Worlds Most Expensive Resort: 'లగ్జరీ రిసార్ట్స్ కా బాప్'.. ఆస్తులు అమ్ముకున్నా ఇందులో ఒక్కరాత్రి బస చేయలేం బాస్..!

ABN , First Publish Date - 2023-03-03T10:45:57+05:30 IST

భూతల స్వర్గం అనే పదం కూడా ఈ రిసార్ట్ ముందు చాలా చిన్నదవుతుంది.

Worlds Most Expensive Resort: 'లగ్జరీ రిసార్ట్స్ కా బాప్'.. ఆస్తులు అమ్ముకున్నా ఇందులో ఒక్కరాత్రి బస చేయలేం బాస్..!

దుబాయ్: భూతల స్వర్గం అనే పదం కూడా ఈ రిసార్ట్ ముందు చాలా చిన్నదవుతుంది. ఇంకా చెప్పాలంటే 'లగ్జరీ రిసార్ట్స్ కా బాప్' లాంటిది అన్నమాట. అదే దుబాయ్‌లోని (Dubai) పామ్ జుమేర్హాలో ఉండే 'అట్లాంటిస్ ది రాయల్ రిసార్ట్' (Atlantis The Royal Resort). గత నెల 10వ తేదీన ప్రారంభమైన ఈ రిసార్టు 43 అంతస్తులతో 795 గదులను కలిగి ఉంటుంది. అయితే, ఈ రిసార్ట్‌లోని గదులంతా ఒక ఎత్తైతే.. రాయల్ మేన్షన్ రూమ్ మరో ఎత్తు. ఈ గదిలో ఒక్క రాత్రి బస చేసేందుకు ఏకంగా 1 లక్ష డాలర్లు (రూ. 82.5 లక్షల) చెల్లించాలి. ఇంతటితో అయిపోలేదు. ఈ రూ. 82.5లక్షలకు అదనంగా 22 శాతం పన్ను కూడా ఉంటుంది. అంటే అదొక రూ. 18 లక్షల 15 వేల రూపాయలు అన్నమాట. సో.. రెండు కలిపితే మొత్తం రూ. 1 కోటి 65 వేలు. ఇలా ఆ రాయల్ మేన్షన్ రూమ్‌లో ఒక్క రాత్రి స్టే చేయాలంటే కోటికి పైగా చెల్లించుకోవాల్సిందే.

Dubai-Resort.jpg

ఇది కూడా చదవండి: అసలు కువైత్‌లో ఏం జరుగుతుంది.. ఒక్క ఏడాదిలోనే 1.79లక్షల మంది ప్రవాసులను వెళ్లగొట్టిన గల్ఫ్ దేశం..!

ఇక ఈ రిసార్టులో అతి తక్కువ ధర రూమ్ అద్దె ఎంతంటే.. 4,134 దిర్హామ్స్ (రూ. 92 వేలు). అసలు అట్లాంటిస్ ది రాయల్ రిసార్టులో గదులు ఎందుకంత ఖరీదు? అనే డౌట్ మనకు రావడం కామన్. ఎందుకంటే.. ఈ రిసార్టులో టాప్ టూ బాటం.. ఎటుచూసినా సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా.. అడుగడుగునా లగ్జరీ తప్ప మరేం కనిపించదు. లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ లా ఉంటదన్నమాట. గదుల్లో, లాబీల్లో గోడలపై బంగారం పూత, బాత్రూమ్స్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇటాలియన్ మార్బుల్, సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా 17 రెస్టారెంట్స్ అండ్ బార్స్, స్కై గార్డెన్, 90 స్విమ్మింగ్ పూల్స్, ఇలా ఎన్నో స్పెషల్ ఎట్రాక్షన్ అట్లాంటిస్ ది రాయల్ రిసార్ట్ సొంతం. సో.. లగ్జరీ బాబులు ఎంజాయ్ చేసేందుకు ప్రపంచంలో ఇంతకంటే బెటర్ స్పాట్ ఉండేదేమో అనిపిస్తుంది కదూ.


Atlantis-The-Royal-Resort.jpg

ఇది కూడా చదవండి: విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయులకు జర్మనీ గుడ్ న్యూస్.. ఇకపై ఆ దేశానికి వెళ్లడం యమా ఈజీ..!

Updated Date - 2023-03-03T11:58:01+05:30 IST