NRI’s with CBN: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హ్యూస్టన్‌లో ఎన్నారైల నిరసన ర్యాలీ

ABN , First Publish Date - 2023-09-19T13:31:24+05:30 IST

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా హ్యూస్టన్ నగరంలో తెలుగు ప్రవాస భారతీయులు ఆదివారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

NRI’s with CBN: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హ్యూస్టన్‌లో ఎన్నారైల నిరసన ర్యాలీ

NRI’s with CBN: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా హ్యూస్టన్ నగరంలో తెలుగు ప్రవాస భారతీయులు ఆదివారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. 'ఎన్నారై విత్ సీబీఎన్', 'సేవ్ డెమొక్రసీ', 'సేవ్ ఏపీ', 'హూస్టన్ విత్ సీబీఎన్' అనే నినాదాలతో నగరంలో దాదాపు మూడు గంటల పాటు ప్రదర్శన చేసి, తమ నిరసన తెలియజేశారు.

CBN.jpg

హ్యూస్టన్ ఎన్నారై వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో 200 మంది పైగా ప్రవాసాంధ్రులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. చంద్రబాబు నాయుడు కృషితో ఈ రోజు అగ్రరాజ్యంలో మంచి హోదాలలో వివిధ కంపెనీలో లబ్ధి పొందుతున్నం అని వారు పేర్కొన్నారు. ఇలా అన్యాయంగా, కక్షపూరితంగా నిర్బంధించడం పాలకుల తీరుకి నిదర్శనం అని దుయ్యబట్టారు. చంద్రబాబును త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా 'జై బాబు' అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించారు.

NRI.jpg

NRI: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ సిడ్నీలో ప్రవాసాంధ్రుల నిరసన


Updated Date - 2023-09-19T13:31:24+05:30 IST