Share News

Kuwait: ప్రవాసులకు కువైత్ గుడ్‌న్యూస్.. ఆ కేంద్రాల పనివేళలు పొడిగింపు

ABN , First Publish Date - 2023-12-13T08:02:08+05:30 IST

ప్రవాసులకు కువైత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. వలసదారులకు (Expats) ఆరోగ్య పరీక్షలు నిర్వహించే కేంద్రాల పనివేళలు పొడిగిస్తూ ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వశాఖ (Ministry of Health) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ అధికార ప్రతినిధి అబ్దుల్లా అల్-సనద్ తాజాగా కీలక ప్రకటన చేశారు.

Kuwait: ప్రవాసులకు కువైత్ గుడ్‌న్యూస్.. ఆ కేంద్రాల పనివేళలు పొడిగింపు

కువైత్ సిటీ: ప్రవాసులకు కువైత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. వలసదారులకు (Expats) ఆరోగ్య పరీక్షలు నిర్వహించే కేంద్రాల పనివేళలు పొడిగిస్తూ ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వశాఖ (Ministry of Health) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ అధికార ప్రతినిధి అబ్దుల్లా అల్-సనద్ తాజాగా కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న మూడు సెంటర్లలో కూడా వర్కింగ్ అవర్స్ (Working Hours) పెంచుతున్నట్లు వెల్లడించారు. అలీ సబా అల్-సలేం, అల్-జహ్రా, షువైఖ్ ప్రాంతాలలోని కేంద్రాలలో తాజాగా నిర్ణయించిన కొత్త పనిగంటలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇకపై ఈ మూడు సెంటర్లలో ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. వర్కింగ్ డేస్ (Working Days) అయిన ఆదివారం నుంచి గురువారం వరకు ఇవే పనివేళలు అమలులో ఉంటాయన్నారు.

ఇది కూడా చదవండి: NRI: కెనడాలో నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తున్న ఎన్నారై.. అదెలాగో తెలుసా..?

ముఖ్యంగా గృహ కార్మికులు (Domestic Workers) అన్ని ప్రవాస లేబర్ పరీక్షా కేంద్రాలలో ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండా పరీక్షలు చేయించుకోవచ్చు. అయితే, దీనికి వారి స్పాన్సర్ ఉండాల్సి ఉంటుంది. ఇతర దరఖాస్తుదారులు మాత్రం ముందస్తు అపాయింట్‌మెంట్ పొందడం తప్పనిసరి. ఇక ఈ పనిగంటల పొడిగింపు అనేది ఆరోగ్య కేంద్రాలపై పని ఒత్తిడిని తగ్గించడం, రోగులకు సౌకర్యవంతమైన సేవలను అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు అబ్దుల్లా అల్-సనద్ తెలిపారు. వర్క్‌ఫ్లో సవాళ్లను అధిగమించడానికి, సమర్థవంతమైన పరిష్కారాలను అమలు చేయడానికి పబ్లిక్ హెల్త్ సెక్టార్ (Public Health Sector) ప్రయత్నాలను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు.

ఇది కూడా చదవండి: Kuwait: ఫ్యామిలీ వీసాల యోచనలో గల్ఫ్ దేశం.. గడువు ముగిసిన వీసాతో దేశంలో ఉంటే.. రోజుకు రూ.27వేల ఫైన్!

  • మరిన్ని NRI NEWS కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-13T08:06:03+05:30 IST