Sai Varshith: ఎవరీ సాయి వర్షిత్.. అమెరికా అధ్యక్షుడిని చంపాలని 19 ఏళ్ల తెలుగు కుర్రాడి ప్లాన్.. 6 నెలలుగా పక్కా స్కెచ్.. చివరకు..!

ABN , First Publish Date - 2023-05-24T18:52:21+05:30 IST

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌పై తెలుగు సంతతికి చెందిన 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్ అనే కుర్రాడు ట్రక్కుతో దాడికి యత్నించడం సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను హత్య చేయాలనే ఉద్దేశంతోనే దాడికి పాల్పడినట్లు ఆ యువకుడు బయటపెట్టడం.. ప్రస్తుతం..

Sai Varshith: ఎవరీ సాయి వర్షిత్.. అమెరికా అధ్యక్షుడిని చంపాలని 19 ఏళ్ల తెలుగు కుర్రాడి ప్లాన్.. 6 నెలలుగా పక్కా స్కెచ్.. చివరకు..!

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌పై తెలుగు సంతతికి చెందిన 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్ అనే కుర్రాడు ట్రక్కుతో దాడికి యత్నించడం సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను హత్య చేయాలనే ఉద్దేశంతోనే దాడికి పాల్పడినట్లు ఆ యువకుడు బయటపెట్టడం.. ప్రస్తుతం అగ్రరాజ్యమంతటా తీవ్ర చర్చనీయాశంగా మారింది. అమెరికాలో ఎక్కడ చూసినా ఈ కుర్రాడి గురించే చర్చ నడుస్తోంది. అసలు ఎవరీ కుర్రాడు..? 6 నెలల పాటు పక్కా స్కెచ్ వేసి మరీ అమెరికా అధ్యక్షుడిని చంపాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు..? తదితర వివరాల్లోకి వెళితే..

మిస్సోరిలోని (Missouri) ఛెస్ట్‌ఫీల్డ్ ప్రాంతానికి చెందిన కందుల సాయి వర్షిత్.. భారత సంతతికి చెందిన వ్యక్తి. సాయి వర్షిత్ తల్లిదండ్రులు చాలా ఏళ్ల క్రితమే భారత్ నుంచి అమెరికాకు వలస వచ్చారు. ఇక్కడే స్థిరపడ్డారు. 2022లో మార్‌క్వీట్ సీనియర్ హై స్కూల్ నుంచి సాయి వర్షిత్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇతను రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో స్టూడెంట్ కౌన్సిల్‌లో పాల్గొన్నాడు. అలాగే సాయి వర్షిత్‌కు టెక్నాలజీపై (Technology) కూడా చాలా అవగాహన ఉంది. ప్రోగ్రామింగ్, కోడింగ్ లాంగ్వేజీపై మంచి పట్టు ఉండడంతో డేటా అనలిస్ట్‌గా (Data Analyst) స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. ఎలాంటి క్రిమినల్ రికార్డు లేని సాయి వర్షిత్.. కొన్ని నెలలుగా ఏకంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌నే (US presidential palace White House) తన స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేయడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Viral News: సాఫ్ట్‌వేర్ కష్టాలు పడీ పడీ ఈ 29 ఏళ్ల కుర్రాడికి విసుగొచ్చిందట.. చివరకు జాబ్‌కు రిజైన్ చేసి ఏం చేస్తున్నాడంటే..!

US-President-Biden.jpg

విచారణలో సాయి వర్షిత్ చెప్పింది విని పోలీసులే కంగుతిన్నారు. ‘శ్వేతసౌధాన్ని చేజిక్కించుకుని అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్నే నా ధ్యేయం..’ అని సాయి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దేశాధ్యక్షుడినే చంపడానికి ఎలా పూనుకున్నావని పోలీసులు అడగ్గా.. అధికారం చేజిక్కించుకోవడం కోసం అవసరమైతే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‍ను (US President Joe Biden) చంపడానికి కూడా వెనుకాడకూడదనుకున్నానని విచారణలో సాయి వర్షిత్ వెల్లడించడం గమనార్హం. సాయి వర్షిత్ వద్ద నుంచి పోలీసులు నాజీ జెండాను (Nazi flag) స్వాధీనం చేసుకున్నారు. ఈ జెండాను అతను ఆన్‌లైన్‍లో కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు. హిట్లర్ బలమైన నేత అని.. నాజీలకు గొప్ప చరిత్ర ఉందని సాయి వర్షిత్ చెప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. యువకుడి పొంతనలేని మాటలను బట్టి అతడు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు.

Marriage: పాపం.. ఈ కుర్రాడికి పెళ్లయిందన్న సంతోషమే లేకుండా పోయింది కదా.. మామూలు రోజుల్లో అయితే ఎగిరిగంతేసేవాడే కానీ..!

అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాయివర్షిత్ సోమవారం రాత్రి సెయింట్ లూయిస్ నుంచి వాషింగ్టన్‌లోని (Washington) డ్యుల్లెస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. అక్కడ ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని శ్రేతసౌధం ఉత్తరభాగం వైపు ఉన్న ట్రాఫిక్ బారియర్స్‌ను ఢీకొట్టాడు. ఈ దాడిలో అతడికి ఎలాంటి గాయాలూ కాలేదు. ఘటన జరిగిన వెంటనే యూఎస్‌ పార్క్ పోలీసులు, యూఎస్‌ సీక్రెట్ సర్వీస్ (US Secret Service) యూనిఫాం విభాగం అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్ష భవనంపై దాడికి సంబంధించిన ప్లానింగ్ వివరాలను ఆరు నెలలుగా ఎప్పటికప్పుడు తన గ్రీన్‌బుక్‌లో రాసుకున్నట్లు సాయి వర్షిత్ తెలిపాడు. ప్రమాదకరమైన ఆయుధంతో దాడి చేయడం, వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం, అమెరికా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించడం వంటి అభియోగాలపై సాయి వర్షిత్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. యువకుడి మానసిక పరిస్థితి తదితర వివరాలపై పోలీసులు అతడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను విచారించినట్లు తెలుస్తోంది.

Viral Video: ఓ యువతికి రోడ్డు పక్కన కనిపించిందో సోఫా.. దాని ఖరీదెంతో చూసి షాక్.. వెంటనే అదిరిపోయే ప్లాన్.. చివరకు..!

Updated Date - 2023-05-24T18:52:21+05:30 IST