Healthy Eyes: కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. ఆ ఫుడ్స్ తీసుకోవాల్సిందే..!

ABN , First Publish Date - 2023-05-15T15:59:06+05:30 IST

ఆకు కూరలు, గోధుమలు, జీడిపప్పులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.

Healthy Eyes: కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. ఆ ఫుడ్స్ తీసుకోవాల్సిందే..!
eye health

శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలలో కళ్ళు ఒకటి. కానీ కంటి సున్నితత్వాన్ని కాపాడుకోవడానికి పెద్దగా లక్ష్యపెట్టరు చాలామంది. కంటి సమస్యలు దాడిచేసినప్పుడో, లేదా కంటి దురద, ఎరుపు కళ్ళు, చికాకుకు ఉన్నప్పుడో తప్పితే కంటి భాగాలను సున్నితంగా చూసుకునేది తక్కువే. అయితే ఇప్పటి రోజుల్లో చుట్టూ కాలుష్యం పెరిగిన కారణంగా గాలి, నీరు అన్నీ కలుషితం అవుతూ వస్తున్నాయి. దీనితో కళ్ళకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సమస్యలు చాలా కారణాల వల్ల వస్తూ ఉన్నాయి. కాలుష్యం నుంచి పోషకాహార లోపం వరకూ అన్నీ కంటి సమస్యలకు కారణాలు. అయ్తే పోషకారంతో చాలావరకూ కంటి చూపుని మెరుగుపరుచుకోవచ్చు. అదెలాగంటే..

విటమిన్ ఎ: మామిడి, బొప్పాయి వంటి కూరగాయలు, పండ్ల రూపంలో పాలు, క్రీమ్ రూపంలో తీసుకోవడం, విటమిన్ ఎ కళ్ళకు చాలా ఆరోగ్యకరమైనది.

రిబోఫ్లావిన్: సోయాబీన్,పనీర్ నుండి పప్పులు, బ్రోకలీ వరకు, ఇవి రిబోఫ్లావిన్ లేదా విటమిన్ B2 సహజ వనరులు.

ఇది కూడా చదవండి: తేనెటీగలు దాడిచేస్తే ఆ నొప్పికి నివారణలు ఏంటంటే..!

కాల్షియం: బాదం, వాల్‌నట్‌లు, రాజ్మా, బజ్రీ, ఓట్స్ రూపంలో, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కాల్షియం రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.

విటమిన్ ఇ: ఆకు కూరలు, గోధుమలు, జీడిపప్పులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.

ఒమేగా 3 కొవ్వులు: ఒమేగా 3 కొవ్వులతో నిండిన కాడ్ లివర్ ఆయిల్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఈ ఆహారాలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Updated Date - 2023-05-15T15:59:06+05:30 IST