Laughing Buddha: లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని ఇంట్లో, కార్యాలయాల్లో ఎందుకు ఉంచుతారో తెలుసా? దీని వెనుక పెద్ద కథే ఉంది..!

ABN , First Publish Date - 2023-05-26T15:27:28+05:30 IST

లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఉంచినట్లయితే ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది.

Laughing Buddha: లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని ఇంట్లో, కార్యాలయాల్లో ఎందుకు ఉంచుతారో తెలుసా? దీని వెనుక పెద్ద కథే ఉంది..!
wealth and prosperity

లాఫింగ్ బుద్ధుడు, సిద్ధార్థ గౌతముడు ఒకే రకమైన వ్యక్తులని మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ వారు అలా కాదు. లాఫింగ్ బుద్ధుడు సిద్ధార్థ గౌతముడు కాదు, బౌద్ధమత స్థాపకుడు 520 B.C.Eలో భారతీయ యువరాజు. లాఫింగ్ బుద్ధ అనేది ఖగోళ బుద్ధుడు, అతను చైనాలో విపరీతమైన చాన్ సన్యాసి, ఇతన్ని పు-తాయ్ అని పిలుస్తారు. అతను దాదాపు 1000 సంవత్సరాల క్రితం జీవించాడు. అతను చాలా దయగల స్వభావం కలిగినవాడు. అతను బోధిసత్వుని అవతారంగా పరిగణిస్తూ ఉంటారు. కాలగమనంలో అతని ప్రతిరూపాన్ని ఇంటి ఆవరణలో ఉంచడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. అది అదృష్టమని, శుభాలను కలిగిస్తుందనేది చైనా మాత్రమే కాకుండా యావత్ ప్రపంచమే విశ్వసించడం మొదలుపెట్టింది.

లాఫింగ్ బుద్ధా లక్కీ..

1. బుద్ధుని బొడ్డుపై రుద్దడం వల్ల అదృష్టం, సంపద, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. పొడుచుకు వచ్చిన బొడ్డుతో నవ్వుతూ, బట్టతల, దృఢమైన వ్యక్తి సంపద, అదృష్టం, ఆనందం కలిగి ఉంటాడు. సమృద్ధి, సంతృప్తిని సూచిస్తున్నందున ఈ లాఫింగ్ బుద్ధాను అనేక రెస్టారెంట్లు, దేవాలయాలలో ఉంచడం అనేది ఊపందుకుంది.

2. దీన్ని కొందరు మూడ నమ్మకం అనుకున్నా, కూడా కొందరు మాత్రం నిజంగానే చాలా లాభాలు ఉన్నాయి అందుకుంటూ ఉంటారు. లాఫింగ్‌ బుద్దా అనేది నెగటివ్‌ ఎనర్జి కంటే పాజిటివ్‌ ఎనర్జిని ఎక్కువగా ఇస్తుందని, ఆ కారణంగా లాఫింగ్‌ బుద్ద ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంచుకోవచ్చని నమ్ముతారు.

3. ప్రతి ఒక్కరికీ కూడా లాఫింగ్‌ బుద్దను చూసిన సమయంలో తెలియకుండానే మొహంలో చిరు నవ్వు అనేది వస్తుంది. దాన్ని తదేకంగా ఒక్క నిమిషం చూసినా కూడా మనసు ప్రశాంతంగా అవ్వడంతో పాటు మానసిక ఒత్తిడి కూడా పోతుందని వాస్తు నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: మిగిలిపోయిన చికెన్‌ కర్రీని ఫ్రిడ్జ్‌లో ఉంచే అలవాటుందా..? తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే..

4. అయితే లాఫింగ్‌ బుద్దా విగ్రహా సొంతంగా కొనుగోలు చేయడం కంటే ఎవరైనా బహుమానంగా ఇస్తే బాగుంటుందని, దాంతోనే ఎక్కువగా ప్రయోజనాలు ఉంటాయని మరి కొందరు నమ్ముతూ ఉంటారు.

5. లాఫింగ్‌ బుద్దాను సొంతంగా కొనుగోలు చేసుకుని కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. కొందరు మాత్రం బహుమానంగా వచ్చిన లాఫింగ్‌ బుద్దాతో ఇంట్లో సంతోషాలు వస్తాయని నమ్ముతారు.

6. ఇది వాస్తు ప్రకారం ఇంట్లో లేదా ఇతర ప్రదేశాలలో పెట్టవచ్చు..

7. బోట్ పట్టుకొని లాఫింగ్ బుద్ధ ఉంటే అది పెరుగుతున్న గౌరవం మరియు కీర్తికి చిహ్నం అని నమ్ముతారు. మీరు ఈ విగ్రహాన్ని ఇంట్లో, పని ప్రదేశంలో ఉంచుకోవచ్చు.

8. ఇంట్లో మెటల్‌తో చేసిన లాఫింగ్ బుద్ధను ఉంచుకుంటే అది పని సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది ఇంటి నుండి సోమరితనాన్ని కూడా నాశనం చేస్తుంది.

9. ప్రతికూల వార్తలు లేదా డబ్బు నష్టంతో బాధపడుతున్నట్లయితే ఇంట్లో లేదా దుకాణంలో లాఫింగ్ బుద్ధుని విగ్రహాన్ని ఉంచడం వలన దురదృష్టం, ప్రతికూలత నుండి బయటపడవచ్చని నమ్ముతారు,

10. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఉంచినట్లయితే ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది.

11. నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. ఎవరైనా ఇంటికి వచ్చి తలుపు తెరిచినప్పుడల్లా వాళ్ళ కళ్ళు మొదట లాఫింగ్ బుద్ధపై పడతే, ఆ వ్యక్తికి వచ్చిన నెగెటివ్ ఎనర్జీ మెయిన్ డోర్ దగ్గరే ఆగిపోతుంది. ఈ విగ్రహాన్ని వాస్తు ప్రకారం తూర్పు దిశలో ఉంచితే మంచిది.

Updated Date - 2023-05-26T15:27:28+05:30 IST