The Anger : కోపం వస్తే గట్టిగా అరుస్తున్నారా? అయితే ఇక నుంచి ఇలా చేసి చూడండి..!

ABN , First Publish Date - 2023-03-07T21:42:27+05:30 IST

కంట్రోల్ చేసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది.

The Anger : కోపం వస్తే గట్టిగా అరుస్తున్నారా? అయితే ఇక నుంచి ఇలా చేసి చూడండి..!
Anger

కొందరిలో తరుచుగా ప్రతి విషయంలోనూ కోపం వస్తూ ఉంటుంది. కోపం రావడానికి తగిన సందర్భం అంటూ ఉండకపోవచ్చు. కొన్నిసార్లు వ్యక్తిగత కారణాలు కారణమైతే మరికొన్నిసార్లు కోపం రావడానికి సందర్భంతో పనిలేకుండానే కోపం పుట్టవచ్చు. అయితే అసలు మీలో కోపం రావడానిక బలమైన కారణాలు ఏమిటనే విషయంలో మీకు కొంత అవగాహన ఉండటం ఎంతైనా అవసరం. దీనివల్ల కోప్పడే సమయంలో కంట్రోల్ చేసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది. నియంత్రించుకోలేనంతటి తీవ్రస్థాయిలో కోపం రావడం వల్ల ఆరోగ్యానికి పలు విధాలుగా నష్టం జరుగుతుందంటున్నారు వైద్యులు.

దిగులు అసూయ, అవమానం, అసహ్యం, ఆతృత, భయం ఓర్పు లేకపోవడం, అసంతృప్తి, ఒంటరితనం, ఇవన్నీ కోపానికి కారణమయ్యే అంశాలు... కనుక కోపాన్ని సాధ్యమైనంత వరకూ రాకుండా చూసుకోవాలి. ఒక వేళ వచ్చినప్పటికీ దానిని క్రమేణా పోగొట్టుకునే మార్గాలను అనుసరించాలి. కోపం కలిగినప్పుడు దానిని అదుపులో వుంచుకొవడానికి కొన్ని ప్రయత్నాలు చేయండిలా...

మీరు కోపంగా ఉన్నప్పుడు మీ భావాలను దృఢంగా తెలియపరచడం దూకుడుగా కాకుండా కోపాన్ని చూపే ముందు మీ అవసరాలు ఏమిటో స్పష్టంగా చెప్పడం. ఇతరులను బాధపెట్టకుండా వాటిని ఎలా తీర్చుకోవాలో మీరు నేర్చుకోవాలి. దృఢంగా ఉండడానికి చూడాలి. అంటే ఒత్తిడి చేయడం లేదా డిమాండ్ చేయడం కాకుండా.. మీ అభిప్రాయాలను నిర్ణయాలను ఇతరల ముందు పెట్టగలగాలి.

1. ఏ విషయాన్నయినా ఒకటికి పదిసార్లు ఆలోచించి, ఆపై మాట్లాడడం మంచిది. కోపంగా ఉన్నప్పుడు మాటలు వదిలేసి తర్వాత పశ్చాత్తాపపడేలా పరిస్థితి దిగజారేలా చేసుకోకూడదు. విశ్రాంతి తీసుకోవడం, పరిస్థితిని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి.

2. కోపంగా ఉన్నప్పుడు కొంత సమయం పాటు నడవడానికి లేదా శారీరక వ్యాయామం చేయడం కొంతవరకూ మంచిది. శారీరక శ్రమతో ఒత్తిడిని తగ్గించడంలో దృష్టి పెట్టాలి. ఇది కండరాలకు విశ్రాంతిని అందించడంలో సహాయపడి..ఒత్తిడిని ఎదుర్కొనేందుకు మనస్సు, శరీరాన్ని రీఛార్జ్ చేయడంలో సహాయపడుతుంది.

3. మీకు కోపం తెప్పించే విషయాలు, పరిస్థితులకు సాధ్యమైన పరిష్కారాలను ఆలోచించండి.

4. మీరు ఎదుర్కొంటున్న ఆందోళనను అది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఎదుటి వ్యక్తికి ఫిర్యాదు చేయడానికి బదులుగా వారికి తెలిసేలా వ్యక్తపరచండి.

5. చిన్న చిన్న కారణాలకే వేరొకరిపై పగ పెంచుకోవడం వల్ల మన కోపం రెట్టింపుకావచ్చు. ఎదుటివారిని క్షమించి కోపాన్ని వదలడం మంచిది.

6. హాస్యంతో పరిస్థితిని తేలికపరచవచ్చు. ఇది కోపాన్ని తగ్గించి కూల్ చేయడమే కాకుండా మనసుకు మంచి అనుభూతిని కూడా కలిగిస్తుంది. తగినంత నిద్ర కూడా అవసరమే.. కంటి నిండా నిద్రపోతున్నారా లేదో చూసుకోవాలి. శరీరానికి సరిపడా నిద్ర చాలా అవసరం.

నలుగురితో కలవడం, నచ్చిన పనిని చేయడం మ్యూజిక్ వినడం వంటి వ్యాపకాలు కూడా మనసును రిలాక్స్ మూడ్ లోకి తీసువెళతాయి. లోతైన శ్వాస వ్యాయామాలు లేదా మనతో మనం మాట్లాడుకోవడం పరిస్థితి మెరుగుపడుతుందని భరోసా ఇవ్వడం వంటివి మనస్సును రిలాక్స్ చేయడానికి, కోపాన్ని తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు. పరిస్థతి మన చేయిదాటిపోయిందని తెలిసినపుడు దానిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవడంలో నిపుణుల సహాయాన్ని కోరడం సరైనపని.

Updated Date - 2023-03-07T21:42:27+05:30 IST