Indians: విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయులకు జర్మనీ గుడ్ న్యూస్.. ఇకపై ఆ దేశానికి వెళ్లడం యమా ఈజీ..!

ABN , First Publish Date - 2023-02-28T08:38:38+05:30 IST

జర్మనీ(Germany) వెళ్లాలనుకునే భారతీయులకు అక్కడి ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది.

Indians: విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయులకు జర్మనీ గుడ్ న్యూస్.. ఇకపై ఆ దేశానికి వెళ్లడం యమా ఈజీ..!

ఎన్నారై డెస్క్: జర్మనీ(Germany) వెళ్లాలనుకునే భారతీయులకు అక్కడి ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. నైపుణ్యం కలిగిన భారత కార్మికులకు వర్క్ వీసా ప్రాసెస్‌ను (Work Visa Process) సులభతరం చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఫిబ్రవరి 17న మాట్లాడుతూ, దేశం నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతతో పోరాడుతున్నందున భారతదేశం నుండి సమాచార సాంకేతిక నిపుణులు (Information Technology Experts) జర్మనీలో వర్క్ వీసాలు పొందడాన్ని సులభతరం చేయాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందని తెలిపారు.

అలాగే సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లు, ఐటీ (Information Technology) డెవలప్‌మెంట్ స్కిల్స్ ఉన్నవారికి జర్మనీలో మరింత ఆకర్షణీయమైన అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ నేపథ్యంలో లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను మెరుగుపరచడాన్ని ఈ ఏడాది తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని స్కోల్జ్ చెప్పారు. ఈ సందర్భంగా "మేము వీసాల జారీని మరింత సులభతరం చేయాలనుకుంటున్నాం" అని ఆయన స్పష్టం చేశారు. బెంగళూరులోని హైటెక్ హబ్‌ను సందర్శించిన సందర్భంగా జర్మనీ ఛాన్సలర్ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియజేశారు.

అంతేగాక చట్టపరమైన ఆధునీకరణను పక్కన పెడితే, తాము మొత్తం బ్యూరోక్రాటిక్ ప్రక్రియను కూడా ఆధునీకరించాలనుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఇక స్కోల్జ్ తన భారత పర్యటనలో రెండవ రోజు ఉక్రెయిన్‌ యుద్ధంలో పతనం గురించి చర్చించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో శనివారం సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో ప్రసంగించారు. ఇదిలాఉంటే.. గతేడాది కూడా భారతీయులకు జర్మనీ వీసా దరఖాస్తు పీజులను తగ్గించింది. దీర్ఘకాలిక జర్మనీ నేషనల్ వీసాలతో పాటూ షెంజెన్ వీసా ఫీజుల్లో కోత వేసింది. జర్మనీ నేషనల్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఫీజు రూ.6 వేలుగా నిర్ణయించింది. అదే మైనర్లకు(17 ఏళ్ల లోపువారు) ఫీజు రూ. 3 వేలు మాత్రమే. ఇక షెంజెన్ వీసా కోసం పెద్దలకు రూ. 6400, మైనర్లకు రూ. 3200గా నిర్ణయించింది.

ఇది కూడా చదవండి: 70 దేశాల వారికి 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం.. 6నెలల వరకు స్టే చేసే ఫేసిలిటీ.. కానీ, మనోళ్లకు మాత్రం..

షెంజెన్(Schengen) వీసా అంటే..

షెంజెన్ దేశాల్లో(26 ఐరోపా దేశాలు) పర్యటన కోసం జారీ చేసే విసా ఇది. 90 నుంచి 180 రోజుల కాలపరిమితితో ఈ వీసాను జారీ చేస్తారు. ఈ వీసాతో జర్మనీ, ఫ్రాన్స్ తదితర ముఖ్య ఐరోపా దేశాల్లో పర్యటించవచ్చు.

ఏమిటీ నేషనల్(National) వీసా.. ?

సాధారణంగా విద్యా, ఉద్యోగం కోసం జర్మనీకి వెళ్లాలనుకునే వారికి అక్కడి ప్రభుత్వం నేషనల్ వీసాలు జారీ చేస్తుంటుంది. 90 రోజులకు పైబడిన వ్యాలిడిటీతో ఈ వీసా జారీ చేస్తారు. అయితే.. స్టూడెంట్ వీసాలకు సంబంధించిన నిబంధనల్లోనూ జర్మనీ మరో కీలక మార్పు చేసింది. ఇకపై భారతీయ విద్యార్థులు ముందుగా అకడమిక్ అవాల్యుయేషన్ సెంటర్‌లో తమ సర్టిఫికెట్లను తనిఖీ చేయించుకోవాలని చెప్పింది. ఈ తనిఖీకి సంబంధించి ఆథెంటిసిటీ సర్టిఫికెట్లు తీసుకోవాలని సూచించింది.

ఇది కూడా చదవండి: వామ్మో.. వీడసలు స్టూడెంటేనా..? వీధి రౌడీ కంటే దారుణంగా ఉన్నాడుగా..!

Updated Date - 2023-02-28T08:48:53+05:30 IST