేసే గేమింగ్ చిప్స్‌, ఎనిమిది క్లోజ్డ్-సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలు, 92 మొబైల్ ఫోన్‌లు, మూడు నోట్‌బుక్‌లను పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చికోటి ప్రవీణ్‌ను స్పెషల్ బృందాలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే థాయిలాండ్‌లో నేరం చేసినట్లు తేలితే కఠిన శిక్షలు ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే చికోటి ప్రవీణ్ విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని ఆయన అభిమానులు, అనుచరులు ఆందోళన చెందుతున్నారు.

Chikoti-Thailand.jpg

ఎవరెవరు ఉన్నారంటే..?

ఏప్రిల్-27 నుంచి ఓ హోటల్‌లో కాన్ఫరెన్స్ హాల్‌ను అద్దెకు తీసుకుని ఈ తతంగం నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఓ మహిళ కీలకంగా వ్యవహరించిందని సమాచారం. ఇప్పుడు ఆమె కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. థాయ్‌లో గ్యాంబ్లింగ్ కోసం ఒక్కొక్కరి నుంచి లక్షల్లో చికోటి వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. చికోటితోపాటు పటాయా పోలీసుల అదుపులో మాధవరెడ్డి, డిసీసీబి చైర్మన్ దేవేంధర్ రెడ్డి కూడా ఉన్నారు. టాస్క్ ఫోర్స్‌ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఈ ముఠా యత్నించగా వెంబడించి మరీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Praveen-Chikoti.jpg

థాయిలాండ్‌లో పట్టుబడినట్లుగా ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో (Social Media) తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో చికోటి ప్రవీణ్ స్పష్టంగా కనిపిస్తున్నారు.. రౌండప్ చేసి మరీ కొందరు ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు. ఆయన పక్కనే పలువురు మహిళలు కూడా ఉన్నారు. అయితే ఈ విషయంపై వివరాలు అడిగి తెలుసుకోవడానికి ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు చికోటిని, ఆయన ముఖ్య అనుచరులను సంప్రదించగా ఫోన్లు రింగ్ అవుతున్నాయి కానీ ఎవరూ స్పందించలేదు. క్యాసినో వ్యవహారంలో ఇప్పటికీ ప్రవీణ్ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

New Secretariat : కొత్త సచివాలయంకు వెళ్లిన ఉద్యోగుల్లో గందరగోళం.. తొలిరోజు సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారంటే..

******************************

YSRCP : బాబోయ్.. కొడాలి నానీని పేర్ని నాని పొగిడారా.. గాలి తీశారా.. ఏమిటీ మాటలు..!?

******************************

Updated Date - 2023-05-01T13:27:00+05:30 IST