Kejriwal Vs Sukesh : సుకేష్ మరో సంచలనం.. కేజ్రీవాల్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న వరుస లేఖలు..

ABN , First Publish Date - 2023-05-06T16:13:49+05:30 IST

మనీలాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) మరో సంచలనం విషయం బయటపెట్టాడు. ఇప్పటికే పలుమార్లు లేఖలు (Letters), వాట్సాప్ చాట్‌లతో (Whatsapp Chat) రాజకీయ నేతల్లో వణుకు పుట్టించిన ఆయన..

Kejriwal Vs Sukesh : సుకేష్ మరో సంచలనం.. కేజ్రీవాల్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న వరుస లేఖలు..

మనీలాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) మరో సంచలనం విషయం బయటపెట్టాడు. ఇప్పటికే పలుమార్లు లేఖలు (Letters), వాట్సాప్ చాట్‌లతో (Whatsapp Chat) రాజకీయ నేతల్లో వణుకు పుట్టించిన ఆయన.. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Kejriwal ) గురించి ప్రస్తావిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సుకేష్ లేఖ రాశాడు. శనివారం నాడు తన అడ్వకేట్ ద్వారా మరో లేఖను చంద్రశేఖర్ విడుదల చేశాడు. జైలు నుంచి రాతపూర్వకంగా రాసిన ఈ లేఖను పరిగణనలోకి తీసుకోవాలని అడ్వకేట్ అనంత్ మాలిక్ (Sukesh Advocate Anant Malik) కోరారు.

Sukesh-Chandra-Sekhar.jpg

లేఖలోని సంచలన విషయాలివే..

కేజ్రీవాల్ తన నివాసం కోసం వ్యక్తిగతంగా అత్యాధునిక ఫర్నిచర్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. కేజ్రీవాల్‌తో పాటు సత్యేంద్ర జైన్‌లు ఇద్దరూ కలిసి నాతో వాట్సాప్, ఫేస్ టైంలో ఫర్నిచర్ ఫోటోలు సెలెక్ట్ చేసి షేర్ చేశారు. కేజ్రీవాల్ కోసం ఫర్నిచర్‌ను నేనే కొనుగోలు చేశాను. కేజ్రీవాల్‌ కోసం దాదాపు రూ.1.70 కోట్ల విలువైన ఫర్నిచర్ నేనే కొన్నాను. 12 సీట్ల డైనింగ్ టేబుల్ 45 లక్షల రూపాయలు.. 34 లక్షలతో డ్రెస్సింగ్ టేబుల్స్, 18 లక్షలతో అద్దాలు, 28 లక్షలతో బెడ్ రూమ్‌ సామగ్రి, రూ. 45 లక్షలతో గోడ గడియారాలు కొన్నాను. ఇటలీ, ఫ్రాన్స్ , ఢిల్లీ, ముంబైలలో ఫర్నిచర్ కొనుగోలు చేయడం జరిగింది. నా సిబ్బంది రిషబ్ శెట్టి ద్వారా కేజ్రీవాల్ అధికారిక నివాసంలో డెలివరీ చేశాడు. చెన్నైలోని నా నివాసానికి వచ్చిన సత్యేంద్రజైన్ ఇలాంటిదే కావాలంటూ ఫోటోలు తీసుకుని కేజ్రీవాల్‌కు చూపించారు. కేజ్రీవాల్‌తో జరిగిన వాట్సాప్ సంభాషణలు, ఫేస్‌బుక్‌లో మాట్లాడుకున్న వివరాలు నా దగ్గర ఉన్నాయి.. వాటిని దర్యాప్తు సంస్థలకు ఇస్తున్నాను. ఫర్నిచర్‌కు సంబంధించిన అన్ని బిల్లులను దర్యాప్తు సంస్థలకు అందించాను. కేజ్రీవాల్ నివాసంలో ఉన్న ఫర్నిచర్ కొనుగోలుపై దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరపాలిఅని లేఖలో సుకేష్ రాసుకొచ్చాడు.

Sukesh-Letter.jpg

సందేహాలుంటే చెక్ చేసుకోండి..!

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన ఇంటి పునరుద్ధరణ, సుందరీకరణ పనుల కోసం రూ.45 కోట్ల ప్రజాధనాన్ని వాడుకున్నారని బీజేపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ తీవ్రమైన వంచనకు పాల్పడుతున్నారని కమలనాథులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిజాయితీ, సింప్లిసిటీ అంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేజ్రీవాల్ తన వాగ్దానాలను తప్పుతున్నారని, మోసం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. కంఫర్ట్, విలాసాలపై ఆయనకు కాంక్ష ఎక్కువ అని సామాన్యులు సైతం కేజ్రీవాల్‌పై దుమ్మెత్తిపోశారు. ఈ విషయంలో ఆప్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తు్న్న సమయంలో సరిగ్గా సుకేష్ ఎంట్రీ ఇచ్చాడు. ఇమాన్‌దార్ అని చెప్పుకుంటున్న కేజ్రీవాల్ ఖరీదైన వస్తువులను వాడుతున్నారని సుకేష్ లేఖలో ఆరోపించడం గమనార్హం. తాను చెబుతున్న విషయాల్లో ఏమాత్రం సందేహాలున్నా కేజ్రీవాల్ ఇంటికెళ్లి తనిఖీ చేసుకోవచ్చని దర్యాప్తు సంస్థలకు ఆయన చెప్పాడు. అంతేకాదు.. డైనింగ్ టేబుల్ కలర్ ఆలివ్ గ్రీన్ అని కూడా సుకేష్ చెబుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. డైనింగ్ టేబుల్ మీద భోజనానికి వాడే ప్లేట్లు, నీళ్ళు తాగే గ్లాసులు వెండితో తయారైనవని చంద్రశేఖర్ చెప్పడంతో ఈ లేఖలు కేజ్రీవాల్‌ కంటిమీద కునుకు లేకుండా చేస్తు్న్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Sukesh-on-Kejriwal.jpg

మొత్తానికి చూస్తే.. జైల్లో ఉన్న సుకేష్ రాజకీయ నేతలకు పెద్ద తలనొప్పిగా మారారని చెప్పుకోవచ్చు. దీనిపై ఇప్పుడు బీజేపీ, ఆప్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Balineni : తీవ్ర భావోద్వేగానికి లోనైన బాలినేని.. ఈసారి ఏకంగా..

******************************

Kotam Reddy : వైసీపీలో పెను ప్రకంపనలు రేపుతున్న కోటంరెడ్డి కామెంట్స్.. త్వరలోనే అంతా చెప్పేస్తానంటూ సంచలనం..

******************************

Rains In AP : వైఎస్ జగన్ అలా.. చంద్రబాబు ఇలా.. ఏపీ ప్రజలారా ఈ సీన్ చూశాక..!

******************************

Revanth Reddy : ప్రియాంక చేతుల మీదుగా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్..

******************************

Updated Date - 2023-05-06T16:37:34+05:30 IST