YSRCP : బాబోయ్.. కొడాలి నానీని పేర్ని నాని పొగిడారా.. గాలి తీశారా.. ఏమిటీ మాటలు..!?

ABN , First Publish Date - 2023-04-30T17:50:36+05:30 IST

ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవడానికి గానీ.. విమర్శలు గుప్పించుకోవడానికి గానీ కొన్ని హద్దులు ఉంటాయి.. ఆ హద్దులు కాస్త దాటితే అంతే సంగతులు. ముఖ్యంగా ప్రశంసలు కాస్త మితిమిరితే అసలు అవతలి వ్యక్తి తిట్టాడా..

YSRCP : బాబోయ్.. కొడాలి నానీని పేర్ని నాని పొగిడారా.. గాలి తీశారా.. ఏమిటీ మాటలు..!?

ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవడానికి గానీ.. విమర్శలు గుప్పించుకోవడానికి గానీ కొన్ని హద్దులు ఉంటాయి.. ఆ హద్దులు కాస్త దాటితే అంతే సంగతులు. ముఖ్యంగా ప్రశంసలు కాస్త మితిమిరితే అసలు అవతలి వ్యక్తి తిట్టాడా.. లేకుంటే పొగిడారా.. అదీ కాకుంటే గట్టిగా ఇచ్చిపడేశారా..? అనేది తెలుసుకోవడానికి చాలా సమయమే పడుతుంది. ఈ పరిస్థితే ఇప్పుడు ఏపీలో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య జరిగింది. ఇద్దరూ ఒకప్పుడు జగన్ కేబినెట్‌లో కీలక శాఖలకు పనిచేసిన వారే. ఇద్దరూ ఒకే జిల్లాకు చెందినవారే.. పైగా ఇద్దరూ ఆప్తమిత్రులే. ఇందులో ఒకరు కొడాలి నాని (Kodali Nani) కాగా.. మరొకరు పేర్ని నాని (Perni Nani). ఓ కార్యక్రమంలో భాగంగా కొడాలిని పేర్ని ఆకాశానికెత్తేశారు. ఒకానొక సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలను కాస్త గమనిస్తే.. ఇంతకీ ఈయన పొగిడారా.. గాలితీశారా అనేంతలా ఉన్నాయి. ఇంతకీ మాజీ మంత్రి ఏం మాట్లాడారు..? జనాలు, సోషల్ మీడియాలో నెటిజన్లు ఏమనుకుంటున్నారనే విషయాలు ఇప్పుడీ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం రండి..

Kodali-nani.jpg

అసలేం జరిగింది..!?

గుడివాడలో (Gudivada) 8.98 కోట్ల రూపాయిలతో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ డిపో గ్యారేజ్‌ను మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని (Nani and Nani) ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, పలువురు ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొడాలి నానిపై పేర్నినాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ కొడాలి నాని లాంటి డైనమిక్ లీడర్ నాకు ఫ్రెండ్ కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఏదో చదివానని చెప్పుకొనే కొడాలి నాని ఏమీ చదువుకోలేదు.. అవన్నీ డ్రామా మాటలే. నాని పైకి ఏమీ తెలియనట్టు అమాయకంగా కనిపిస్తారు కానీ, ఆయన బుర్ర పాదరసం కంటే వేగం. వైసీపీ ఎమ్మెల్యేల్లోనే తెలివిగల వ్యక్తి నాని. పెద్ద గెడ్డం, మెడలో రుద్రాక్షలు ఇవన్నీ రౌడీ గెటప్‌లా కనిపిస్తాయి కానీ.. చాలా మంచివాడు.. చాలా తెలివైన నాయకుడు. నోట్లో కిళ్లీ వేసుకుంటాడు కదా అని ఆయన్ని ఓడించడానికి ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు.. కానీ ఐదోసారి గెలవడానికి ఆ ఇద్దర్నీ బోల్తా కొట్టించడానికి కావాల్సిన స్కెచ్ కొడాలి ఇప్పటికే వేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ విధంగా రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచారో.. అదే విధంగా గుడివాడలో కొడాలి నాని పేరు నిలిచిపోతుంది. గుడివాడ నుంచి ప్రతిపక్ష పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా గెలుపు నానిదే. ఇప్పటికే కొడాలి నాని గుడివాడలో ఐదోసారి గెలచేందుకు అన్నీ సిద్దం చేసుకున్నారు’ అని పేర్ని నాని చెప్పుకొచ్చారు.

Kodali-nani-and-Perni.jpg

ఇదేందయ్యా ఇది..!

ఈ కార్యక్రమానికి వచ్చిన జనాలు.. మొదట పేర్ని ప్రసంగం శ్రద్ధగా విన్నప్పటికీ రానురాను ఆ స్పీచ్ కాస్త మరీ సిల్లీగా అనిపించడంతో ఈయనేందిరా బాబోయ్.. ఇంతకీ నానిని నాని తిడుతున్నారా.. పొగుడుతున్నారా అనే ఆలోచనలో పడ్డారు. పేర్ని నాని మాటల్లో ఒకట్రెండు ఓకే కానీ.. కొన్ని వ్యాఖ్యలు మరీ సిల్లీగా ఉన్నాయని కొడాలి నాని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. మరికొందరు కొడాలి వీరాభిమానులు అయితే నాని అన్న అతి చేయొచ్చు.. మరీ ఈ రేంజ్‌లో చేస్తున్నారేంటబ్బా..? అని విమర్శలు గుప్పిస్తు్న్నారు. ముఖ్యంగా నోట్లో కిల్లీ, మెడలో రుద్రాక్షలు, రౌడీ ఇలా ఆహార్యం గురించి మాట్లాడటంతో కొడాలి అభిమానులు బాగా హర్ట్ అయ్యారట. ప్రస్తుతం నాని మాట్లాడిన మాటలను కట్ చేసి సోషల్ మీడియాలో కొందరు తెగ వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఇద్దరు నానీల గురించే చర్చ నడుస్తోంది. ఫైనల్‌గా ఈ కామెంట్స్‌ను కొడాలి అయినా సరదాగా తీసుకుంటారో.. లేకుంటే సీరియస్‌గా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.

Nani-and-Nani.jpg******************************

ఇవి కూడా చదవండి..

******************************

RK Kothapaluku : తెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త పలుకు’ పెను సంచలనం.. ఎక్కడ చూసినా ఆ నలుగురి గురించే చర్చ..

******************************

CBN and Pawan : ముచ్చటగా మూడోసారి చంద్రబాబు-పవన్ భేటీ.. అరగంటపాటు ఏమేం చర్చించారు..!?


******************************

YSRCP On Rajanikanth : అతిథిగా వస్తే తలైవాను టార్గెట్ చేయడమేంటి.. వైసీపీ ఇంత నీచానికి దిగజారాలా.. ఈ కామెంట్స్‌గానీ చూశారో..!?

******************************

Pawan Meets CBN : పవన్-చంద్రబాబు ఏకాంత భేటీలో ఏం చర్చించారో పూసగుచ్చినట్లుగా చెప్పిన నాదెండ్ల.. భవిష్యత్తులో..

******************************

Updated Date - 2023-04-30T17:56:37+05:30 IST