Silent Heart Attack: వామ్మో.. ఈ సైలెంట్ హార్ట్ అటాక్ ఏంటి బాబోయ్.. ఎలాంటి వాళ్లకు వచ్చే ప్రమాదం ఉందంటే..

ABN , First Publish Date - 2023-03-15T11:39:36+05:30 IST

silent heart attack లక్షణాలు చాలా తేలికగా ఉండి, గందరగోళానికి గురయ్యేలా చేస్తాయి.

Silent Heart Attack: వామ్మో.. ఈ సైలెంట్ హార్ట్ అటాక్ ఏంటి బాబోయ్.. ఎలాంటి వాళ్లకు వచ్చే ప్రమాదం ఉందంటే..
Silent Heart Attack

17ఏళ్ళ బాలుడికి గుండెపోటు..

నివేదికల ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన 17 ఏళ్ల బాలుడు ఆదివారం silent heart attack గుండెపోటుతో మరణించాడు. ఆ బాలుడు మహాకాళేశ్వర ఆలయ పూజారి కుమారుడు. రంగ పంచమి సందర్భంగా దేవాలయం ఊరేగింపులో పాల్గొన్నాడు. చాలా ఉత్సాహంగా ఊరేగింపులో డాన్స్ చేశాడు. స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పాడు. ఇంతలోనే చిన్న అసౌకర్యం అతని ముఖంలో కనిపించింది. నెమ్మదిగా కళ్లు మూసుకుని గుండెపట్టుకున్నాడు. చుట్టుపక్కలవారంతా కంగారుగా అతనిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ అసలు బాలుడికి ఏమైందో అర్థంకాలేదు. డాక్టర్స్ అతనికి సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చిందని అందుకే కాపాడలేకపోయామని చెప్పంత వరకూ అందరూ కళ్ళు తిరిగి పడిపోయాడనే అనుకున్నారు. అయితే ఇంతలోనే అతను చనిపోవడం అంటే అందరినీ షాక్ కు గురిచేసింది. ఇంత చిన్న పిల్లాడు గుండెపోటుతో చనిపోవడం అనేది అందరిలో భయాన్ని కలిగిస్తుంది అసలు ఈ పరిస్థితి ఏమిటి? ముందు ముందు అందరూ ఇలానే చనిపోతారా? అందరూ ఇలా అంతుబట్టని నొప్పి తెలియని విధంగా, ఎలాంటి సూచనలు లేకుండానే చనిపోతారా?

నిశ్శబ్ద గుండెపోటు అంటే ఏమిటి?

ఎలాంటి లక్షణాలు లేకుండా సైలెంట్‌గా గుండెపోటు వస్తే పేరుకు తగ్గట్టుగానే సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటారు. ఈ సందర్భంలో, గుండెపోటు లక్షణాలు ఏమాత్రం ఉండవు. ఇది పైకి హార్ట్ ఎటాక్ లాగా కనిపించినప్పటికీ, దాని కంటే ఎక్కువ హానికరం ఎందుకంటే రోగికి ఎటువంటి అనారోగ్య సంకేతాలు కనపించవు. దీనినే సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (SMI) అని పిలుస్తారు, ఇందులో 45% ప్రమాదం మహిళల కంటే పురుషులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.

నిశ్శబ్ద గుండెపోటు silent heart attack ఎందుకు తీవ్రమైనది?

సైలెంట్ హార్ట్ ఎటాక్ సంకేతాలు పైకి చాలా తేలికగా ఉంటాయి, రోగిలో ఎలాంటి తీవ్రమైన లక్షణాలు కనిపించవు కనుక కంగారుపడతాడు, కాబట్టి ఇది వైద్య సహాయం అందించడంలో ఆలస్యం అయ్యేలా చేస్తుంది. నిశ్శబ్ద గుండెపోటు silent heart attack లక్షణాలు చాలా తేలికగా ఉండి, గందరగోళానికి గురయ్యేలా చేస్తాయి. సాధారణ అసౌకర్యం వల్ల ఈ లక్షణాలను అంతగా పట్టించుకోరు. దీనితో సమస్య వికటించే ప్రమాదాలు ఎక్కువగా ఉంది.

గుండెపోటు సంకేతాలు ఏవి. ఎలా జాగ్రత్త వహించాలి?

గుండెపోటు సాధారణ సంకేతాలు అంటే ఛాతీ బిగుతు, ఛాతీ నొప్పి, ఛాతీలో గట్టి ఒత్తిడి, చేయి, మెడ, దవడలో కత్తిపోటు లాంటి నొప్పి, అకస్మాత్తుగా శ్వాస ఆడకపోవటం వంటివి సాధారణంగా నిశ్శబ్ద గుండెపోటు silent heart attack లో ఈ లక్షణాలు అంతగా కనిపించవు. కాబట్టి, ఈ సంకేతాలను జాగ్రత్తగా చూసుకోవాలి. రోగిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి.

ఇది కూడా చదవండి: కోపం వస్తే గట్టిగా అరుస్తున్నారా? అయితే ఇక నుంచి ఇలా చేసి చూడండి..!

మయోకార్డియల్ మచ్చలు నిశ్శబ్ద గుండెపోటు silent heart attack

అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించబడిన 2015 అధ్యయనంలో 45 నుండి 84 సంవత్సరాల వయస్సు గల 2,000 మంది హృదయ సంబంధ వ్యాధులు లేనివారిని గమనించారు. 10 సంవత్సరాల తరువాత, వారిలో 80% మందికి మయోకార్డియల్ మచ్చలు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. వారికి గుండెపోటు వచ్చిందని. "చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వీళ్ళలో 80% మందికి వారి పరిస్థితి గురించి తెలియదు. మొత్తంమీద, మయోకార్డియల్ మచ్చల ప్రాబల్యం మహిళల్లో కంటే పురుషులలో ఐదు రెట్లు ఎక్కువగా ఉంది" అని అధ్యయనం కనుగొంది.

నిశ్శబ్ద గుండెపోటు silent heart attack కు ప్రమాద కారకాలు ఏమిటి?

నిశ్శబ్ద గుండెపోటు ప్రమాద కారకాలు ధూమపానం, అధిక బరువు లేదా ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి జీవక్రియ రుగ్మతలు ఇవన్నీ మామూలు గుండెపోటుల మాదిరిగానే ఉంటాయి. సైలెంట్ గుండెపోటు silent heart attackలు సాధారణంగా కనిపించవు. ఏదైనా సంకేతాలు, శరీరంపై దీర్ఘకాలిక హానికరమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఏది ఏమైనా అనారోగ్య లక్షణాలను కాస్త శ్రద్ధగా గమనిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.

Updated Date - 2023-03-15T11:39:36+05:30 IST