Indians Laid off in US: ఒక్క నెలలో 91వేల మందిపై వేటు.. ఇండియన్స్ దేశం వీడితే తీవ్ర పరిణామాలంటూ యూఎస్ నిపుణుల వార్నింగ్!

ABN , First Publish Date - 2023-02-10T11:44:43+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలోని టెక్ సెక్టార్ (Tech Sector) ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది.

Indians Laid off in US: ఒక్క నెలలో 91వేల మందిపై వేటు.. ఇండియన్స్ దేశం వీడితే తీవ్ర పరిణామాలంటూ యూఎస్ నిపుణుల వార్నింగ్!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలోని టెక్ సెక్టార్ (Tech Sector) ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. రాబోయే రోజుల్లో తీవ్ర ఆర్థిక మాంద్యం తప్పదంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో అక్కడి టెక్ సంస్థలు అప్రమత్తమవుతున్నాయి. కంపెనీ వ్యయాలను తగ్గించుకునేందుకు భారీ మొత్తంలో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఈ జాబితాలో మెటా, ట్విట్టర్, అమెజాన్‌తో పాటు ఇతర ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ఇక అమెరికన్ కంపెనీలు ఈ ఏడాది ఒక్క జనవరి మాసంలోనే ఏకంగా 91వేల మంది ఉద్యోగులను తొలగించాయి. దాంతో అమెరికన్ టెక్ సెక్టార్‌లో భారీ తొలగింపుల మధ్య అధిక సంఖ్యలో భారతీయ నిపుణులు నిరుద్యోగులుగా మారారు.

ఈ పరిణామాలు అగ్రరాజ్యంలో హెచ్-1బీ వీసాపై పని చేస్తున్న భారతీయులను (Indians) తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ అమెరికన్ (Indian American) సంస్థలు హెచ్-1బీ వీసాదారుల (H-1B Holders) గ్రేస్ పీరియడ్‌ను రెండు నెలల నుంచి ఏడాదికి పైగా పొడిగించాలని ప్రెసిడెంట్ జో బైడెన్‌ను కోరుతూ ఆన్‌లైన్ పిటిషన్ వేశాయి. దీనివల్ల ఒకసారి ఉద్యోగం పోతే హెచ్-1బీ వీసా (H-1B Visa) ఉన్న విదేశీ టెక్ వర్కర్ 60 రోజుల వ్యవధిలోగా మరో ఉద్యోగం సంపాదించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో యూఎస్‌ను విడిచిపెట్టి స్వదేశానికి పయనం కావాలి.

ఇది కూడా చదవండి: భారత పౌరసత్వాన్ని వదులుకున్న 16 లక్షల మంది.. పదేళ్ల రికార్డ్ బ్రేక్!

ఇండో అమెరికన్ (Indo-American) కంపెనీల విజ్యప్తికి బైడెన్ సర్కార్ సానుకూలంగా స్పందిస్తే కొత్త ఉద్యోగాన్ని వెతుక్కొవడానికి మనోళ్లకు ఏడాది పాటు సమయం దొరుకుతుంది. ఇదిలాఉంటే.. నైపుణ్యం కలిగిన భారతీయులు అమెరికాను విడిచిపెడితే అది దేశానికే నష్టమని అక్కడి నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో అమెరికాలో ప్రతిభావంతుల కొరత ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. ఇక అగ్రరాజ్యంలో స్టార్టప్ వ్యవస్థాపకుల్లో 70శాతం మంది ప్రవాసులే ఉన్నారట. ఇందులో దాదాపు 50కిపైగా కంపెనీల బాస్‌లు భారత సంతతివారే (Indian Origin) గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను (Artificial intelligence) అందిపుచ్చుకునేందుకు దేశాల మధ్య తీవ్ర పోటీ ఉన్న ప్రస్తుత తరుణంలో ఇది మరింత తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు వార్న్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఒక్కసారి మేధోసంపత్తి తరలిపోతే దాని ప్రభావం దేశ ఆర్థికవ్యవస్థపై దీర్ఘకాలికంగా ఉంటుందనేది నిపుణుల మాట.

ఇది కూడా చదవండి: తెలుగు కుర్రాడి ప్రతిభకు అమెరికా సెల్యూట్.. సూపర్ టాలెంట్‌తో అబ్బురపరిచిన చిచ్చర పిడుగు!

Updated Date - 2023-02-10T12:31:33+05:30 IST