Share News

NRI: కెనడాలో నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తున్న ఎన్నారై.. అదెలాగో తెలుసా..?

ABN , First Publish Date - 2023-12-09T11:43:38+05:30 IST

NRI News: జీవితంలో తొందరగా స్థిరపడితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరికినట్లే. ఆ తర్వాత లైఫ్‌లో ఎలాంటి కుదుపులు వచ్చినా తట్టుకుని నిలబడగలం. అందుకే యువత సాధ్యమైనంత త్వరగా జీవితంలో స్థిరపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. దీనికి ఉద్యోగం ఒక మార్గం. అలాగే బిజినెస్, రియల్ ఎస్టేట్ ఇలా పలు మార్గాలు ఉన్నాయి.

NRI: కెనడాలో నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తున్న ఎన్నారై.. అదెలాగో తెలుసా..?

NRI News: జీవితంలో తొందరగా స్థిరపడితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరికినట్లే. ఆ తర్వాత లైఫ్‌లో ఎలాంటి కుదుపులు వచ్చినా తట్టుకుని నిలబడగలం. అందుకే యువత సాధ్యమైనంత త్వరగా జీవితంలో స్థిరపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. దీనికి ఉద్యోగం ఒక మార్గం. అలాగే బిజినెస్, రియల్ ఎస్టేట్ ఇలా పలు మార్గాలు ఉన్నాయి. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో (Real Estate) వచ్చే లాభాలు మరే వ్యాపారంలో రావని చెప్పుకోవచ్చు. ఇందులో సరేనా స్ట్రాటజీలు ఫాలో అయితే చాలా డబ్బులు వెనకేసుకోవచ్చు. ఆ విషయాన్ని భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్త కరుణ్ విజ్ (Karun Vij) మరోసారి నిరూపించారు. కెనడాలో ఉండే ఈ ఎన్నారై (NRI) అక్కడ ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే కరుణ్ లాభదాయకమైన రియల్ ఎస్టేట్ వ్యూహాన్ని రెడీ చేసుకున్నారు. ఇంటి మొత్తాన్ని ఒకే వ్యక్తి అద్దెకు లేదా లీజుకు ఇవ్వడం కంటే స్టూడెంట్స్‌కు వ్యక్తిగత గదులను అద్దెకు ఇవ్వడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని ఆయన గుర్తించారు. ఈ స్ట్రాటజీతోనే కెనడాలో 28 గదులతో నాలుగు ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆయన ఈ 4 ప్రాపర్టీలను అద్దెకు ఇస్తూ నెలకు రూ.9 లక్షలకు పైగా ఆర్జిస్తున్నారు.

ఇది కూడా చదవండి: NRI News: నా భర్త మృతదేహాన్ని భారత్‌కు తీసుకెళ్తా.. సాయం చేయండి.. ఆస్ట్రేలియాలో ఓ ఎన్నారై భార్య విన్నపం..!

ఇక అతని రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో విలువ సుమారు 2.3 మిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.19 కోట్లు అన్నమాట. 2016లో 26ఏళ్ల వయస్సులో విజ్ కెనడాలోని అంటారియోలో (Ontario) తన మొదటి పెట్టుబడి పెట్టడం జరిగింది. ఆ ఏడాది రూ.2.7 కోట్ల ధర గల ఆస్తిని ఏడుగురు కళాశాల విద్యార్థులకు అద్దెకు ఇచ్చారు. ఆయన తన వృత్తిపరమైన కెరీర్‌తో పాటు భూస్వామిగా (Landlord) తన పాత్రను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. మొదట అప్లికేషన్ ఇంజనీర్‌గా, ఇప్పుడు యూఎస్‌లో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. చికాగోలో భార్య, కూతురితో కలిసి నివాసం ఉంటున్నారు. అమెరికాలో ఆయన చేస్తున్న ఉద్యోగానికి ఏడాదికి రూ.1.52కోట్లు వస్తున్నాయి. ఇలా అద్దెలు, జీతం ద్వారా వచ్చిన డబ్బుతో ఆయన దక్షిణ అంటారియోలో అసెట్ హోల్డింగ్‌లను మరింత పెంచుకున్నారు. 2023లో అయితే విజ్ అద్దె ఆస్తులు బ్రేక్-ఈవెన్ స్థాయికి చేరుకోవడం గమనార్హం. అతి తక్కువ రుణాలతో ఇంకా ఆస్తులను పెంచుకుంటూ వెళ్తున్న ఈ ఎన్నారై తన సంపదను రెట్టింపు చేసుకుంటున్నారు. యువ వ్యాపారవేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

  • మరిన్ని NRI NEWS కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-09T11:44:41+05:30 IST