UAE: 70 దేశాల వారికి 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం.. 6నెలల వరకు స్టే చేసే ఫేసిలిటీ.. కానీ, మనోళ్లకు మాత్రం..

ABN , First Publish Date - 2023-02-26T08:47:28+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రీజియన్‌లో ప్రధానంగా దుబాయ్ ప్రతియేటా అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి లక్షలాది మంది టూరిస్టులను ఆకర్షిస్తోంది.

UAE: 70 దేశాల వారికి 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం.. 6నెలల వరకు స్టే చేసే ఫేసిలిటీ.. కానీ, మనోళ్లకు మాత్రం..

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రీజియన్‌లో ప్రధానంగా దుబాయ్ ప్రతియేటా అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి లక్షలాది మంది టూరిస్టులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో యూఏఈ వెళ్లే వివిధ దేశాల వారికి అక్కడి సర్కార్ వేర్వేరు వీసా నిబంధనలను అమలు చేస్తోంది. కొన్ని దేశాల వారికి 'వీసా ఆన్ అరైవల్' (Visa on Arrival) సౌకర్యంతో ఏకంగా ఆరునెలల వరకు బస చేసే వీలు కల్పిస్తుంది. కాగా, 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం ఉన్న దేశాల జాబితాలో ఏకంగా 70 దేశాల వరకు ఉన్నాయి. అయితే, వీటిలో కొన్ని దేశాలకు కేవలం 30 రోజుల స్టే ఫేసిలిటీ మాత్రమే ఉంది. ఇక మరికొన్ని దేశాలవారు వారి దేశం నుంచి బయల్దేరడానికి ముందే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

30 రోజుల వ్యవధితో వీసా..

ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్ (Flydubai), ఎతిహాద్ ఎయిర్‌వేస్ (Etihad Airways) వెబ్‌సైట్ల ఆధారంగా దాదాపు 20 దేశాలు లేదా భూభాగాల పాస్‌పోర్ట్ హోల్డర్లు (Passport Holders) 30 రోజుల 'వీసా ఆన్ అరైవల్' ఉచితంగా పొందే వెసులుబాటు ఉంది. ఈ జాబితాలోని దేశాలు ఇవే..

Andorra

Australia

Brunei

Canada

China

Hong Kong (China)

Japan

Kazakhstan

Macau (China)

Malaysia

Mauritius

Monaco

New Zealand

Ireland

San Marino

Singapore

Ukraine

UK and Northern Ireland

USA

Vatican City

ఇది కూడా చదవండి: రెసిడెన్స్ వీసా ఉంటే చాలు.. యూఏఈలో ఈ ఏడు పనులు ఇట్టే అయిపోతాయి..

UAE-Visa.jpg

90 రోజుల వీసా..

50 కంటే ఎక్కువ దేశాలు లేదా భూభాగాల జాతీయులకు 90 రోజుల మల్టీపుల్ ఎంట్రీ విజిట్ వీసా (Multiple Entry Visit Visa) జారీ చేయబడుతుంది. ఈ వీసా జారీ చేసిన తేదీ నుండి ఆరు నెలల వరకు చెల్లుబాటు అవుతుంది. ఇక వీసాదారులు మొత్తం మూడు నెలల పాటు యూఏఈ (UAE)లో బస చేసే వెసులుబాటు ఉంటుంది. ఈ జాబితాలోని దేశాలు ఏవంటే..

Argentina

Austria

Bahamas Islands

Barbados

Belgium

Brazil

Bulgaria

Chile

Colombia

Costa Rica

Croatia

Cyprus

Czech Republic

Denmark

El Salvador

Estonia

Finland

France

Germany

Greece

Honduras

Hungary

Iceland

Israel

Italy

Kiribati

Latvia

Liechtenstein

Lithuania

Luxembourg

Maldives

Malta

Montenegro

Nauru

Netherlands

Norway

Paraguay

Peru

Poland

Portugal

Romania

Russia

Saint Vincent and the Grenadines

San Marino

Serbia

Seychelles

Slovakia

Slovenia

Solomon Islands

South Korea

Spain

Sweden

Switzerland

Uruguay

180 రోజుల వీసా

మెక్సికన్ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉన్న ప్రయాణికులు మల్టీపుల్ ఎంట్రీ (Multiple Entry) 180 రోజుల సందర్శన వీసాకు (Visit Visa) అర్హులు. ఇది జారీ చేసిన తేదీ నుండి ఆరు నెలల పాటు చెల్లుబాటు అవుతుంది. 180 రోజుల బస సౌకర్యం ఉంటుంది.

ఇది కూడా చదవండి: అగ్రరాజ్యం అమెరికాలో కలకలం.. 'జాంబీలు'గా మార్చేస్తున్న కొత్త డ్రగ్‌..!

ఇక భారత జాతీయుల విషయానికి వస్తే..

ఇక భారతీయుల విషయానికి వస్తే.. కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటయ్యే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) జారీ చేసిన విజిట్ వీసా (Visit Visa) లేదా గ్రీన్ కార్డ్ (Green Card), యునైటెడ్ కింగ్‌డమ్ (UK) లేదా యూరోపియన్ యూనియన్ (EU) నివాసాన్ని కలిగి ఉండే భారతీయ పౌరులు (Indian Citizens) గరిష్టంగా 14 రోజుల వాలిడిటీతో 'వీసా ఆన్ అరైవల్' పొందవచ్చు. దీన్ని మరో 14 రోజుల వరకు పొడిగించుకునే వెసులుబాటు ఉంది. తమ బసను పొడిగించుకోవడానికి అదనంగా కొంత రుసుము చెల్లించి మనోళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated Date - 2023-02-26T08:50:33+05:30 IST