Suspension on 4 MLAs : వైసీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడిన నిమిషాల వ్యవధిలోనే జరిగిన సీన్ ఇదీ.. నిరూపిస్తారా..!

ABN , First Publish Date - 2023-03-24T18:29:18+05:30 IST

ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి (YSR Congress) వ్యతిరేకంగా ఓటేసిన పార్టీ ఎమ్మెల్యేలపై అధిష్ఠానం సస్పెన్షన్ అస్త్రం విధించింది.

Suspension on 4 MLAs : వైసీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడిన నిమిషాల వ్యవధిలోనే జరిగిన సీన్ ఇదీ.. నిరూపిస్తారా..!

ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి (YSR Congress) వ్యతిరేకంగా ఓటేసిన పార్టీ ఎమ్మెల్యేలపై అధిష్ఠానం సస్పెన్షన్ అస్త్రం విధించింది. మొత్తం నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ప్రకటించారు. తొలి, ద్వితియ ప్రాధాన్యతా ఓట్లకుగాను ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి (Mekapati Chandra Sekhar Reddy) కోడ్ ఇచ్చామని అధిష్ఠానం చెబుతోంది. అయితే ఆ కోడ్ ఉల్లంఘించి.. వాటిని ఎవరు వెన్నుపోటు పొడిచారో గుర్తించిన అధిష్ఠానం వారిపై వేటు వేసింది. ఈ సస్పెన్షన్‌పై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి స్పందించారు. సజ్జల వ్యాఖ్యలకు రివర్స్ ఎటాక్ చేసిన మేకపాటి.. మీడియా వేదికగా ఛాలెంజ్ (Challange) కూడా చేశారు. ఇంతకీ ఈ ఇద్దరూ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.

4-MLAs-Suspension.jpg

నాపై ఎందుకు..?

పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వేయడంపై రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotam Reddy Sridhar Reddy) మొదటిసారి స్పందించారు. వైసీపీకి దూరంగా వెళ్తున్నానని మూడు నెలల కిందటే నేను చెప్పాను. నాపై చర్యలు తీసుకునే విధానం సరికాదు. షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా ఎలా చర్యలు తీసుకుంటారు. మొదట షోకాజ్ నోటీసు ఇచ్చి వివరణ కోరాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో చర్యలు తీసుకోలేదు. చేతిలో అధికారం ఉందని సస్పెండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. పార్టీలో పెత్తందారి విధానం నడుస్తోంది. పార్టీ నిర్ణయాన్ని సాదరంగా స్వాగతిస్తున్నానుఅని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు.

ప్రమాణం చేసి చెబుతున్నా..!

పార్టీ లైన్ దాటి ఓటేసినందుకు గాను ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై (Mekapati) కూడా వైసీపీ అధిష్ఠానం వేటు వేసింది. వేటుకు ముందే వైసీపీ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన మేకపాటి సస్పెన్షన్ తర్వాత నిమిషాల వ్యవధిలోనే మరోసారి రియాక్ట్ అయ్యారు. నేను ఎక్కడా తప్పు చేయలేదు. నేను జయమంగళ వెంకటరమణకే ఓటు వేశాను. దేవుడి మీద ప్రమాణం చేసి మళ్లీ చెబుతున్నా నేను తప్పు చేయలేదు. సస్పెన్షన్ చేసినందుకు సంతోషంగా ఉంది. ప్రజలు ఆదరిస్తే మళ్లీ గెలుస్తాను. నాకు 20 కోట్లు డబ్బులు ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. ఇదే మాట దేవునిపై ప్రమాణం చేసి చెబుతారా..?. ఎక్కువ చేసిన వారిని దేవుడు కత్తిరిస్తాడు. వైసీపీలోని కొందరు పెద్దల వల్ల సీఎం సహా అందరూ అవమానపాలవుతారుఅని మేకపాటి జోస్యం చెప్పారు. అయితే మేకపాటి ఛాలెంజ్‌కు సజ్జల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

ఇదిలా ఉంటే.. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు చించివేసి శ్రీదేవికి వ్యతిరేకంగా నినాదాలు కార్యకర్తలు, నినాదాలు చేశారు. అయితే ఈ దాడిపైన కానీ.. సస్పెన్షన్ విషయంపై కానీ ఇంతవరకూ శ్రీదేవి స్పందించలేదు. మరోవైపు.. ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ram Narayana Reddy) మాత్రం ఇంతవరకూ మీడియా ముఖంగా కానీ.. కనీసం సోషల్ మీడియా వేదికగా కానీ ఇద్దరూ స్పందించలేదు. ఈ ఇద్దరి నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో..? వేటు తర్వాత ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఏం చేయబోతున్నారనేది..? అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే మరి.

****************************

ఇవి కూడా చదవండి

******************************

Big Breaking : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్

******************************

MLC Election Results : క్రాస్ ఓటింగ్ వేసిందెవరో తెలుసన్న సజ్జల.. ఎమ్మెల్యే శ్రీదేవి రియాక్షన్ ఇదీ.. ఇవాళ ఉదయమే...

******************************

MLC Election Results : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌కు వెన్నుపోటు పొడిచింది ఈ ఇద్దరు ఎమ్మెల్యేలేనా.. ఫోన్ స్విచాఫ్ రావడంతో...!


******************************

Updated Date - 2023-03-28T20:50:39+05:30 IST